Saturday, 2 May 2020

అస్సలు బోర్ కొట్టొద్దు.. ఆమెతో ఉండే ప్రతి రోజు.. విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

బ్యాచిలర్ హీరోహీరోయిన్ల పెళ్లి ముచ్చట్లంటే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏ హీరో ఎవరితో డేటింగ్ చేస్తున్నారు, ఏ హీరోయిన్ ఎవరితో ఎఫైర్ నడుపుతోంది లాంటి సంగతులపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు జనం. అయితే ఆ ఆసక్తిని క్యాచ్ చేసుకుంటూ తన పెళ్లి విషయమై స్పందించారు . ఈ మేరకు తనకు కాబోయే భార్య ఎలా ఉండాలనే సంగతులు మీడియాతో పంచుకున్నారు మన టాలీవుడ్ రౌడీ స్టార్. లాక్‌డౌన్‌ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్న ఆయన జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ పెళ్లిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. తన పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదని చెప్పిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం చాలా విషయాలపై దృష్టిపెట్టి ఖాళీ లేకుండా పని చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తన టార్గెట్ అంతా కెరీర్ పైనే ఉందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనను ఇంకా చిన్న పిల్లాడిలానే చుస్తున్నారు కానీ అప్పుడప్పుడూ పెళ్లిపై చిన్న చిన్న హింట్స్ ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తనకు కాబోయే వైఫ్ ఎలా ఉండాలనే విషయం కూడా ప్రస్తావించారు విజయ్. సెన్సాఫ్ హ్యూమర్‌తో పాటు దయాగుణం ఉండే అమ్మాయిలంటేనే తనకు ఇష్టమని చెప్పారు. తనతో జీవితం పంచుకునే భాగస్వామి తననెప్పుడూ నవ్విస్తూనే ఉండాలని అన్నారు. ఎంతలా అంటే ఇంట్లో ఆమెతో గడిపే ప్రతి రోజు ఓ హాలిడేలా గడిచిపోవాలని, అస్సలు బోర్ కొట్టొద్దని చెప్పారు. తనకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టమని, వ్యక్తిగా మరింత పరిణితి చెందాక పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో సాఫీ ప్రయాణం కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలో నటిస్తున్నారు. ఆయన కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు '' అనే పేరు పరిశీలనలో పెట్టారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aVEfdk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....