Saturday, 2 May 2020

నిహారిక రొమాంటిక్ మూడ్.. కుర్రాడితో రెచ్చిపోయిన మెగా డాటర్.. వీడియో వైరల్

ఇన్నాళ్లు పద్దతిగా కనిపించిన మెగా డాటర్ మెల్లగా గ్లామర్ తలుపులు తెరుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫొటోలే ఇందుకు నిదర్శనం. మోడ్రన్ డ్రెస్సులేసి హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న నిహారిక.. ఇకపై తాను వెండితెరపై గ్లామర్ డోస్ పండిస్తానని ఇటీవలే ప్రకటించేసింది. అందుకు తగ్గట్టుగానే అడుగులేస్తూ తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్‌పై డాన్స్ చేస్తూ కుర్రాడితో రెచ్చిపోయింది మెగా డాటర్. ఇన్నాళ్లు పద్దతిగా కెమెరా ముందు కనిపించిన ఆమె.. సినిమాలు, వెబ్ సిరీస్ ఏదైనా అందాలు ఆరబోసేందుకు రెడీ అంటూ టాలెంట్ బయటపెడుతోంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ఈ రొమాంటిక్ సాంగ్‌లో తనలోని హాట్‌నెస్, టాలెంట్ రెండింటినీ ఎలివేట్ చేస్తూ రెచ్చిపోయింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెలి’ సినిమాలోని మనోహర పాట మ్యూజిక్‌పై డాన్స్ చేస్తూ అట్రాక్ట్ చేసింది నిహారిక. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ యశ్‌తో కలిసి రొమాంటిక్ మూడ్‌లో ఆమె వేసిన చిందులు నెటిజన్లను మైమరిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Also Read: ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్‌సిరీస్‌తో కెమెరా ముందుకొచ్చిన నిహారిక.. 'ఒక మనసు' సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చి ఆశించిన మేర రిజల్ట్ రాబట్టలేకపోయింది. ఇప్పటిదాకా ఆమె చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగేయకుండా ఇకపై గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్దమే అంటూ నటనపై ఉన్న ఆసక్తిని బయటపెట్టింది నిహారిక. సో.. చూడాలి మరి ముందు ముందు నిహారిక ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఇస్తుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yjosaR

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....