
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 22. ఈ నెంబర్ అనేది ఈ సినిమాలో మేజర్ పాయంట్ అంటున్నారు హీరో . స్టోరీలైన్ ఇప్పుడే రివీల్ చేయలేను కానీ ఈ సినిమా డెఫినెట్‌గా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయం అంటూ సినిమా విశేషాలు చెప్పారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్2 హీరో రూపేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.. ఆ విశేషాలు.. మీ నేపథ్యం..? మాది బిజినెస్ ఫ్యామిలీ. నేను కూడా మా నాన్నగారికి సపోర్ట్‌గా ఉండి బిజినెస్ చూసుకునేవాడిని. అయితే నాకు చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ ఉంది కాని ఇండస్ట్రీలోకి రాగలమా యాక్టింట్ చేయగలమా అని ఒక సందేహం కూడా ఉండేది. మనకు ఇష్టమైన పని చేయడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని కన్వీన్స్ చేసి ఈ రంగంలోకి రావడం జరిగింది. ఇక్కడకు రాకముందు చాలా భయాలు ఉండేవి. కాని ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇష్టమైన పని కావడంతో వర్క్ శాటిస్‌ఫ్యాక్షన్ లభించింది. దర్శకుడు శివతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాకు శివను ఆనీ మాస్టర్ పరిచయం చేశారు. మేమిద్దరం కలిసి ఒక వెబ్‌సిరీస్ చేశాం. ఆ తరువాత 22 కథ విన్నాను. కథ వింటున్నప్పుడే ఎగ్జయిట్ అయ్యాను. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అనగానే లోపల ఆనందం వేసినా మెదటిసినిమాలోనే ఇంత ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయగలనా? అని భయం కూడా కలిగింది. అయితే మొదటి సినిమాలోనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం గర్వంగా ఉంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా? ఈ క్యారెక్టర్ కోసం నన్ను నేను పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ చేసుకున్నాను. కులదీప్ సేటీ అనే సెలబ్రిటీ ట్రైనర్ సహాయంతో ఆరు నెలలు జిమ్ చేసి బాడీ బిల్డ్ చేశాను. అలాగే 'ఖైది నంబర్ 150', 'బాహుబలి', 'సాహో' వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన జాషువా మాస్టర్ మా సినిమాలో అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఆయన దగ్గరే కుంగ్‌ఫూ, మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడానికి ఎవరినైనా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారా? సాదారణంగానే నాకు పోలీసులంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు పోలీసులంటే ఇష్టంతో పాటు గౌరవం కూడా పెరిగింది. 'టెంపర్' మూవీలో జూనియర్ ఎన్టీఆర్, అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'గబ్బర్‌సింగ్'తో పాటు మరికొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని నటించాను. 22 సినిమా ఎలా ఉండబోతుంది? ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. 22 నెంబర్ అనేది ఈ సినిమాలో మేజర్ పాయంట్. స్టోరీలైన్ ఇప్పుడే రివీల్ చేయలేను కాని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను డెఫినెట్‌గా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. డైరెక్టర్ శివ కుమార్ మేకింగ్ గురించి? శివకి ఇది మొదటిసినిమా అయినా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ లా ఒక క్లారిటీతో సినిమా తీశారు. నేను శివ అన్ని విషయాలు ముందే డిస్కర్స్ చేసుకోవడంతో మేకింగ్, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావీష్‌గా సినిమా తీశారు. అలాగే కథ చెప్పిన విధానం, సినిమా తీసిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో పాటు నా పెర్ఫామెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ, హెయిర్, మేకప్, కాస్ట్యూమ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుని నన్ను స్క్రీన్ మీద పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ `రుద్ర`గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. టీజర్, సాంగ్ రిలీజ్ అయ్యియి కదా రెస్పాన్స్ ఎలా ఉంది? టీజర్ అలాగే మార్ మార్ కె జీనా హై సాంగ్ ని విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ లాక్‌డౌన్‌లో చాలా మంది ఫోన్ చేసి సినిమా విడుదల కోసం చాలా క్యూరియస్ గాఎదురుచూస్తున్నాం అని చెప్పారు. సినిమాపై హైప్ క్రియేట్ అవడంతో మంచి బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఓటిటి, హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం కూడా అప్రోచ్ అవుతున్నారు. అయితే ఇది ఒక బిగ్‌స్క్రీన్ ఎంటర్‌టైనర్. అందుకే థియేటర్ రిలీజ్‌కే ప్రిపరెన్స్ ఇచ్చి ఈ కోవిడ్- 19 వ్యాప్తి తగ్గి తిరిగి థియేటర్స్ ఓపెన్ చేయగానే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. హీరోయిన్, మిగతా ఆర్టిస్ట్‌ల గురించి? 'ఫలక్‌నుమాదాస్' చిత్రంలో జోయా పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెది కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న సీబిఐ ఆఫిసర్ క్యారెక్టర్. నాతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌లో నటించింది. ఈ సినిమాలో మా ఇద్దరి క్యారక్టరైజేషన్స్ అండ్ పిక్చరైజేషన్ స్టైల్ స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలుస్తాయి. అలాగే జయప్రకాష్, రాజేశ్వరి నాయర్, ఫిదా శరణ్య, పూజ రామచంద్రన్, రవివర్మ, దేవి ప్రసాద్ ఇలా మంచి పేరున్న ఆర్టిస్ట్‌లు, సీనియర్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. విలన్‌గా ఒక బాలీవుడ్ నటుడిని తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అని మా టీమ్ అందరం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నాకు హార్ట్ ఎటాక్` సినిమాలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు విక్రమ్‌జిత్ విర్క్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది అనిపించి ఆయనను సంప్రదించాం. ఆయనకు క్యారెక్టర్ బాగా నచ్చడంతో మెయిన్ విలన్‌గా నటించారు. అది సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది. టెక్నికల్‌గా సినిమా ఎలా ఉండబోతుంది? ''రంగస్థలం, భరత్ అనే నేను, మహర్షి, సైరా, విజిల్'' లాంటి పెద్ద పెద్ద సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన `మ్యాన్‌ట్రిక్ స్టూడియోస్ ప్రై.లి` ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. అది కూడా మా సినిమాకు మంచి ప్లస్ అయింది. ఫ్రెండ్‌షిప్ డే రోజే మీ బర్త్‌డే వచ్చింది కదా..మీ స్నేహితుల గురించి? నాకు చిన్నప్పటినుండి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అయితే ఇప్పుడు శివతో పాటు 22 సినిమా యూనిట్ అందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారందరికీ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో రూపేష్ కుమార్ చౌదరి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39NYLxf
No comments:
Post a Comment