Thursday 3 February 2022

డబ్బుల్లేక ఒక్క పూటే భోజనం.. కుటుంబమంతా నెగెటివ్‌ ట్రీట్! సమంత ఎమోషనల్

జీవితమనేది ఒడిదొడుకుల ప్రయాణం. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి వ్యక్తి జీవితంలో క్లిష్ట సమయమంటూ ఒకటి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో నెగ్గుకొచ్చిన వారే విజయ తీరాలకు చేరగలుతారు. హీరోయిన్ లైఫ్ లోనూ అలాంటి సిచుయేషన్ ఉందట. కెరీర్ ఆరంభానికి ముందు సమంత ఎన్నో కష్టాలు అనుభవించిందట. ప్రస్తుతం స్టార్ స్టేటస్‌తో కీర్తించబడుతున్న ఆమె లైఫ్ జర్నీతో కొన్ని అవనమానాలు, మరికొన్ని చెప్పుకోలేని కష్టాలు కూడా ఉన్నాయట. రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాలపై సామ్ ఓపెన్ అయింది. తల్లిదండ్రుల కోరిక మేరకు చదువులో టాపర్‌గా నిలిచేదట సమంత. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో టాప్ స్టూడెంట్ అయిన ఆమె, డబ్బులు లేని కారణంగా డిగ్రీలో జాయిన్ కాలేక చదువు మానేయాల్సి వచ్చిందట. అప్పటి నుంచి ఏదో ఒక పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ వచ్చేదట. హీరోయిన్‌గా అవకాశాలు రాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా వెళ్ళేదట సమంత. అందుకుగాను రోజుకు 500 రూపాయలు ఇచ్చేవారట. ఒకానొక సమయంలో డబ్బులు లేక రోజుకు ఒక్క పూట భోజనం చేసి గడిపిన రోజులు కూడా ఉన్నాయట. అయితే మోడలింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆ దిశగా వెళుతుంటే మొదట్లో కొందరు కుటుంబ సభ్యులు నెగెటివ్‌గా ట్రీట్ చేశారట. నీకిది అవసరమా అంటూ వెనక్కిలాగే ప్రయత్నాలు కూడా జరిగాయట. కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగేసి పట్టుదలతో ఈ రోజు ఈ స్థాయికి చేరిందట సమంత. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా ఈ విషయాలన్నీ సమంతనే స్వయంగా చెప్పింది. ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా బిజీ బిజీగా ఉన్న సమంత.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ రాణించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అవకాశాల వేట కొనసాగిస్తూ కెరీర్‌పై పూర్తి శ్రద్ద పెట్టింది. రీసెంట్‌గా తన భర్త నాగ చైతన్యతో డివోర్స్ జరిగినా ఆ చేదు అనుభవాలను మదిలోకి రానీయకుండా చాలా స్ట్రాంగ్‌గా సమంత ముందుకెళ్తుండటం చూస్తున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WpOuMf5

No comments:

Post a Comment

'Cancelling Adani Project Not Good Sign'

'If there is a push towards a Marxist oriented government it will be dangerous.' from rediff Top Interviews https://ift.tt/Iy8vqEL