Saturday, 1 August 2020

సెక్స్ కోసమే నేను ట్రాన్స్ జెండర్‌గా మారలేదు.. ఆ ఆపరేషన్ చాలా నొప్పి కాని..: జబర్దస్త్ పింకీ

జబర్దస్త్‌లో సాయి తేజగా ఎంట్రీ ఇచ్చి.. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలో అమ్మాయిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు జబర్దస్త్‌ని వదిలేసి టాన్స్ జెండర్‌గా మారడం కోసం ఆపరేషన్ చేయించుకుని తిరిగి ప్రియాంక (పింకీ)గా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ట్రాన్స్ జెండర్ కావడం అంత ఈజీ కాదు అంటున్నారు ప్రియాంక అలియాస్ సాయి తేజ. ‘నాలా ట్రాన్స్ జెండర్ అవ్వాలి అనుకునేవాళ్లు.. ముసుగులో గుద్దులాట అన్నట్టుగా కాకుండా అవ్వాలనిపిస్తే అవ్వడమే. అయితే ట్రాన్స్ జెండర్ మారాలని అనుకుని ఆపరేషన్ చేసుకున్నవారికి పెయిన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. అయితే నువ్ ట్రాన్స్ జెండర్ కావాలనుకున్నది మంచి కోసమా?? చెడు కోసమా? అన్నది మనలోనే ఉంటుంది. నేను ఈ పని మాత్రమే చేయగలను అనుకుంటే అదే చేయగలం. లేదూ.. నా వర్క్ ఇది కాదు అనుకుంటే.. అది కూడా చేయొచ్చు. ఈ విషయంలో జెండర్ అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్ ఏం చేస్తున్నావ్ ఎలా చేస్తున్నావ్ అన్నదే ముఖ్యం. సమాజంలో టార్స్ జెండర్స్ అంటే సెక్స్ అండ్ ప్రాస్టిట్యూట్‌గా మాత్రమే చూస్తారు. అయితే ఎవరు ఏం అనుకున్నా... అది మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను సెక్స్ వర్క్ చేయాలని అనుకుంటే.. అదే చేస్తాం. జాబ్ దొరకడం లేదు.. బెగ్గింగ్ మాత్రమే చేయగలం అనుకుంటే ఇక అదే చేస్తారు. ఇవన్నీ వద్దూ.. నాకు టాలెంట్ ఉంది.. దానికి తగ్గ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఒక కంపెనీలో కాకపోతే ఇంకో కంపెనీలోనైనా ఉద్యోగం వస్తుందనేది నా ఒపీనియన్. చాలామంది సెక్స్, వ్యభిచారం కోసం టార్స్ జెండర్‌గా మారుతున్నారు. వీళ్లు చేజేతులా జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్తున్నా.. నేనైతే సెక్స్ కోసమో.. వేరే దాని కోసమో కాదు అమ్మాయిగా మారింది. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అవకాశం వస్తుంది. మనకి తెలిసి తప్పు చేయకూడదు.. ప్రయత్నం ఆపకూడదు. సాయి తేజగా ఉండకూడదనే నేను ప్రియాంక అయ్యింది. నన్ను నేను స్టార్‌గా చూసుకోవాలనే ప్రియాంకగా మారాను. నా గోల్ జబర్దస్త్ మాత్రమేకాదు.. మంచి స్టార్ అవ్వాలి.. పెద్ద మోడల్ అవ్వాలి. జీరో సైజ్ కోసం ట్రై చేస్తున్నా.. మోడలింగ్ తెలుగులోనే కాకుండా హిందీలో చేస్తున్నా. కన్నడలో సినిమాలు చేశా కాబట్టి అక్కడ కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అటువైపుగా ప్రయత్నాలు చేస్తున్నాను.. నా కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అమ్మాయిగా మారాలని అనుకున్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానా?? అని తరువాత అనిపించింది కాని.. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. సర్జరీ టైంలో భయంకరమైన పెయిన్స్ ఉండేవి. నా వెయిట్ 85 వరకూ పెరిగిపోయింది. మెడ కూడా పక్కకు తిప్పలేని పరిస్థితి. బెడ్ మీద నుంచి వాష్ రూంకి వెళ్లాలంటే 20 నిమిషాల టైం పట్టేది. ఒంటి నిండా నీరు పట్టేసేది. ఇలా చాలా కష్టపడ్డా. చాలా కష్టపడి స్లిమ్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని అనుకునేదాన్ని.. నాకు 20 ఏళ్లు వచ్చాక.. బాడీలో మార్పులు చూసి టాన్స్ జెండర్‌గా మారాను. నా ఆపరేషన్ ముందు టీం సభ్యులతో ఎలా ఉన్నానో.. తరువాత కూడా అలాగే ఉన్నాను. టీం లీడర్లతో నాకు పెద్దగా రిలేషన్ ఉండదు. నా పని చూసుకుని నేను వచ్చేస్తా.. వాళ్లతో కాస్త క్లోజ్‌గా ఉంటే ఏమనుకుంటారనే ఆలోచనతో నా పని చూసుకుని వచ్చేస్తా. ట్రాన్స్ జెండర్‌గా అయ్యానని వాళ్లు అవకాశాలు ఇవ్వకపోవడం.. వేరు చేయడం లాంటివి లేవు అంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XheVKx

No comments:

Post a Comment

'BJP Never Takes Any Election Lightly'

'They contest to ensure they win the election.' from rediff Top Interviews https://ift.tt/qyUaPg8