Saturday, 2 May 2020

అందుకే ఇలా బ్యాచిలర్‌గా ఉండిపోయా.. మ్యారేజ్ సిస్టంపై సుబ్బరాజు కామెంట్స్

పెళ్లి అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో ఓ విలువైన, ముఖ్యమైన ఘట్టం. మనిషి జీవితం పెళ్ళితోనే సంపూర్ణమవుతుందని అంటుంటారు పెద్దలు. అయితే ఎవరెన్ని చెప్పినా కొందరు మాత్రం పెళ్లిపై కాస్త భిన్నంగా ఆలోచిస్తూ పెళ్లి చేసుకోకపోవడానికి తమదైన రీజన్స్ చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ కమెడియన్, ఆర్టిస్ట్ తాను ఇప్పటిదాకా పెళ్లెందుకు చేసుకోలేదనే దానిపై స్పందించాడు. తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుబ్బరాజు. విలన్ హావభావాలు ప్రదర్శిస్తూనే కమెడియన్‌గా హాస్యం పండించడం సుబ్బరాజులో ఉన్న స్పెషల్ క్వాలిటీ. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన శైలి ఉన్న ఆర్టిస్టుగా క్రెడిట్ కొట్టేశారాయన. బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే ఆయన నిజ జీవితం విషయానికొస్తే అందరికీ తెలియని నిజం ఒకటుంది. 43 ఏళ్ల వయసున్నా ఇంకా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండి పోయాడు సుబ్బరాజు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై స్పందించిన సుబ్బరాజు.. పెళ్లి చేసుకోవాలంటే కేవలం వయసు మాత్రమే ఆధారం కాదని అన్నాడు. ఏదో నాకు 25 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి లేదా అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నేను చేసుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని చెప్పాడు. జీవిత భాగస్వామికి తాను బెస్ట్ ఇవ్వగలను, ఏ లోటు రాకుండా చేసుకోగలను అని అనిపించినప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం సుబ్బరాజు.. 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తున్నాడు. స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2yZO50k

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....