Sunday, 23 May 2021

కపట నాటక సూత్రదారి ట్రైలర్: శ్రమ బ్యాంక్ భారీ మోసం.. 99 కోట్ల రూపాయల ఫ్రాడ్..!

నేటితరం ప్రేక్షకులు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే మక్కువ చూపుతున్నారు. వెరైటీ కాన్సెప్ట్, భిన్నమైన కథాకథనాలతో రూపొందిన సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో '' అనే డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా అశ్వినీదత్ చేతుల మీదుగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 29 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ 'కపట నాటక సూత్రదారి' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలతో హైప్ క్రియేట్ చేసుకున్నారు. శ్రమ అనే బ్యాంక్ భారీ మోసం చేయడం, 99 కోట్ల రూపాయల బంగారాన్ని తాకట్టుపెట్టుకొని బోర్డు తిప్పేయడంతో ప్రజలు పడిన కష్టాలు, ఆ దొంగలను ఛేదించే క్రమంలో పోలీసుల తీరు తదితర అంశాలకు ఈ సినిమాలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ.. ''ఈ రోజుల్లో సినిమా పరిశ్రమకు చాలామంది కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తున్నారు. వారు కంప్యూటర్ టెక్నాలజీ విషయంలో అన్నీ నేర్చుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కపట నాటక సూత్రదారి ట్రైలర్‌ చాలా కొత్తగా అనిపించింది. ఈ చిత్రాన్ని క్రాంతి అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా మనీష్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా వీరు చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అందరికి అల్ ది బెస్ట్'' అన్నారు. ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ 'కపట నాటక సూత్రదారి' సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yzz5Aw

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....