Friday, 1 May 2020

Renu Desai: పవన్ కూతురు ద్విపాత్రాభినయం వీడియో.. కాన్సెప్ట్, డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్ అన్నీ ఆద్యనే

మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, మెగా ప్రిన్స్, మెగా స్టైలిష్ స్టార్, సుప్రీం హీరో ఇలా మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. అయితే ఎంత మంది హీరోలు ఉన్నా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకమైనదే. అయితే ఆయన ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా మారి సినిమాలకు గుడ్ బై చెప్పేసినా.. మళ్లీ ‘వకీల్ సాబ్’ అంటూ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సందర్భంలోనూ ఇతర మెగా వేడుకల్లో ఎక్కువగా వినిపించే మాట.. పవన్ వారసుడు జూనియర్ పవన్ అఖిరానందన్ వెండితెరపై కనిపించేది ఎప్పుడు అని. పవన్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌పై అకిరానందన్‌ని చూడాలనేది మెగా అభిమానుల కల. అయితే అఖిరా నందన్ రావడం లేటవ్వొచ్చేమో కాని రావడం మాత్రం పక్కా అంటూ ఇటీవల మెగాస్టార్ క్లారిటీతో కూడిన మెసేజ్ ఇవ్వకనే ఇచ్చారు. అఖిరానందన్ హీరో మెటీరియల్ అనడానికి అతని 6.4 ఫీట్స్ హైట్స్ ఒక కారణం అయితే.. అఖిరా ఈ విషయంలో మా అందర్నీ దాటేశాడంటూ మెగాస్టార్ ప్రశంసించారు. ఇక అఖిరానందన్‌ హీరో అవుతాడా? లేక తనకు ఇష్టమైన రంగం వైపు వెళ్తాడా? అన్న విషయంలో మెగాఫ్యామిలీ కంటే కూడా అతన్ని పెంచి పెద్ద చేసిన తల్లి రేణు దేశాయ్‌ పాత్రే ఎక్కువ. ప్రస్తుతం పవన్-రేణు బిడ్డలు అఖిరా, ఆద్యలు రేణుదేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే అఖిరా హీరో అవుతాడా లేదా? అన్న విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ అతని కంటే ముందుగా పవన్ కూతురు మాత్రం సినీరంగ ప్రవేశం చేయడానికి ఎంతో సమయం లేదని చెప్పకనే చెప్పింది రేణు దేశాయ్. ఇన్ స్టాగ్రామ్‌లో ఇప్పటికే పవన్ కూతురు ఆద్యకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన రేణు.. తాజాగా ఆద్యలోని మల్టీటాలెంట్‌ను ప్రేక్షకులకు చూపిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో డాక్టర్‌గా పేషెంట్‌గా ద్విపాత్రాభినయం చేసింది ఆద్య. ఈ ఫన్నీ వీడియో కాన్సెప్ట్ రచన, డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్ అంతా ఆద్యనే అంటూ ఇన్ స్టా‌గ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది రేణు దేశాయ్. ఈ వీడియోలో డాక్టర్‌గా ఉన్న ఆద్య.. ‘బాడ్ న్యూస్ ఈజ్ మీరు ఇంకా 24 గంటలే బ్రతికి ఉంటారు’ అని చెప్పడం.. దానికి పేషెంట్ షాకై విచారిస్తుండగా.. ‘రియల్లీ బాడ్ న్యూస్ ఈజ్ అది నిన్ననే చెప్పానుగా’.. పంచ్ పేల్చింది ఆద్య. మొత్తానికి అఖిరా వెండితెరపైకి రావడం లేటు కావొచ్చేమో కాని.. ఆద్య మాత్రం ఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటూ.. అయినా నటన వాళ్ళ బ్లడ్‌లోనే ఉంది ఈరోజు కాకపోతే రేపటి రోజునైనా వెండితెరపై అలరిస్తారంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు మెగా అభిమానులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3d5S5Lz

No comments:

Post a Comment

Jaya Bachchan: 'I Really Enjoyed Being Wicked'

''There is not a single day in my life when I don't look at Sweta and Abhishek with pride, for being such fine human beings....