Wednesday, 2 February 2022

DJ Tillu: హీరోయిన్ పుట్టుమచ్చలపై జర్నలిస్ట్ వెకిలి ప్రశ్న.. తాట తీసిన నేహా శెట్టి

చేతికి మైక్ దొరికింది కదా అని నోటికొచ్చినట్టు పేలితే ఇదిగో రియాక్షన్ ఎలాగే ఉంటుంది. తిక్క తిక్క ప్రశ్నలేస్తే చెంప చెల్లుమనిపించే సమాధానం ఇచ్చింది ‘’ సినిమా హీరోయిన్ . ఫిబ్రవరి 11న రిలీజ్‌కి రెడీ అయిన ‘డీజే టిల్లు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్‌గా ఘోరంగా అవమానిస్తూ పిచ్చి ప్రశ్నవేశాడు అనబడే సీనియర్ జర్నలిస్ట్. ‘డీజే టిల్లు’ ట్రైలర్‌‌లో రొమాంటిక్ సీన్‌లో భాగంగా.. ‘నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి’ అని హీరో సిద్ధు.. నేహా శెట్టిని అడుగుతాడు. దీనికి నేహా శెట్టి 16 అని సమాధానం ఇస్తుంది. అయితే ట్రైలర్ లాంఛ్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతుండగా.. మైక్ తీసుకున్న ఈ జర్నలిస్ట్ ప్రబుద్దుడు అసభ్యకరమైన ప్రశ్న సంధించాడు. ‘ట్రైలర్‌లో హీరోయిన్ పుట్టు మచ్చల గురించి చెప్పారు కదా.. రియల్‌గా తెలుసుకున్నారా? ఆమెకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో’ అని వెకిలి ప్రశ్న వేశాడు.. అసలు ఇలాంటి ప్రశ్న వేయొచ్చా? అదీ అందరి ముందు ఓ హీరోయిన్ గురించి ఇలా అడగొచ్చా అనే ఇంగితం లేకుండా ప్రశ్న వేసి.. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు సదరు జర్నలిస్ట్. అయితే హీరో సిద్దు మాత్రం చాలా హుందాగా స్పందించాడు.. ఆ ప్రశ్నని అవాయిడ్ చేద్దాం అని అన్నాడు. అయితే అదే స్టేజ్‌పై హీరోయిన్ నేహా శెట్టి ఉన్నప్పటికీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల అందులో ఉన్న బూతుని అర్ధం చేసుకోలేకపోయింది. అయితే ఇదీ మన జర్నలిజమ్ అంటూ సురేష్ కొండేటి హీరోయిన్‌పై చేసిన వెకిలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వేదికగా సదరు జర్నలిస్ట్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది నేహా శెట్టి. ‘‘డీజే టిల్లు’ ట్రైలర్ లాంచ్‌లో ఈ ప్రశ్న చాలా దురదృష్టకరం. దీన్నిబట్టి.. తనచుట్టూ పనిచేసే మహిళల, ఇంట్లో మహిళలను ఎంత గౌరవిస్తున్నాడో అర్ధమైపోతుంది’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ రిపోర్టర్‌ని ఏకిపారేస్తున్నారు. ఇంత జరుగుతుంటే మరి ఆ సినిమా నిర్మాత, ప్రొడ్యుసర్లు ఏం చేశారయ్యా అంటే.. నిర్మాత నాగ వంశీ హీరోయిన్‌కి సారీ చెప్తూ ట్వీటాడు కానీ.. స్టేజ్‌పై ఆ రిపోర్టర్‌కి తానేమీ తక్కువ కాదు అన్నట్టుగా ప్రవర్తించాడు. మరో జర్నలిస్ట్ ‘ఇది నాగ వంశీగారి బయోపిక్ కాదు కదా..’ అని అడిగితే.. ఈయన కూడా నోరు అదుపులో పెట్టుకోలేకపోయాడు. ‘ఇంత అందమైన అమ్మాయిని ముద్దుపెట్టుకునే అవకాశం వస్తే మనమూ యాక్ట్ చేస్తాం.. తప్పేం ఉంది’ అని అనేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Vp6cjR4Kn

No comments:

Post a Comment

The IIM-A MBA Who Created Pataal Lok

'When I am working on a series, be it Paatal Lok on Amazon Prime or Kohrra on Netflix, I never take it for granted that we will be back ...