నిజమే.. గుండెల్లో అభిమానం ఉప్పొంగడానికి మెగాస్టార్‌ని మించిన గని మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఎంత ఇష్టం అంటే ఆకాశాన్ని చూపించడం తప్ప. ఆ మెగాభిమానానికి కొత్త కొలతలు కనుక్కోవాలే తప్ప.. పరిధి విధించలేం. మెగాస్టార్ సందర్భంగా శ్రీకాకుళం వాసి, రచయిత, అన్నయ్య అభిమాని అని సగర్వంగా చెప్పుకునే రత్న కిషోర్ శంభుమహంతి ‘సగర్వంగా రాస్తున్నా.. ఒక సముద్రం గురించి’ అంటూ రాసిన రైటప్ మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపే విధంగా ఉంది. ‘కలులున్నాయని కలతేదో ఉందని దిగులున్నాదని రేయిని వీడిని హాయి ఏదో ఉందని అనుకుంటూ అనుకుంటూ ఇన్నేళ్లా?? పోవయ్యా.. నీ కల నాది నీ కథ నాది అని అన్నావా అన్నాడు నాన్న కల నాది అని! చరణ్ .. అలాంటి కల రంగుల కలఅతి త్వరలో వెండితెర వెలుగుల్లో మార్మికతకు అందని ఛాయల్లో అనండిక సై రా సై .. బండలు మోశాడో బ్రేక్ డ్యాన్సులు వేశాడో.. సాహసాలు చేశాడో .. కాదు వాటికి మించిన కలలకు ఊపిరి అయ్యాడు..ఊపిరి పోశాడు ఊహకు విస్తృత రూపం ఇచ్చాడు.. అతడు సుప్రీమ్ హీరో.. అతడు మెగాస్టార్ అతడే గత ఏడాది గూగుల్ స్టార్ .. కొణెదల వారింటి పద్మభూషణ్. నియమం తప్పని వేళ - నిబద్ధతను తోడ్కొని పాటించే క్రమశిక్షణ - స్ఫూర్తిదా యకమయిన కఠోర పరిశ్రమ..ఏళ్లకు ఏళ్లు ఆ ఇంటికి వెలుగులు విరజిమ్ము తూనే ఉన్నాయి.ఒక్కడి కష్టం ఫలితంగా కొన్ని ప్రాణ దీపాలు అఖండ జ్యోతు లుగా వెలుగుతున్నాయి. ఒక్కడిదే శ్రమ. ఒక్కడే వెలువరించిన వేదం. ఆ వెలు గే వేదం..ఆ శ్రమయే వేదం.. కొణెదల వారిల్లు కోటి దీపాల మణిహారం..కాదు ఎందరో ప్రాణ దీపాల వెలుగులో ఈవేళ జేగీయమానం.. అమ్మవారిని కొలిచేం దుకు వచ్చి ఈ శ్రీకాకుళం దారులను పలకరిస్తూ/పలకరిస్తూ ఆ ఇంటి దీపం మౌనాన్నే ఆశ్రయించి, అందరికీ వందనాలు చెల్లించారు. మాట్లాడాల్సింది నేను కాదండి ఆ ఆశీర్వచనం ఇవ్వాల్సింది అమ్మకదా!అంటూ వెళ్లిపోయారు.. అలాంటి ఉన్నత సంస్కారం జీవన సహచరి సురేఖది. అందుకే ప్రతిమా టలో/ప్రతి ప్రస్తావనలో/అమ్మలాంటి అమ్మను అన్నయ్య తలుచుకుంటాడు. తమ్ముడు తలుచుకోకుండా ఉండనే లేడు. ఆ ఇంటికి మరికొన్ని ఆర్క్ దీపాల అవసరం ఇప్పుడు లేనే లేదు. ఎందుకంటే అన్నయ్య కృషి ఫలితంగా భగవంతు డు కొన్ని కలలను కళారూపం ఇచ్చి, వాస్తవ చిత్తం నేర్పి,సాకారం చేసి అఖండ దీపాలుగా మలిచి అందించాడు.కనుక అన్నయ్యా ఈ పండుగ వేళ మరికొన్ని దీపాల ప్రాంగణాలను పలకరించాలి మీరు.. ఆ వెలుగు తోరణాల చెంత వెలిగి పో వాలి మీరు. అవును!హ్యాపీ బర్త్డే అన్నయ్యా.. వెన్నెల కవి అన్నట్లు నడిచే నక్ష త్రమే కాదు నడిచే సంద్రం కూడా అతడే! సంద్రం దగ్గర సంద్రం ఎన్నో వేల యోజనాల ప్రయాణం అనంతరం ఓ కొత్త వెన్నెల వసంతాన్ని తీసుకువస్తూ.. ఆ నిలువెత్తు ఠీవికి వందనం. కష్టం ఎప్పుడూ ఇంటి చుట్టంలా ఉంది అని ఉంటుందని ఏనాడూ అనుకోలేదు. పనిగట్టుకుని కొందరు అపఖ్యాతి మోసుకువస్తే దానినీ స్వీకరించాడు. బిడ్డల కష్టాన్ని ఓర్చుకున్నాడు. ఒక్కడిగా ఒంటరిగా కొన్ని కష్టాలకు ప్రతినిధి తానే నని నమ్మాడు. మోసాడు..నవమాసాలూ మోసిన తల్లిలా ఎన్నింటినో ఓర్చుకు న్నాడు/కుంటున్నాడు..ఆ ఇంటి బిడ్డ..అమ్మలాంటి నాన్న..నాన్న నుంచి నే ర్చుకున్న పాఠాలతో ఈనాటి నాన్న.. అలాంటి అన్నను స్మరిస్తున్నాడు పవ న్.. అలాంటి కుటుంబాన్నీ/గౌరవాన్నీ /అది ఇచ్చిన జ్ఞాపకాన్నీ/స్మరిస్తున్నాడు పవన్.. అభిమానులూ మీరంతా ఇంకాస్త సంయమనంతో ఉండాలి. మీ..కేకలు కాదు..ఈలలు కాదు ఇంకేదో కావాలి. అది ఈ దేశ గతిని మార్చే చర్య కావాలి.. ఇంకా మీరు ఎంతో నేర్చుకోవాలి అన్నయ్య నుంచి... అమ్మలాంటి అమ్మను స్మరిస్తున్నానుఅమ్మలాంటి అన్నను స్మరిస్తున్నాను బాధ్యతను స్మరించి హక్కుని నిర్వర్తిస్తున్నానుఅందుకనో ఎందుకనో హక్కుగా ఎదిగిన ఈ బాధ్యతేనినదిస్తోందీ వేళ.. అంటున్నాడు పవన్.. కాలం కొన్నిసార్లు మాత్రమే ఇలా మాట్లాడే అవకాశం ఇస్తుంది. రాళ్లూ రప్పలూ ముళ్ల కంచెలూఅన్నీదాటితే కర్నూలు దారులు వస్తాయని విన్నాను. అవును!నది చెంత పుట్టిన వీరుడు రేనాటి వీరుడు వాడు అని విన్నాను. అలాంటి వీరు డు చరిత్ర గుర్తించని వీరుడు అతడని పవన్ అంటున్నాడు. అలాంటి స్మరణలో చిర స్మరణీయం కానీయని ఓ వీరుని కథ సినిమాగా రూపాం తరం చెంది, దశ దిశాంతరం కానుంది అని ప్రబల చిత్తాలను తోడ్కొని నమ్ముతున్నాడు పవన్. ఆయనతో పాటు మరికొందరు ఇంకొంచెం బిగ్గరగా అరుస్తున్నారు. చరిత్ర కోసం చరిత్ర..రానున్న చరిత్ర రాయంచ నడకల హొయలు వివరించ దు. ఈ దేశ గతి కి మరో కొత్త అధ్యాయం కానుంది.అలాంటి చరిత్ర కోసం సిద్ధం చేస్తున్నపుటల న్నీ కొత్త సుగంధాలను పూసుకుంటున్నాయి. రాణీ ప్రేమ పురాణాలు.. వదిలే సిన రతికేళీ విలాస గదులు ఇవి కాదు కదా చరిత్ర అని ఏనాడోఒకడు నినదిం చాడు. రేనాటి మట్టి నుంచి పుట్టిన చరిత్ర ఆధునిక ఆంధ్రావనికి వస్తున్న వేళ, యావత్ భారతావనికీ విస్తరిస్తున్న శుభ సమయాన పవన్ తో సహా ఇంకొంద రు ఉప్పొంగిపోతున్నారు. చాలా చిన్నప్పుడు అనుకుంటాను.. అన్నయ్య పాటలు వింటున్నాను. నటన అంటే ఏంటి డైలాగ్ అంటే ఏంటి వీటి దగ్గర నాకేమీ తెలియని చిన్నతనం అది. అన్నయ్య ఎప్పుడూ జగదేకవీరుడు..నా ఊహా సుందరి ఎప్పుడూ అతిలోక సుందరే.అన్నయ్య దగ్గర మేమంతా చిన్నవారం.అదొక సముద్రం రా మనం చూస్తూ ఉండిపోవాలి.ఆ ఉప్పుటేరు గాలుల శ్వాసల్లో హాయిగా సాయంకాలాలు ప్రేమను అందుకుంటూ సేద తీరాలి.అన్నయ్యా!ఈ రోజు సగర్వంగా రాస్తు న్నాను ఎవ్వరు ఏమన్నా పర్లేదు నేను నీ అభిమానిని.. కాదు నువ్వే నా అభి మానివి.ఒకప్పుడు నేను నీ వెంట/ఇప్పుడే నేనే అంతా..అంత గర్వం ఈ రోజు ఉంది.. ఈ సంద్రం ఇచ్చిన గర్వం ఇది. అన్నయ్యా!నీ దగ్గర ఓటములు నీ దగ్గర గెలుపులు ఏంటని నవ్వుకుంటాను. ఏంటని.. నవ్వుకుంటాను. ఉండండి.. అన్నయ్యా! ప్రేమించిన అమ్మా యిని మీకు పరిచయం చేస్తాను.. ఆమె కోసం రాసిన ప్రేమ కావ్యాన్ని మీతోనే ఆవిష్కరింపజేస్తాను. మేం ఓడమా.. ఓ ఒంటరికి ఇంత సాహసమా.. ఓ ఇంటర్ పోయిన విద్యార్థి ఇంతలా రాణిస్తాడా. ఏమో తెలియదు..నా వైఫల్యాల ఉటంకిపు కాదు కానీ నీ కష్టాల దగ్గర ఇక్కడున్నవారంతా చిన్నవారే!బహుశా! లవ్యూ అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే ఎగైన్ అండ్ ఎగైన్ - రత్నకిశోర్ శంభుమహంతి
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gjDIo9
No comments:
Post a Comment