Saturday 5 February 2022

Allu Arjun : రైల్వే శాఖ కూడా ‘పుష్ప’ను వాడేసుకుందిగా!

ఐకాన్ స్టార్ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఈ సినిమాలోని ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఓ వైపు పాజిటివ్‌గానూ, మరోవైపు నెగిటివ్‌గానూ వెళ్తోంది. ఈ డైలాగ్‌పై పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేయగా.. టీఆర్ఎస్ నేత కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా క్రేజ్‌ను వాడుకొని కొన్ని సంస్థలు తమకు కావాల్సిన ప్రచారాలు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కూడా ‘పుష్ప’ మేనియాను వాడేసుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే పుష్పలోని ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్ క్రియేట్ చేసింది. రైలు పట్టాలు లేదా ట్రాక్‌లపై నడిచేదేలే అనే అర్థం వచ్చేలా హిందీలో రాసి ఉన్న పోస్టర్‌ను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘ప్రయాణికులు భద్రతే మాకు ముఖ్యం. రైలు పట్టాలపై నడవడం లేదా దాటడం చేయొద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా సబ్‌వేలను ఉపయోగించండి’’ అని ఆ ట్వీట్‌లో దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఈ సినిమాలోని శ్రీవల్లి ట్యూన్‌ను వాడుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు హైదరాబాద్ పోలీసులు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిపించేందుకు పుష్ప డైలాగులను వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కరోనా నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కూడా పుష్ప డైలాగును వాడుకున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో రష్మిక మందనా హీరోయిన్‌గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. అనసూయ, సునీల్, ఫాహద్‌ పాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజుల్లో మొత్తం రూ.365 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. బన్నీ కెరీర్‌లోనే 300 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది పుష్ప ది రూల్ విడుదలకు సన్నద్దం కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MCNARws

No comments:

Post a Comment

'I'd Love To Romance Rekha Ma'am'

'Romance not in a physical manner maybe, but, you know, where you are just sharing dialogues and looking at each other and conversations...