Sunday, 23 May 2021

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ గాయకుడు ఇకలేరు

తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాపంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. నిన్న నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో అయిన బీఏ రాజు తుది శ్వాస విడిచారు. ఆ ఘటన నుంచి కోలుకోక ముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. తాజాగా మరో సీనియర్ గాయకుడు కన్నుమూశారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎ.వి.ఎన్‌ మూర్తి మృతి చెందారు. ఇప్పటికే కేవీ ఆనంద్ (కోలీవుడ్ దర్శకులు), రామ్ లక్ష్మణ్ (హిందీ సంగీత దర్శకులు), టాలీవుడ్ సీనియర్ నిర్మాత యు. విశ్వేశ్వరరావు ఇలా ఎంతో మంది ప్రముఖులు కాలం చేశారు. ఇప్పుడు తాజాగా సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ మరణించారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఎ.వి.ఎన్‌ మూర్తి కుమారుడు శ్రీనివాసమూర్తి కూడా సినీ రంగంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. మూర్తి మృతిపై సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు మరణిస్తుండటంపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hT2AaR

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....