Monday, 28 February 2022

మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారు.. చాలా ఇబ్బంది పడ్డా! ఓపెన్ అయిన సుప్రిత

షూటింగ్ అన్నాక బోలెడన్ని టేక్స్ ఉండటం కామన్. సీన్ ఏదైనప్పటికీ దర్శకుడికి నచ్చే వరకు ఆ సీన్ షూట్ చేస్తూనే ఉంటారు. అయితే రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాల మాటేంటి అంటారా? అవన్నీ కూడా నటనలో ఓ భాగమే కాబట్టి షూటింగ్‌ విషయంలో దేనికీ మినహాయింపు ఉండదు. కొత్త నటీనటులైతే ఇలాంటి సీన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీనియర్ నటి సురేఖా వాణి కూతురు విషయంలో కూడా అదే జరిగిందట. ఓ సీన్ కోసం ఆమెతో మళ్ళీ మళ్ళీ ముద్దులు పెట్టించుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుప్రితనే వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కెమెరా ముందుకు రాకుండానే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది సుప్రిత. నిత్యం ఆన్ లైన్ వేదికపై తన డాన్సులు, ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రమంలోనే తల్లి సురేఖా వాణి బాటలో రీసెంట్‌గా కెమెరా ముందుకొచ్చి అట్రాక్ట్ చేసింది సుప్రిత. కాకపోతే సినిమాల్లో కాకుండా ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించింది. ఇద్దరు ప్రేమికుల మ‌ధ్య ఎమోష‌న్స్‌ తెలియ‌జేసేలా ‘’ అనే పేరుతో ఈ ఆల్బమ్ షూట్ చేసి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో సుప్రిత ప్రేమికుడిగా ర్యాప్ సింగ‌ర్ రాకీ జోర్దాన్‌ న‌టించారు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రిత షూటింగ్ తాలూకు విశేషాలు పంచుకుంది. ఈ సాంగ్‌లో ముద్దు సీన్ చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది. ఆ టేక్ తనతో మళ్ళీ మళ్ళీ చేయించుకున్నారని, రెండు రోజులు ఆ సీన్ షూట్ చేశారని తెలిపింది. లైఫ్‌లో ఈ హగ్గులు, కిస్సులు ఎప్పుడూ కాలేదు కదా అందుకే చాలా ఇబ్బందిగా అనిపించిందంటూ సుప్రిత చెప్పిన సంగతులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తండ్రి లేని బాధను, జీవితంలో కష్టాలను కూడా ఇదే ఇంటర్వ్యూలో సుప్రిత పంచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/kgsMpWo

NFT-Dedicated Marketplace Launched by Rakuten in Japan

Japanese retail giant Rakuten has launched a new online marketplace, dedicated to NFTs. The site will allow people to buy and sell digital collectibles inspired by sports, anime, and entertainment...

from NDTV Gadgets - Latest https://ift.tt/hoyLJjg

Bhola Shankar First Look : ‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. మెగాస్టార్ మాస్ మేనియా

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌.. అజిత్ హీరోగా చేసిన త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుంది . డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఇక సెట్స్ పై భోళా శంక‌ర్‌తో పాటు గాడ్ ఫాద‌ర్‌, డైరెక్ట‌ర్ బాబి చిత్రాలున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Qx5S8dV

భీమ్లా నాయక్ సీక్రెట్: అందుకే అలా చేశామంటూ తమన్ ఓపెన్

కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాడు 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అన్ని సెంటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా యమ స్పీడులో ఉంది. విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు సూపర్ బూస్ట్ దొరికింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ . భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, పోటాపోటీ నటన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఇందంతా బాగానే ఉన్నా సినిమాలో ఒక పాట కనిపించకపోవడం మాత్రం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ షూట్ చేసిన 'అంత ఇష్టం ఏందయ్యా' అనే మెలోడీ సాంగ్ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీరా విడుదల తర్వాత సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఒకరకంగా ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందనే విషయమై ఓపెన్ అయ్యారు తమన్. 'మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా' అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే కారణంతో ఫైనల్ అవుట్‌పుట్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇకపోతే 108 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. మొదటి మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటాడు. ఈ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7Dmr9Kq

Official: ప్రభాస్ బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఇచ్చేశారండోయ్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అదే ఫామ్‌లో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. అందులో ఒకటే 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 3D వర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచబోతున్నట్లు ట్వీట్ పెట్టారు. దీంతో ఈ బిగ్ అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అయింది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ రిలీజ్‌పై ఆతృత నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ మూవీ విడుదల తేదీ ప్రకటించి హూషారెత్తించారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో గతంలో ఎన్నడూ లేనంత థ్రిల్ ఇచ్చేలా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/CxMFjkH

Gran Turismo 7 Set to Release on March 4: All You Need to Know

Gran Turismo 7 - to be released on PS4 and PS5 - is the eighth title in the Gran Turismo franchise. The upcoming game features around 400 cars that include basic family cars to rare and exotic...

from NDTV Gadgets - Latest https://ift.tt/PNBUK0v

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఉక్రెయిన్‌పై సైనిక చర్యపై స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ఇదే విషయంపై గత రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా 'యశోద'లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటించేందుకు రెడీ అంటూ అన్ని కోణాల్లో కెరీర్ జర్నీ సాగించాలని ప్లాన్స్ చేసుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xlsjCE6

Sunday, 27 February 2022

'Putin must think he can pull it off'

'Putin has set aside all the rules and now he is deciding the rules.'

from rediff Top Interviews https://ift.tt/ZoEl9nc

iPhone SE 3, Rumoured to Be Launched This Year, Might Be Priced at $300

Apple is rumoured to return with the successor of iPhone SE (2020) on March 8 at an event where it's also expected to announce a refreshed iPad Air.

from NDTV Gadgets - Latest https://ift.tt/QicCKsd

గ్యాంగ్ లీడర్ సమంత! ఆమె లేడీ పవన్ కళ్యాణ్ అంటూ సుకుమార్ ఓపెన్

యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. మార్చి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఆదివారం (ఫిబ్రవరి 27) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కీర్తి సురేష్, , ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే వేదికపైకి వచ్చి మైక్ పట్టుకున్న సుకుమార్.. సమంతతో పాటు సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేదికపై రాగానే యాంకర్ సుమకు థాంక్యూ చెప్పిన సుకుమార్.. టాపిక్ తీసుకొచ్చారు. గ్యాంగ్ లీడర్ సమంత మిస్ ఇక్కడ అంటూ అక్కడున్న కీర్తి సురేష్, రష్మిక మందన, సాయి పల్లవిలతో పాటు సమంతలను తెగ పొగిడేశారు. బ్యూటిఫుల్ బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ వీళ్ళు అంటూ కామెంట్ చేశారు. మై శ్రీవల్లి అంటూ అక్కడున్న రష్మిక అభిమానులను ఫిదా చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెలో మంచి ఆరిస్ట్‌తో పాటు మంచి మనిషి దాగి ఉన్నారని అన్నారు. అంతేకాదు సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అంటూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు సుక్కు. ప్రకటనల ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేసే విషయంలో సాయి పల్లవి అందరు ఆర్టిస్టులకు ఆదర్శం అని ఆయన అన్నారు. ఇకపోతే తనకు ఇష్టమైన డైరెక్టర్ కిషోర్ తిరుమల అని చెప్పిన సుక్కు.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. తాను దేవి శ్రీ ప్రసాద్‌ని బాగా నమ్ముతానని, దేవీ ఈ సినిమా చూసి సూపర్ అని చెప్పారని అన్నారు. శర్వానంద్‌కి తాను పెద్ద అభిమానిని అని సుకుమార్ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hau5zTY

'Each leg of my career has brought joy'

'My kids think it's very cool they will see me on Netflix.'

from rediff Top Interviews https://ift.tt/zmOrb26

భీమ్లా నాయ‌క్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్.. పవన్‌కి దిష్టి తగలొద్దంటూ!

ప్రస్తుతం థియేటర్స్‌లో 'భీమ్లా నాయక్' మోత మోగుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. అభిమానులకు ఇది విజువల్ ట్రీట్ అని, పవన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ చూసిన పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ నటనను పొగిడేస్తుండటం ఫ్యాన్స్‌లో మరింత సంబరం నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై పృథ్వీ రాజ్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. భీమ్లా నాయక్ సినిమా చూసిన పృథ్వీ రాజ్ హీరో ప‌వ‌న్ కళ్యాణ్‌పై, ఆయన నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అది త‌న‌ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పిన పృథ్వీ రాజ్.. అప్ప‌ట్లో ఆ సినిమా చూసేందుకు తాడేపల్లి గూడెంలోని ఓ టాకీస్‌కు వెళ్లగా అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానానులు, వారిని నియంత్రించేందుకు పోలీసుల లాఠీచార్జ్‌ అన్నీ గుర్తున్నాయని, మళ్ళీ ఇప్పుడు అలాంటి సీన్ చూశానని చెప్పారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అలాంటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఉందని ఆయన అన్నారు. ఓ ప్రేక్షకుడిగా భీమ్లా నాయక్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానని పృథ్వీ రాజ్ తెలిపారు. క్లైమాక్స్‌తో పాటు రానా- పవ‌న్ కళ్యాణ్ పోటాపోటీ నటన, ఆ సీన్స్ చాలా బాగున్నాయని అన్నారు. కాకపోతే అద్భుతమైన సినిమాలో తాను భాగం కాలేకపోయాననే బాధ మాత్రమే ఉందని చెప్పిన ఆయన, పవన్ కళ్యాణ్‌కి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాన‌ని అనడం గమనార్హం. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో ఈ 'భీమ్లా నాయక్' మూవీ రూపొందింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7XcsyMA

Samsung Unveils New Galaxy Book 2 Pro Laptops and More at MWC 2022

Samsung at its MWC 2022 event unveiled the Galaxy Book 2 Pro, Galaxy Book 2 Pro 360, Galaxy Book 2 Business, and Galaxy Book 2 360.

from NDTV Gadgets - Latest https://ift.tt/K9qTOnX

Saturday, 26 February 2022

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖ‌రారు.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే మ‌రి!

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణపరమైన బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమాను మెగా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. బోళా శంక‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న ఉద‌యం 9 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా ఉంటుంది. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్‌ న‌టిస్తున్నారు. చిరంజీవి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పీడుతో కుర్ర హీరోల‌కు గ‌ట్టి పోటీనే ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29 రిలీజ్‌కి రెడీ చేసిన ఆయ‌న త‌న 153వ చిత్రం గాడ్‌ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు బోళాశంక‌ర్‌ను కూడా ఈ ఏడాదిలోనే విడుద‌ల చేస్తారు. మ‌రి చిరంజీవి స్పీడు చూస్తుంటే ఈ ఏడాది ద్వితీయార్థంలో బాబి దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాను కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZzatEKC

Bheemla Nayak Location : భీమ్లా నాయక్ లొకేషన్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌ర‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఆయ‌న మంచి టెక్నీషియ‌న్‌. జానీ సినిమాకు ఆయ‌నే డైరెక్ట‌ర్‌. సాధార‌ణంగా కెరీర్ ప్రారంభంలో ఆయ‌న సినిమాల‌కు ఆయ‌నే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా కంపోజ్ చేసుకునే వారు. ఇప్పుడు ఆయ‌న‌లోని టెక్నీషియ‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే.. ఆయ‌న‌లోని సాంకేతిక‌మైన ఆస‌క్తి భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో క‌నిపించింది. ఇంత‌కీ అదేంటంటారా!.. భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిపోయారు. వివ‌రాల్లోకి వెళితే, భీమ్లా నాయ‌క్ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రించే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, న‌ర్రా శీను, త్రివిక్ర‌మ్‌ల‌ను క‌లిసి డిస్క‌స్ చేసుకునే స‌మ‌యంలో ఏమ‌నిపించిందో ఏమో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెమెరా చేత ప‌ట్టుకున్నారు. త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను క‌లిపి ఓ ఫొటోను క్లిక్ మ‌నిపించారు. ఆ స‌న్నివేశాన్ని మ‌రొక‌రు త‌మ కెమెరాలో బంధించారు ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. లుంగీ క‌ట్టుకుని త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను ఫొటో తీస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయ్యింది. సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం మంచి వసూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్ సీస్‌లోనూ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత భారీ హిట్ సాధించిన చిత్రమిదే. చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌కుడు. సూర్య దేవ‌ర నాగ‌వంశీ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/SfEUvAr

Telugu Film Industry : ఇండ‌స్ట్రీ పెద్ద‌పై హీరో శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు పెద్ద ఎవ‌రు? అనే దానిపై చ‌ర్చ చాలా రోజులుగానే ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ ఈ మ‌ధ్య కాలంలో స్పందిస్తూ.. తాను ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ముందు ఉంటానే త‌ప్ప దుప్ప‌టి పంచాయతీలు చేయ‌న‌ని క్లారిటీ ఇచ్చేశారు. సీనియ‌ర్ న‌రేష్ వంటి వారైతే ‘మా’ ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంలో మోహన్ బాబు వంటివారే ఇండ‌స్ట్రీ పెద్ద కావాల‌న్నారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌రికంపై కొన్ని రోజుల పాటు పెద్ద రేంజ్‌లో జ‌రిగినా ఎందుక‌నో త‌ర్వాత సైలెంట్‌గా మారిపోయింది. అయితే అడ‌పా ద‌డ‌పా కొంత మంది వ్య‌క్తులు మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్దరికం అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. తాజాగా ఈ లిస్టులో సీనియ‌ర్ నటుడు, హీరో శ్రీకాంత్ కూడా చేరారు. రీసెంట్‌గా ఆయ‌న సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద రికం గురించి మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు చిరంజీవిగారే ఇండ‌స్ట్రీ పెద్ద‌. చాలా కాలంగా ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో ఎవ‌రికీ ఏ స‌మ‌స్య వ‌చ్చినా మెగాస్టార్‌గారే క‌నిపిస్తున్నారు. అందుక త‌గిన‌ట్లు ఆయ‌న కూడా ముందుండి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం కూడా సినిమా టికెట్స్ రేట్స్‌కు సంబంధించిన విష‌యం మాట్లాడేట‌ప్పుడు చిరంజీవిగారినే ఆహ్వానించింది. దాన్ని బ‌ట్టి ఇండ‌స్ట్రీలో ఆయ‌న స్థానం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు’’ అని తెలిపారు శ్రీకాంత్. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్‌గా అఖండ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా న‌టించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఒక‌వైపు హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా సినిమాలు చేస్తూ శ్రీకాంత్ రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/dXU0Zyl

Bheemla Nayak Success : పవ‌న్ క‌ళ్యాణ్ చేల‌రేగిపోయారు.. ‘భీమ్లా నాయ‌క్‌’పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

పవర్ స్టార్ , వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి పోటీ ప‌డి న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటోందీ చిత్రం. ఇక ‘భీమ్లా నాయ‌క్‌’పై ఫ్యాన్స్‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేరారు. ‘భీమ్లా నాయ‌క్‌’ హిట్‌ను ప్ర‌శంసిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. ‘‘‘భీమ్లా నాయ‌క్‌’ అద్భుతంగా ఉంది. ప‌వన్ క‌ళ్యాణ్ స్క్రీన్‌పై చేల‌రేగి పోయారు. డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. త్రివిక్ర‌మ్ త‌న‌దైన స్టైల్లో ఎప్ప‌టిలాగానే త‌న పెన్ ప‌వ‌ర్ చూపించారు. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ కె.ర‌వి చంద్ర‌న్ విజువ‌ల్స్‌తో మాయ చేశారు. త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంటాడుతుంది. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర‌, నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్‌, నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ స‌హా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బృందానికి అభినంద‌న‌లు’’ అన్నారు. అడివి శేష్‌, గోపీ మోహ‌న్‌, సందీప్ కిష‌న్ స‌హా చాలా మంది ప్ర‌ముఖులు భీమ్లా నాయ‌క్ స‌క్సెస్‌పై త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. మలయాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు ఇది రీమేక్‌. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0L3jPpV

Bridgerton 2, Venom 2, Outlander 6, and More on Netflix in March

Bridgerton season 2, Venom: Let There Be Carnage / Venom 2, Outlander season 6, Ryan Reynolds' The Adam Project, Eternally Confused and Eager for Love, Formula 1: Drive to Survive season 4, Taarak...

from NDTV Gadgets - Latest https://ift.tt/UjO2yZn

Radhe Shyam : డార్లింగ్ ప్రభాస్ కోసం రాజమౌళి ..‘రాధే శ్యామ్‌’కు జక్కన్న సాయం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే ఉన్న క్రేజ్ చాలద‌న్న‌ట్లు ఇంకా హైప్‌ను ఒక్కో స్టెప్ పెంచుతూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ సినిమా నెరేష‌న్‌కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్పుడు ఇదే నెరేష‌న్‌ను తెలుగు వెర్ష‌న్‌కు ఎవ‌రు ఇస్తార‌నే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌లేదు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘రాధే శ్యామ్‌’ తెలుగు వెర్షన్ నెరేషన్‌కు రాజ‌మౌళి త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. రీసెంట్‌గానే రాజ‌మౌళికి సంబంధించిన వ‌ర్క్‌ను ‘రాధే శ్యామ్‌’ యూనిట్ పూర్తి చేసిందని టాక్‌. పూర్తి స్థాయి ప్ర‌మోష‌న్స్‌ను మార్చి మొద‌టి వారం నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాల‌ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. అదే స‌మ‌యంలో ఈ సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్ర‌భాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘రాధే శ్యామ్‌’ ఒక‌టి. క‌రోనా కార‌ణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వ‌చ్చి, ఇప్ప‌టికీ రిలీజ్ అవుతుంది. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ క‌థా చిత్ర‌మిది. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రికా నిపుణుడిగా క‌నిపిస్తే.. పూజా హెగ్డే మ్యూజిక్ టీజ‌ర్ ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ కూడా ఈ చిత్రంలో న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8EiSdPB

Nagababu : సినీ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : నాగ‌బాబు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ఫిబ్ర‌వ‌రి 25న సినిమా విడుద‌లైంది. సినిమా టికెట్స్ పెంపుకు సంబంధించిన జీవోను ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులో మాట్లాడుతూ ‘‘వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రభుత్వం నేటి వరకు సినీ పరిశ్రమను, పవన్ కళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌గ‌తో ఇలా చేస్తున్న‌ప్ప‌టికీ సినీ ప‌రిశ‌మ్ర నుంచి, సినీ పెద్ద‌లు నుంచి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం శోచ‌నీయం. ఇలా చేయ‌డం త‌ప్పు అని చెప్ప‌డం కానీ, ట్వీట్స్ వేయ‌డం కానీ ఎవ‌రూ చేయ‌డం లేదు. సినీ ప‌రిశ్ర‌మ అభ‌ద్ర‌త‌ను క‌ళ్యాణ్‌బాబు, ఆయ‌న‌తో ఉన్న నాలాంటి వాళ్లు అర్థం చేసుకోగ‌లం. పెద్ద హీరోకే ఇలా ఉంటే సామాన్య మాన‌వుడి పరిస్థితి ఏంటి? వాళ్లు ఎంత బాధ‌ప‌డుతున్నారు. నాపై ఏమైనా కోపం ఉంటే నాపైనే చూపించండి. ఇండ‌స్ట్రీ మీద కాదు అని రిప‌బ్లిక్ సినిమా వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌ల‌కు ఇప్పుడు వాళ్లు క‌రెక్ట్ ఉప‌యోగించుకుంటున్నారు. అయితే మీరెవ‌రూ దానిపై ఒక మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం దురదృష్ట‌క‌రం. భీమ్లా నాయ‌క్ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ప్ర‌జ‌లు సినిమాను ఆద‌రించారు. ఒక‌వేళ ఈ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోయుంటే క‌ళ్యాణ్ బాబు న‌ష్ట‌మేమీ వ‌చ్చుండేది కాదు. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, నిర్మాత నష్ట‌పోయేవారు. దేవుడి ద‌య వ‌ల్ల సినిమా హిట్ అయ్యింది. అయితే సినీ ఇండ‌స్ట్రీకి సినిమా వ్య‌క్తిగా ఓ విష‌యం చెప్పాల‌నుకుంటునాను. భ‌విష్య‌త్తులో ఇలాంటి స‌మ‌స్య‌లు ఏ ప్ర‌భుత్వం ద్వారా అయినా వ‌స్తే క‌చ్చితంగా మీకోసం మేం నిల‌బ‌డ‌తాం. మీరు మాకు స‌హ‌కారం అందించ‌క‌పోయినా ప‌రావాలేదు. మేం మీకు అండ‌గా నిల‌బ‌డ‌తాం’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/F2Hxnpf

Friday, 25 February 2022

Russia to Restrict Facebook Access for 'Censoring' Its Media Over Ukraine Invasion

Russia has restricted access to Facebook in the country after Moscow accused the Meta-owned social media platform of censoring the state media over its military operation in Ukraine.

from NDTV Gadgets - Latest https://ift.tt/A8TteDu

Prabhas : ‘రాధే శ్యామ్’ లెక్కలు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.. ఓవర్ సీస్‌లో డార్లింగ్ పక్కా స్కెచ్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో సందడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త చిత్రం సాహో విడుద‌లై రెండున్న‌రేళ్లు అవుతుంది. ఆయ‌న అభిమానులేమో ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌టానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 11న డార్లింగ్ ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చాట‌డానికి రెడీ అంటున్నారు. లేటెస్ట్‌గా ఓవ‌ర్ సీస్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి చిత్రాన్ని మేక‌ర్స్ సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్‌సీస్‌లో మ‌రే చిత్రం విడుద‌ల కాన‌న్ని లొకేష‌న్స్‌లో అంటే హిందీ వెర్ష‌న్‌ 1116, తెలుగు వెర్ష‌న్‌ 1116, త‌మిళం 200 లొకేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. 31116 స్క్రీన్స్‌లో..11116 షోస్‌ను ప్ర‌దర్శించ‌బోతున్నారు. మ‌రి ఇంత భారీగా రాధే శ్యామ్ విడుద‌లైతే వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి మ‌రి. పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ అయితే సినీ సర్కిల్స్‌లో బ‌లంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక తెలిసిన ఎక్స్‌ప‌ర్ట్‌గా క‌నిపించ‌నున్నారు. పూజా హెగ్డే ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. వీరి మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరిగా ‘రాధే శ్యామ్’ అల‌రించ‌నుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఇందులో స్వామిజీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ ఇందులో ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. హీరోయిన్ పూజా హెగ్డే చేతి రేఖ‌ల‌ను అనుస‌రించి ఆమె ఎదుర్కోబోయే ప్ర‌మాదాల‌ను గుర్తించిన ప్ర‌భాస్ ఆమెను ఎలా ర‌క్షించుకుంటాడనేదే ఈ సినిమా క‌థాంశం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/O4n7oJb

Bheemla Nayak Success : తమన్ థియేట‌ర్‌లో చేసిన ర‌చ్చ పీక్స్‌.. వారిద్ద‌రి థాంక్స్ చెప్పిన మ్యూజిక్ సెన్సేష‌న్‌ !

ప్ర‌స్తుతం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎవ‌రంటే ట‌క్కున వినిపిస్తోన్న స‌మాధానం త‌మ‌న్‌. ఇప్పుడు త‌మ‌న్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేవు. అందుకు కార‌ణం.. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమా. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా విజ‌య‌వంత‌మైన టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. సినిమా రిలీజ్ త‌ర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ పాటలు వ‌స్తున్నప్పుడు చేస్తున్న సంద‌డి అంతా ఇంత కాదు. సాధార‌ణంగా హీరో పాట‌ల‌కు అభిమానులు స్క్రీన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స్టెప్పులేయ‌డం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌యం. అయితే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, డ్రమ్స్ శివ మ‌ణి కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయారు. అభిమానుల‌తో క‌లిసి స్క్రీన్ ముందు వేసిన స్టెప్పుల వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను త‌మ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, త్రివిక్ర‌మ్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త‌మ‌న్ వ‌ర్క్ చేసిన రెండో సినిమా ఇది. ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు అదే వ‌రుస‌లో భీమ్లా నాయ‌క్ చేరింది. ప‌వ‌న్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరుకి ..త‌మ‌న్ సంగీతం, నేప‌థ్య సంగీతం అద‌న‌పు బ‌లాలు అయ్యాయి. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఇప్ప‌టికే ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కుని దాటేసింది. ఇప్పుడు తొలిరోజు మొత్తం ఎంత మేర‌కు వ‌సూళ్లు సాధించిందో కొన్ని గంట‌ల్లోనే క్లారిటీ వ‌చ్చేయ‌నుంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన ‘’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6oyAnar

Pawan Kalyan : ఏడోసారి ఆ మైల్ స్టోన్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌ర్ స్టార్‌.. ‘భీమ్లా నాయ‌క్’ స్ట్రోమ్ మామూలుగా లేదు!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక యు.ఎస్ విష‌యానికి వ‌స్తే.. ఫిబ్ర‌వ‌రి 24నే ‘భీమ్లా నాయ‌క్’ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ షోస్ వ‌సూళ్లు 867000 డాల‌ర్స్‌గా ట‌చ్ అయ్యింది. శుక్ర‌వారానికి ఇది వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇలా ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిన సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఏడోది. సినిమాకు స‌క్సెస్ టాక్ రావ‌డంతో ఇక సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టికెట్ రేట్స్ త‌క్కువ‌గా ఉన్నాయి. తెలంగాణ త‌ర‌హాలో అక్క‌డ మంచి టికెట్ రేట్స్ ఉండుంటే.. సినిమా వ‌సూళ్ల ప‌రంగా మ‌రింతగా దూసుకెళ్ల‌ద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. తెలుగు రాష్ట్రాలు స‌హా మొత్తం తొలి రోజు ‘భీమ్లా నాయ‌క్’ వ‌సూళ్లు ఏంతో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగితే పూర్తి వివ‌రాలు వ‌చ్చేస్తాయి. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్నితెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌కుడు. స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు నెటివిటీకి స‌రిపోయేలా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను, పాత్ర‌ల‌ను మ‌లిచారు. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9u8SG1e

Thursday, 24 February 2022

Ukraine-Russia Crisis: Facebook, Twitter Highlight Security Steps for Users

Meta has set up a special operations centre to monitor the conflict in Ukraine, and it launched a feature so users in the country can lock their social media profiles for security, a company official...

from NDTV Gadgets - Latest https://ift.tt/PNTqORJ

'Looking at Russia, China could become aggressive'

'Both Russia and the USA seek New Delhi's friendship, because for both -- Russia and the USA -- India is a certain counterbalance to China.'

from rediff Top Interviews https://ift.tt/HNPe4mq

Chandrayaan-2 Detects Solar Proton Events: ISRO

A Large Area Soft X-ray Spectrometer (CLASS), a payload on-board Chandrayaan-2 Orbiter, has detected solar proton events which significantly increase the radiation exposure to humans in space, ISRO...

from NDTV Gadgets - Latest https://ift.tt/YN29LsK

చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర.. పవన్‌పై బండ్ల గణేష్

సినిమా అంటే.. హడావిడే ఎక్కువగా ఉంటుంది. బండ్ల గణేష్ స్పీచ్‌లు లేనదే.. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లు జరగవు. బండ్లన్న స్పీచులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బండ్ల గణేష్‌కు, ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తాడా? లేదా? అని వారం ముందే చర్చలు ప్రారంభించేశారు. అయితే బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ బండ్లన్న ఖండించాడు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఆహ్వానం అందలేదేమో.. ఏం జరిగిందో గానీ మొత్తానికి బండ్లన్న రాకపోవడం, ఆయన స్పీచు లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో బండ్లన్న ఎక్కడ అంటూ అభిమానులు హంగామా చేసేశారు ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gfwOCiv

Market Crash: Advice For Investors

'This is a good time to restructure your portfolio because the sectors and stocks that performed in the last bull market may not perform as much now.'

from rediff Top Interviews https://ift.tt/nWTahqs

త్రివిక్రమ్‌నే టార్గెట్ చేసిందా.. పూనమ్ కౌర్ ట్వీట్ అర్థమదేనా?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉన్నాడా?లేదా? అసలు వచ్చాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. బండ్ల గణేష్ ఆడియో లీక్ ఎఫెక్ట్ అని.. అందుకే త్రివిక్రమ్ మాట్లాడలేదని, సైలెంట్‌గా ఉండిపోయాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉంటే.. ఇక స్పీచు మీద రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్, దాని మీద పూనమ్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో సటిల్డ్‌గా మాట్లాడాడు. ఎక్కడా గాడి తప్పకుండా.. భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మాట్లాడేశాడు. దీని మీద వర్మ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే బెస్ట్ స్పీచ్.. ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వేసిన ట్వీట్ మీద కౌంటర్ వేసింది. అయితే వర్మ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ వేస్తూ పూనమ్ కౌర్ స్పందించింది. ఓ డైరెక్టర్ ఎదుటి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాడు.. ఓ మూల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.. బయటి జనాలు తిడుతుంటే.. సైలెంట్‌గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకో డైరెక్టర్ అయితే ఎదుటివారిని తక్కువ చేస్తాడు.. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఆ ఇద్దరూ కూడా అమ్మాయిలను ఆయుధాలుగా వాడుకుంటారు అని అనేసింది. ఇందులో ఒకరు అని అర్థమవుతోంది. ఇక ఇంకొకరు ఎవరు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఇంకెవరు త్రివిక్రమ్ అని ఇంకొందరు సమాధానాలు ఇస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్లు మాత్రం పజిల్‌లానే ఉంటాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/icPZSbh

Bheemla Nayak మొదటి రోజే సునామీ.. ఎంత రాబట్టనున్నాడంటే?

మొదటి రోజు దుమ్ములేపేట్టు కనిపిస్తోంది. దెబ్బకు మరోసారి రికార్డులు బద్దలయ్యేట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, నటన, రానా పర్ఫామెన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్టులు వచ్చేశాయి. ప్రీ బుక్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అందరికీ అర్థమైంది. అయితే సినిమాకు గనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే ఈ కలెక్షన్లు మరింత పెరిగే చాన్స్ ఉంటుందని అంతా భావించారు. మొత్తానికి టాక్ అదిరిపోయింది. సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టబోతోందని అర్థమవుతోంది.అయితే ఏపీలో థియేటర్ల సమస్య, నో బెనిఫిట్ షోలు, నో టికెట్ హైక్స్ ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్లలో కాస్త తేడా కొట్టేలా ఉంది. ప్రీమియర్స్‌తోనే భీమ్లా నాయక్ మూవీ 700k డాలర్లను రాబట్టేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు ముప్పై కోట్ల మేర గ్రాస్ కొల్లగొట్టేట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో రికార్డుల మోత మొదలైనట్టే. ఇక ఈ వీకెండ్‌లోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు కూడా దగ్గర్లో వచ్చేలా ఉంది. అసలే ఈ సినిమాకు రెండు వారాలు టైం ఉంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండో వారంలో అయితే భీమ్లా నాయక్ లాభాల పంట పండిచేసేలా ఉన్నాడు. భీమ్లా నాయక్ 108 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక భీమ్ల ా నాయక్ సినిమాకు పవన్ కళ్యాణ్, రానా నటన, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, తమన్ సంగీతం ప్రధాన బలాలుగా మారినట్టు చెప్పుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yPkW2KB

Bheemla Nayak : భీమ్లా నాయక్ ట్విట్టర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ విశ్వరూపం

పవర్ స్టార్ , రానా దగ్గుబాటి నటించిన సినిమా ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్.. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక నేడు విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. భీమ్లా నాయక్ సినిమా మీద ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయ్. గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్‌లో ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే బొమ్మ పడిపోయింది. ఈ సినిమాను చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్. ఇలాంటి టాక్ విని ఎన్ని ఏళ్ల్అవుతోందో అని ఇంకో అభిమాని ట్వీట్ వేశాడు.పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే వీర లెవెల్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. వన్ వర్డ్‌లో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రానా సీన్స్, పవన్ కళ్యాణ్‌కు పెట్టిన డైలాగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. మొత్తానికి భీమ్లా నాయక్ రికార్డుల వేట కొనసాగించేశాడని అర్థమవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/zW4gcoA

Wednesday, 23 February 2022

Meta Lays Out Moves Being Made to Build the Metaverse

Meta CEO Mark Zuckerberg talked up his company's efforts to build the metaverse, an immersive virtual world he has billed as the Facebook parent's future.

from NDTV Gadgets - Latest https://ift.tt/ofJjy2p

'If Putin succeeds, Russia will be a great power'

'The aim of Russian policy is to reform European security, stop NATO expansion and in a more general sense -- set up the new rules of relations between the great powers.'

from rediff Top Interviews https://ift.tt/VbzDPT5

Andhra Pradesh Restrictions : ‘భీమ్లా నాయ‌క్‌’ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం.. ఆంక్ష‌లు షురూ!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. మ‌రో హీరో రానా ద‌గ్గుబాటి.. డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో న‌టించారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ‘భీమ్లా నాయ‌క్‌’ రిలీజ్‌కి ఏపీ ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను మ‌రోసారి థియేట‌ర్స్ య‌జ‌మానుల‌కు గుర్తు చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డా స్పెష‌ల్ షో వేయ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. అలా వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేసింది. అలాగే టికెట్ రేట్స్ కూడా ప్ర‌భుత్వం విధించిన ధ‌ర‌ల‌ ప‌రిమితిలోపే ఉండాల‌ని పేర్కొంది. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు సంబంధించి స్పెష‌ల్ షోస్‌, టికెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక‌మై దృష్టి పెట్టాల‌ని రెవెన్యూ శాఖ‌కు ఆదేశాల‌ను జారీ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే 1952 సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టం ద్వారా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలియ‌జేస్తూ త‌హ‌సీల్దారులు వారి ప‌రిధిలోని సినిమా థియేట‌ర్స్‌కు నోటీసులు పంపించారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాకు ఐదో ఆట‌కు ప్ర‌త్యేక‌మైన అనుమ‌తిని ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 11 వ‌ర‌కు ప్ర‌తి థియేట‌ర్‌లోనూ ఐదో ఆట‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చున‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం ఆదేశాల‌ను ఇవ్వ‌డంపై ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు ఇది రీమేక్. నిజాయ‌తీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్‌కి, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎద‌గాల‌నుకునే మ‌రో వ్య‌క్తికి జ‌రిగే పోరాట‌మే ‘భీమ్లా నాయ‌క్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లేతో పాటు ఓ పాట‌ను కూడా రాశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/CPm65Nz

Bheemla Nayak Pre Release Event : కల్ట్ ఫాలోయింగ్ ఉన్న విలక్షణమైన నటుడు.. పవన్‌పై కేటీఆర్ కామెంట్స్

పవర్ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సినిమా రెడీ అయింది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ అందించగా.. సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. నేడు (ఫిబ్రవరి 23) ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘నన్ను ఈ రోజు ఆహ్వానించిన నా సోదరుడు, మీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. నాలుగేళ్ల కిందట అనుకుంటాను. రామ్ చరణ్ ఓ సారి పిలిస్తే ఇదే గ్రౌండ్‌కు సినిమా ఈవెంట్‌కు వచ్చాను. తండ్రేమో మెగాస్టార్ బాబాయ్ ఏమో పవర్ స్టార్ అని అన్నాను.ఇలానే అరిచారు. నన్ను మాట్లాడనివ్వలేదు. నేను ఈ రోజు ఇక్కడకు మంత్రిగా రాలేదు. ఓ అన్న పిలిస్తే సోదరుడిగా వచ్చాను. ఆయన మంచి మనిషి. విలక్షణ శైలి ఉన్న మనిషి. సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా చాలా మంది ఉంటారు గానీ.. ఇలా కల్ట్ ఫాలోయింగ్ ఉన్న విలక్షణమైన నటుడు పవన్ కళ్యాణ్. నేను కూడా కాలేజ్‌లో ఉన్న సమయంలో తొలి ప్రేమ సినిమాను చూశాను. ఇన్నేళ్ల పాటు ఇలానే స్టార్డంను కంటిన్యూ చేయడం, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, ఇంత మంది అభిమానుల గుండెల్లో స్థానం సుస్థిరం చేసుకోవడం మామూలు విషయం కాదు. సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నల్గొండ నుంచి వచ్చి సినిమాను డైరెక్ట్ చేశాను అని సాగర్ చంద్ర ఎంతో గర్వంగా చెప్పాడు. భారత చలనచిత్ర సీమకు హైద్రాబాద్‌ను హబ్‌లా చేస్తామని మాకు నమ్మకంగా ఉంది. ఈరోజు సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించారు. మీరు సినిమా షూటింగ్‌లు గోదావరి జిల్లాల్లో చేయొచ్చు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఎంతో మంది అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తీసుకొచ్చారు. మొగిలయ్య, దుర్గాబాయ్ వంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చారు’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/NxWsVPj

Tuesday, 22 February 2022

'Akhilesh and I are giving people a new paradigm'

'They are trying to stoke emotions to build fear.'

from rediff Top Interviews https://ift.tt/KBv2HyU

Meet Bhagyashree's daughter, Avantika

'The filmi keeda was always there.'

from rediff Top Interviews https://ift.tt/VUIPTE4

Amazon Still Interfering With Union Election at Alabama Warehouse, Say Workers

Amazon Alabama workers who are prepping for a second round of voting in their bid to unionise have alleged that the e-commerce giant continues to interfere with the election process.

from NDTV Gadgets - Latest https://ift.tt/smPnAcM

Facebook Reels Launched Globally in 150 Countries to Rival TikTok

Facebook Reels has been expanded globally to 150 countries in a move by Meta to more effectively rival short video apps like TikTok on all fronts. Meta had introduced Reels on Instagram in 2020.

from NDTV Gadgets - Latest https://ift.tt/FzT9IXJ

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ మలయాళ నటి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 74సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఆమె 550కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించారు ఈ లెజండరీ నటి. చివరిగా కేరళకు చెందిన సంగీత నాటక అకాడమీకి ఆమె ఛైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. లలిత నటనకు గాను రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను పెళ్లాడింది లలిత. వీరికి సిద్ధార్థ్ భరతన్ అనే కుమారుడు, శ్రీకుట్టి భరతన్ ఆమె కుమార్తె ఉన్నారు. లలిత మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/z6u4ngS

'Decision to sell LIC is more political than economic'

'How can you explain the necessity of selling an institution that has been delivering regular returns to the government, that has never asked for any capital from the government, that has invested Rs 38 lakh crores in the Indian economy and that owns 4 per cent of the market capitalisation in India?'

from rediff Top Interviews https://ift.tt/3jt926A

Realme 9 Pro 5G to Go on Sale in India for the First Time Today

Realme 9 Pro 5G is set to go on sale in India today. The new Realme smartphone will be available for purchase in three different colour options. It comes with an initial price tag of Rs. 17,999 as...

from NDTV Gadgets - Latest https://ift.tt/JXGeacl

Valimai Pre Release Event : రిలీజ్ డేట్ మరిచిపోయిన హీరో.. కార్తికేయ క్షమాపణలు

సినిమాపై తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో హీరోగా అజిత్ దుమ్ములేపుతుంటే.. విలన్‌గా నటించాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక నిర్మాత బోనీ కపూర్ అవ్వడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. బైక్ చేజింగ్, రేస్, యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24న రాబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు (మంగళవారం ఫిబ్రవరి 22) జరిగింది. ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. ఓ తప్పు చేశాడు. సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న అని చెప్పాల్సింది. కానీ నవంబర్ 24న అంటూ నోరు జారేశాడు. ఆ తరువాత ఎప్పటికో తన తప్పు తెలుసుకుని.. సరి చేసుకున్నాడు. ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పానట.. నవంబర్ 24 అని చెప్పానట. క్షమించండి అని అన్నాడు. వలిమై సినిమా ఫిబ్రవరి 24న రాబోతోందని సరి చేసుకున్నాడు. ఇందాక ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నాను.. నవంబర్ 24 అంటే అది నా పెళ్లి రిసెప్షన్ రోజు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన స్పీచులో ఇటు పవర్ స్టార్, అటు తలా అభిమానులను కవర్ చేశాడు. ఫిబ్రవరి 24న వలిమై చూడండి.. ఆ తరువాత ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా చూడండని ఇరువురు హీరోల అభిమానులను కోరాడు కార్తికేయ. బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకు ఇలా అజిత్, పవన్ కళ్యాణ్ ఒక్క తేదీ గ్యాప్‌తొ వస్తున్నారు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వలిమై సినిమాతో కార్తికేయ కోలీవుడ్‌లో తన సత్తా చాటబోతోన్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9HtMQyz

Monday, 21 February 2022

OnePlus Nord CE 2 5G Now on Open Sale in India: Everything You Should Know

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/kHbM2FL

భీమ్లా నాయక్ ట్రైలర్‌‌పై శ్రీ రెడ్డి రియాక్షన్.. వైరల్ అవుతున్న మెసేజ్

ప్రస్తుతం 'భీమ్లా నాయక్' మేనియా కొనసాగుతోంది. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేసి చివరకు ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా భీమ్లా నాయక్ ట్రైలర్ వదలడంతో ఈ వీడియో ఆన్ లైన్‌లో సునామీ సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ యాక్షన్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పూనకాలు తెప్పించే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్‌పై కామెంట్ వదిలింది సంచలన తార . పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల్లో శ్రీ రెడ్డి వేలుపెడుతుండటం చూస్తుంటాం. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ముందుకొచ్చి 'భీమ్లా నాయక్' ట్రైలర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ భీమ్లా నాయక్ ట్రైలర్ అనుకున్నంతగా లేదంటూ నెగెటివ్ కామెంట్ చేసింది. అంతేకాదు బిలో యావరేజ్ అంటూ గాలి తీసేసింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై చేసే కామెంట్స్ అబ్బో మాటల్లో చెప్పలేం. భీమ్లా నాయక్ రిలీజ్‌కి ముందు భారీ రేంజ్ ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు కానీ ఏపీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణంతో అది పోస్ట్ పోనే చేశారు. అయితే అదేరోజు ట్రైలర్ మాత్రం వదిలి పవన్ అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. మలయాళీ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ బాణీలు కట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yUne9Ym

'Does UP CM know what thermodynamics is?'

'By calling names and using unparliamentary language, they are trying to divert people's attention from the issues of electricity, water, and income.'

from rediff Top Interviews https://ift.tt/jFrqLbK

భీమ్లా నాయక్ ట్రైలర్‌పై ఆర్జీవీ టాక్.. PK ఫ్యాన్ అంటూనే వేసేశాడు బాగా వేసేశాడు!!

అదేంటో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా తనదైన కోణంలో విమర్శనాత్మక బాణాలు విసురుతున్నారు . మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత అంతటి పేరు తెచ్చుకునే సత్తా ఒక్క అల్లు అర్జున్‌కి తప్పితే ఆ కాంపౌండ్‌లోనే ఇంకెవ్వరికీ లేదంటూ నేరుగా చెప్పేసి దీన్ని హాట్ ఇష్యూ చేసిన ఆర్జీవీ.. తాజాగా విడుదలైన '' ట్రైలర్ చూసి తన రివ్యూ చెప్పేశారు. PK ఫ్యాన్ అంటూనే అనాల్సినవన్నీ అనేశారు వర్మ. వరుస ట్వీట్స్ పెట్టి పవన్ అభిమానులను మళ్ళీ కెలికారు. మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఈ 'భీమ్లా నాయక్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, రానా భాగమయ్యారు. భీమ్లా నాయక్‌గా నటించగా.. డానియ‌ల్ శేఖర్‌గా దగ్గుబాటి రానా కనిపించబోతున్నారు. అయితే మాతృకలో లాగా ఇద్దరు హీరోల పేర్లు టైటిల్‌గా తీసుకోకుండా ఒక్క పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ మాత్రమే టైటిల్‌గా ఎంచుకోవడంపై గతంలోనే రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' ట్రైలర్ రిలీజ్ అయ్యాక అదే పాయింట్ ఫోకస్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరి రోల్స్ బాగా ఎలివేట్ చేస్తూ పూనకాలు తెప్పించారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా ఉంది సీన్. అయితే ఇందులో లాజిక్ తీస్తూ పవన్‌ని బాగానే వేసుకున్నారు వర్మ. ట్రైలర్ చూశాక ఈ మూవీ టైటిల్ ‘భీమ్లా నాయక్’ బదులు ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ పెద్ద బాంబు పేల్చేశారు. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ కంటే రానా యాక్టింగ్ అదిరిపోయిందని చెప్పారన్నమాట. ఇకపోతే ఓ PK ఫ్యాన్‌గా బాగా హర్ట్ అయ్యా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను కెలికేలా మరో ట్వీట్ పెట్టారు ఆర్జీవీ. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ చూశాక రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నారని తెలుస్తోందంటూ మంట పెట్టే కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదండోయ్.. ఈ ట్రైలర్‌పై తన అభిప్రాయాలన్నీ కుండబద్దలు కొట్టేస్తూ పూర్తి రివ్యూ ఇచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయితే మాత్రం ఏం లాభం? వర్మకు అవన్నీ లైట్.. అంతేగా! అంతేగా!!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fO3UlBd

How to Pre-Order PlayStation 5's February 22 India Restock

PS5 India February 22 restock - for Rs. 49,990 Blu-ray PlayStation 5, and Rs. 39,990 PS5 Digital Edition - is available at Amazon, Croma, Flipkart, Game Loot, Games The Shop, Reliance Digital,...

from NDTV Gadgets - Latest https://ift.tt/SKoQ7C8

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్: కొత్త డేట్ ఫిక్స్! జనాల్లో సందేహాలు..

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి 'భీమ్లా నాయక్' వేదికపై మాట్లాడిన మాటలు, ప్రసంగాల తాలూకు క్లిప్స్ వైరల్ అవుతూ ఉండేవి. నిన్న (ఫిబ్రవరి 21) జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి అకాల మరణంతో క్యాన్సిల్ అయింది. ఎంతో గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు కానీ చివరకు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు.. ఈ ఈవెంట్ వాయిదా పడటంతో కాస్త నిరాశ చెందారు. మరోవైపు చిత్ర రిలీజ్ డేట్ అతి దగ్గర్లో ఉండటంతో అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 25 రిలీజ్ అంటే మరో మూడు రోజులే గ్యాప్ ఉంది ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేనా? అనే డౌట్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో అలాంటి అనుమానాలు పటాపంచలయ్యేలా బుధవారం రోజు అనగా (ఫిబ్రవరి 23) ఈ ఈవెంట్ జరపాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ముందుగా అనుకున్న ప్రకారం గ్రాండ్ ఈవెంట్ జరపాలని ఇందుకు గాను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కావాలని ఫైనల్ అయ్యారట. ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనేది ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే డేట్ మారింది కాబట్టి భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తారా? లేదా అనేది కూడా జనాల్లో హాట్ టాపిక్ అయింది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో భీమ్లా నాయక్ మూవీ రూపొందించారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/dzJUqwh

Sunday, 20 February 2022

'In UP, BJP will lose'

'The mandate in UP will not be a fractured mandate because people are fed up.'

from rediff Top Interviews https://ift.tt/uFgndaS

OnePlus TV Y1S and OnePlus TV Y1S Edge Bring a Smarter TV Experience: Now on Sale in India

​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/eEuaGrf

'Introduce another slab to tax the super-rich'

'We can go somewhere between 35 per cent and 40 per cent.'

from rediff Top Interviews https://ift.tt/Q4powZj

The Myth of Crypto Decentralisation

In reference to blockchain, decentralisation refers to the transfer of control and decision-making from a centralised entity to a distributed network, but things aren't as black and white in the case...

from NDTV Gadgets - Latest https://ift.tt/ZlMTLQu

Online Ticketing: ‘భీమ్లా నాయక్’ ఆన్ లైన్ బుకింగ్‌..నైజాం డిస్ట్రిబ్యూటర్స్ షాకింగ్ డిసిషన్.. ప్రేక్ష‌కుడు ప‌రిస్థితేంటి!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టించారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే యు.ఎస్‌లో ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయోన‌ని ఫ్యాన్స్‌, సినీ గోయర్స్ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. అయితే నైజాంలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ కావ‌డం లేదు. ఈ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ ఆన్ లైన్ టికెటింగ్ ఎందుకు వ‌ద్ద‌నుకున్నార‌నే దానికి అస‌లు కార‌ణం.. బుక్ మై షో స‌హా ప‌లు ఆన్ లైన్ టికెటింగ్ సెంటర్స్ ద్వారా సినిమా టికెట్‌ను బుక్ చేసుకున్న‌ప్పుడు స‌ర్వీస్ ఛార్జ్‌ను వేసున్నారు. దీంతో పాటు జి.ఎస్‌.టి ఇత‌ర‌త్ర ట్యాక్స్ క‌లిపి టికెట్‌పై దాదాపు పాతిక రూపాయ‌లు ఎక్స్‌ట్రా డ‌బ్బులు అవుతున్నాయ‌ట‌. సామాన్యుడిపై భారం త‌గ్గించాలంటే ఈ స‌ర్వీస్ ఛార్జ్‌ను తీసేయాల‌ని నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్.. బుక్ మై షో వారిని కోరడం.. వారు ఒప్పుకోక‌పోవ‌డంతో, భీమ్లా నాయ‌క్‌కి ఆన్ లైన్ టికెటింగ్‌ను నైజాంలో వ‌ద్ద‌ని అనుకున్నారు. ముందుగా టికెట్ తీసుకోవాల‌నుకున్న ప్రేక్షకులు నేరుగా టికెట్ కౌంట‌ర్‌నే సంప్ర‌దించాల‌ని నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌నే ఎదుర్కొంటుంది. ఈ క్ర‌మంలో సామాన్యుడిపై ఆన్ లైన్ టికెటింగ్ సిస్ట‌మ్ ద్వారా మ‌రింత భారం పెరిగింది. దీన్ని త‌గ్గించే దిశ‌గానే నైజాం డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. భీమ్లా నాయ‌క్ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ వంశీ నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, రైట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లేతో పాటు పాట కూడా రాయ‌డం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gtxQ4AU

Realme 9 Pro+ 5G First Sale in India Begins Today: All Details

Realme 9 Pro+ 5G will go on sale in India for the first time today (February 21) and the company's latest midrange smartphone comes with a MediaTek Dimensity 920 SoC under the hood, paired with up...

from NDTV Gadgets - Latest https://ift.tt/n0DXUMS

Redmi Note 11S Sale Begins in India Today: All You Need to Know

Redmi Note 11S was launched in India last week and it is now going on sale in the country for the first time today. The handset will be available for purchase in three colour options with an initial...

from NDTV Gadgets - Latest https://ift.tt/qwpFiPc

Vivo V23e 5G Launching in India Today: How to Watch Livestream

Vivo V23e 5G will launch in India today at 12pm IST (noon). The smartphone's launch event will be livestreamed on Vivo's official Youtube channel. The third smartphone in the Vivo V23 lineup was...

from NDTV Gadgets - Latest https://ift.tt/wEcAgko

Saturday, 19 February 2022

జీవితంలో ఎన్నో వచ్చిపోతుంటాయ్.. కానీ! సమంత ఎమోషనల్ పోస్ట్

అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ అనంతరం ప్రతి క్షణం వార్తల్లో నిలుస్తోంది సమంత. ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్‌డేట్స్ ఇస్తున్నారు న్యూస్ మేకర్స్. ముఖ్యంగా సోషల్ మీడియా వాల్‌పై రాస్తున్న ప్రతి కొటేషన్‌లో అర్థాలు వెతుకుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'లైఫ్ అంటే ఇదే' అని ట్యాగ్ చేస్తూ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఆన్ లైన్ వేదికలపై తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు సినిమా షూటింగ్స్‌లో భాగమవుతూనే వీలు కుదిరినప్పుడల్లా దేశాన్ని చుట్టివస్తూ అందమైన లొకేషన్స్‌కి వెళ్లి రిలాక్స్ అవుతోంది సమంత. ఈ క్రమంలోనే తాజా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎగిసిపడుతున్న ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ సమంత పెట్టిన కొటేషన్ ఆలోచింపజేస్తోంది. వచ్చిపోయేవి ఎన్నో ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడం, భరించడం అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది అని పేర్కొంటూ సింపుల్‌గా 'లైఫ్' అని రాసింది సమంత. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియా ఖాతాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సమంత.. తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే ఇలా మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసిన ఆమె, ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న 'కాతు వాకుల్ రెండు కాదల్' అనే సినిమాలో, ఓ ఇంటర్నేషనల్ వెబ్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది. విడాకుల తర్వాత పూర్తి సమయాన్ని కెరీర్ కోసమే కేటాయిస్తోంది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mt6yp5H

All You Need to Know About Destiny 2: The Witch Queen

Destiny 2: The Witch Queen is a major expansion pack for Destiny 2 - the popular free-to-play online-only multiplayer first-person shooter. The new expansion pack gets new location, maps, weapons,...

from NDTV Gadgets - Latest https://ift.tt/iJrugNx

విజయ్ దేవరకొండ చాలా పిరికివాడు.. హీరోయిన్ అలా అనేసిందేంటి బాబోయ్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విజయ్‌తో కలిసి 'లైగర్' సినిమా చేస్తున్న ఈ హీరోయిన్ ఆయన రియల్ లైఫ్ క్యారెక్టర్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా 'గెహ్రయాన్' రూపంలో హిట్ అందుకున్న అనన్య పాండే.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండపై ఇలాంటి కామెంట్స్ వదలడం హాట్ టాపిక్ అయింది. తెరపై కనిపించేదానికి పూర్తి భిన్నంగా బయట ఉంటారని, అంతేకాదు.. అతడు సహజంగా పిరికివాడు అని కూడా అనేసింది అనన్య. ఆయనతో నటించడం చాలా సరదాగా ఉంటుందని, ఓ నటిగా తనకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చిన వ్యక్తి విజయ్ అని ఆమె పేర్కొంది. ఆయన నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమా చూశానని, ఆ మూవీ చాలా నచ్చిందని చెప్పిన అనన్య.. సినిమాలోని ఆ క్యారెక్టర్‌కి, విజయ్ దేవరకొండ రియల్ క్యారెక్టర్‌కి అసలు పొంతనే ఉండదని ఆమె చెప్పడం గమనార్హం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అన్ని హంగులతో 'లైగర్' సినిమా రూపొందుతోంది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ- అనన్య పాండే కెమిస్ట్రీ హైలైట్ కానుందట. చిత్రంలో బాక్సర్‌గా, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబో అయ్యేసరికి సినీ వర్గాల్లో ఓ రకమైన క్రేజ్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన 'లైగర్' అప్‌డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ముఖ్యపాత్రలో కనిపించనుండటం మరో విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jFfweH0

ఆడవాళ్ళు మీకు జోహార్లు: భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌.. తప్పలేదు మరి..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో . ఈ క్రమంలోనే క్రేజీ హీరోయిన్ జంటగా '' అనే సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ కాగా సడెన్‌గా 'భీమ్లా నాయక్' అడ్డు పడటంతో వెనక్కి తగ్గారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ వాయిదా పడడంతో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకుల నుంచి బెటర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఓ మోస్తారు హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఈ మూవీ హిట్ శర్వానంద్‌కి చాలా కీలకం కానుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి రోల్స్, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో హైలైట్ కానుందని తెలుస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే అంటున్నారు మేకర్స్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. శర్వా గత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకే పెద్ద సినిమాతో పోటీ వద్దని భావించి కాస్త దూరం జరిగినట్లున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OQDfg4n

చిరంజీవి, మోహన్ బాబు మీటింగ్.. దానిపైనే కీలక చర్చ!

టాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా నెలకొంటున్న పరిస్థితులు పలు చర్చలకు దారి తీశాయి. కరోనా కష్ట కాలంలో ఇండస్ట్రీ కష్టాలు మొదలుకొని 'మా' ఎన్నికల రగడ, మొన్నటికి మొన్న ఏపీ టికెట్ రేట్ల అంశం వరకు ప్రతిదీ హాట్ టాపిక్ అయింది. దీంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరు? గడ్డు పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకునే వారు ఎవరు? అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో , వెళ్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ ఒకేవేదికపై రాబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితులపై ఇవాళ టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు. ఆదివారం రోజు జరగబోతున్న ఈ సమావేశానికి చిరంజీవి, మోహన్ బాబు సహా పలువురు సినీ పెద్దలు హాజరు కాబోతున్నారట. అలాగే ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు చెందిన ప్రతినిధులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబంధించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరై పలు కీలక విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఎట్టకేలకు ఇండస్ట్రీలోని అన్ని విభాగాలు ఒక్కతాటి పైకి వచ్చే ప్రయత్నం చేయడం, ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి సిద్ధం కావడం అనేది సినీ వర్గాల్లో ఒకింత శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఈ మీటింగ్‌లో మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా హాజరు కాబోతున్నారట. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం మొదలగు అంశాలపై ఈ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఒకే వేదికపై మరోసారి చిరంజీవి, మోహన్ బాబులు కనిపించనుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6gmcrfu

NBK 107 Leaked Pic : NBK 107 టీంకు తలనొప్పిగా మారిన లీకులు.. దండం పెట్టిన దర్శకుడు

నటసింహం 107వ సినిమాను అదిరిపోయే కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతోన్నాడు. మాస్ జాతర మరోసారి చూపించేందుకు గోపీచంద్ రెడీ అయినట్టు కనిపిస్తోంది. అసలే ఈ హీరో,దర్శకులు ఇద్దరూ కూడా మంచి హిట్లతో ఊపు మీదున్నాడు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు గోపీచంద్ మలినేని. ఇక బాలయ్య అయితే అఖండ సినిమాతో మాస్ జాతరను చూపించాడు. థియేటర్లో బాలయ్య దెబ్బకు బాక్సులు బద్దలయ్యాయి. బాలయ్యతో మాస్ సినిమాను చూసేందుకు గోపీచంద్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ వచ్చాడు. మొత్తానికి తన కలను నెరవేర్చుకున్నాడు. బాలయ్య సినిమా షూటింగ్‌ను ప్రారంభించడంపై గోపీచంద్ ఎమోషనల్ అయ్యాడు. కలలు నిజమవుతాయని అంటారు.. ఇప్పుడు ఈరోజు నా కల నెరవేరిందంటూ నిన్న గోపీచంద్ ట్వీట్ వేశాడు. బాలయ్యను ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించే బాధ్యత నాది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్‌లతో కలిసి యాక్షన్ పార్ట్‌ను గోపీచంద్ మొదలుపెట్టేశాడు. అయితే నిన్నటి షూటింగ్‌లో బాలయ్య అడుగు పెట్టనట్టు కనిపిస్తోంది. కానీ నేడు బాలయ్య సెట్‌లోకి అడుగుపెట్టేశాడు. అయితే మొదటి రోజే టీంకు షాక్ తగిలింది. బాలయ్య లుక్ బయటకు వచ్చింది. లీకైన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బాలయ్య లుక్కుని చూసి జనాలు అవాక్కవుతున్నారు. లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మొత్తానికి ఈ విషయం చిత్రయూనిట్ దృష్టికి వచ్చినట్టుంది. రంగంలోకి దర్శకుడు గోపీచంద్ దిగాడు. ఈ లీకులను ఆపండని వేడుకున్నాడు. ఎవ్వరూ కూడా ఈ లీకైన ఫోటోలు, వీడియోలను స్ప్రెడ్ చేయకండి.. ఇది నా రిక్వెస్ట్.. అంటూ దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. కానీ ఇప్పటికే ఆ ఫోటోలు అందరి వద్దకు చేరిపోయినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ తాను వేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశాడు. మరి దీని వెనుకున్న కారణం ఏంటో తెలియడం లేదు. ఇంకా ఇలా వేడుకుంటే మరింతగా స్ప్రెడ్ చేస్తారని భావించాడో లేక నిర్మాణ సంస్థ, హీరో నుంచి ఏదైనా ఆదేశాలు వచ్చి ఉంటాయో తెలియడం లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xw4AFdH

Friday, 18 February 2022

Manchu Mohan Babu : ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ డేట్ కలెక్షన్స్.. హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలంటే!

సీనియ‌ర్ న‌టుడు.. క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘’. ఫిబ్రవరి 18న మూవీ రిలీజైంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ ముందే విప‌రీత‌మైన ట్రోలింగ్‌ను ఫేస్ చేసింది. ట్రోల‌ర్స్ సినిమాను బేస్ చేసుకుని మంచు ఫ్యామిలీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. సినిమా రిలీజైంది. సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చింది. చాలా చోట్ల సినిమా షోస్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు తొలి రోజున కోటి రూపాయ‌ల నుంచి రెండు కోట్ల రూపాయ‌ల మేర‌కు మాత్ర‌మే వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా యూనిట్ నుంచి స‌న్ ఆఫ్ ఇండియా మూవీ క‌లెక్ష‌న్స్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. సినిమా బ‌డ్జెట్ ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్ర‌కారం రూ.12 కోట్లు మేర‌కు ఖ‌ర్చు అయ్యాయ‌ట‌. ఇక సినిమా తొలి రోజునే ఇంత వీక్ క‌లెక్ష‌న్స్ రావ‌డం కాస్త సోచ‌నీయం. సినిమా హిట్ కావాలంటే సినిమాకు రూ.20 కోట్లు రావాలి. నేటి రాజ‌కీయ నాయ‌కుల తీరు తెన్నుల గురించి విమ‌ర్శ‌నాత్మ‌కంగా.. చాలా చోట్ల ఏక‌పాత్రాభిన‌యంతో మోహ‌న్ బాబు న‌టిస్తూ ప్ర‌యోగాత్మ‌కంగా స‌న్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని రూపొందించారు. ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు. మోహ‌న్ బాబు హీరోగా న‌టించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ప్ర‌గ్యా జైశ్వాల్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్‌, అలీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. అంతకు ముందు ఆయన సూర్య హీరోగా చేసిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/eCglnID

Fidelity Launches Its First Bitcoin Exchange-Traded Product in Europe

British Investment firm Fidelity International has introduced its first investment product that tracks Bitcoin in Europe called the Fidelity Physical Bitcoin ETP.

from NDTV Gadgets - Latest https://ift.tt/kS7KQFO

ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం : మెగాస్టార్ చిరంజీవి

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ పుట్టిన‌రోజు నేడు (ఫిబ్ర‌వ‌రి 19). ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు తెలుగు అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన మెగాస్టార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘గురు తుల్యులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తం చేసి తెలుగు సినిమా చ‌రిత్ర శంక‌రాభ‌ర‌ణం ముందు, శంక‌రా భ‌ర‌ణం త‌ర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారంద‌రికీ అందిన వ‌రం. మీ చిత్రాలు అజ‌రామ‌రం. మీ దర్శ‌క‌త్వంలో న‌టించ‌డం నా అదృష్టం. మీరు క‌ల‌కాలం ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిరంజీవి హీరోగా క‌ళాత‌ప‌స్వి మూడు సినిమాల‌ను రూపొందించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో శుభ‌లేఖ అనే సినిమాను డైరెక్ట్ చేశారు విశ్వ‌నాథ్‌. త‌ర్వాత చిరంజీవి మాస్ హీరోగా అగ్ర స్థాయికి చేరుకున్న త‌ర్వాత కూడా విశ్వ‌నాథ్‌తో రెండు సినిమాలు చేశారు. అందులో ఒక‌టి స్వ‌యం కృషి. చిరంజీవికి ఉన్న మాస్ ఇమేజ్‌కు భిన్న‌మైన క‌థాంశంతో సాగే ఈ చిత్రంలో చిరంజీవిని చెప్పులు కుట్టే సాంబ‌య్య‌గా చూపించి అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఘ‌న‌త విశ్వ‌నాథ్‌కే ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత ఆప‌ద్బాంధ‌వుడు సినిమాలో చిరంజీవి మాధవ అనే మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో చూపించారు విశ్వ‌నాథ్‌. ఎంత మాస్ ఇమేజ్ ఉన్న‌ప్ప‌టికీ విశ్వ‌నాథ్ సినిమాల కోసం త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ చిరంజీవి సినిమాలు చేశారు. ఆడియోగ్రాఫ‌ర్‌గా సినీ ఇండ‌స్ట్రీలో ప‌నిచేసిన కె.విశ్వ‌నాథ్ త‌ర్వాత అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు రాజ్య‌మేలుతున్న కాలంలో రొటీన్‌కు భిన్న‌మైన సినిమాలైన శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం, స్వాతి ముత్యం, స్వ‌యంకృషి వంటి విభిన్న‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించి ద‌ర్శ‌క‌కుడిగా విజ‌యాల‌ను సాధించి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌చ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/S7ZEwlO

Spiritual Tour : చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర‌.. వీడియో షేర్ చేసిన మెగాస్టార్ !

మెగాస్టార్ రీసెంట్‌గా కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌ముఖ దేవాల‌యాల‌ను సంద‌ర్శించారు. ఫిబ్ర‌వ‌రి 12 నుంచి 13 వ‌ర‌కు అంటే 24 గంట‌ల్లో చేసిన ఆధ్యాత్మిక యాత్ర‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. యాత్ర‌లో భాగంగా ముందుగా ఆయ‌న తెలంగాణ ముచ్చింత‌ల్‌లో శ్రీమ‌తి సురేఖ‌తో క‌లిసి స‌మ‌తా మూర్తి (రామానుజచార్యులు)ని ద‌ర్శించుకున్నారు. అక్క‌డి నుంచి కేర‌ళ టూర్‌కి వెళ్లారు. ముందుగా శ‌బ‌రి మ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ అయ్య‌ప్ప స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. శ‌బ‌రి మ‌లై నుంచి గురువాయూర్‌కు వెళ్లారు. ఫిబ్ర‌వ‌రి 12 సాయంత్రం నుంచి 13 సాయంత్రం వ‌ర‌కు జ‌రిగిన ఆధ్యాత్మిక యాత్ర చ‌క్క‌గా ముగిసింద‌ని తెలిపారు. చిరంజీవి దంప‌తుల‌తో ఫొనిక్స్ సురేష్ దంప‌తులు కూడా ఉన్నారు. శ‌బ‌రి మ‌లై యాత్ర‌కు వెళ్లిన తర్వాత చిరంజీవి ఆ ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక యాత్ర‌కు సంబంధించిన వీడియో షేర్ చేశారు మెగాస్టార్‌. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ఆచార్య‌. ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టించారు. ఇది కాకుండా లూసిఫ‌ర్ రీమేక్‌గా రూపొందుతోన్న గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ‌లో చిరంజీవి బిజీగా ఉన్నారు. అలాగే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భోళా శంక‌ర్‌, డైర‌క్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇవ‌న్నీ కాకుండా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో డివివి దాన‌య్య నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు చిరంజీవి. సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కూడా ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని రీసెంట్‌గా వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిశారు. థియేట‌ర్స్ విష‌యంలో స‌మ‌స్య త్వ‌ర‌లోనే స‌మ‌సి పోయేలా చొర‌వ తీసుకున్నారు మెగాస్టార్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sMk1D58

Amitabh Bachchan : ‘ప్రాజెక్ట్ K’తో క‌ల నిజ‌మైంది : ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ఫ్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీనియ‌ర్ నిర్మాత చ‌ల‌సాని అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’ సినిమా స‌క్సెస్‌తో ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి.. ‘మ‌హాన‌టి’ వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీని రూపొందించి ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీని త‌న వైపు చూసేలా చేసుకున్న ద‌ర్శ‌క‌కుడు నాగ్ అశ్విన్‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. కొన్ని రోజులుగా ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో ఆయ‌న చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప్ర‌భాస్‌ల‌పై కాంబినేష‌న్ సీన్‌ను చిత్రీక‌రించారు. దీనిపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌భాస్ స్పందిస్తూ ‘‘నా కల నిజమైంది. లెజెండ్రీ గారితో ఈరోజు నా తొలి స‌న్నివేశాన్ని పూర్తి చేశాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. పాన్ ఇండియా మూవీగా కాకుండా ఈ చిత్రాన్ని పాన్ వ‌రల్డ్ మూవీగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ తెలిపారు. సై ఫై మూవీగా ‘ప్రాజెక్ట్ K’ తెర‌కెక్కుతోంద‌ని టాక్ సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. క్రేజీ కాంబినేష‌న్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ‘బాహుబ‌లి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ మార్చి 11న ‘రాధే శ్యామ్’తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. మరో వైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆది పురుష్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ‘సలార్’ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్నారు మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OnbQhms

NBK 107 లొకేష‌న్‌ నుంచి ఫొటో లీక్... సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్య

న‌టిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ శుక్ర‌వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 107వ చిత్ర‌మిది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌కృష్ణ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా లొకేష‌న్ నుంచి ఫొటో ఒక‌టి నెట్టింట లీక్ అయ్యింది. అది కూడా ఏకంగా బాల‌కృష్ణ లుక్. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో బాల‌కృష్ణ క‌నిపించ‌బోతున్నార‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అలాగే బాల‌కృష్ణను మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో మెలితిప్పిన మీసాల లుక్‌లో చూడ‌బోతున్నాం. నిజ ఘ‌ట‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాల‌కృష్ణ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. చిత్రీక‌ర‌ణ మొద‌టి రోజునే బాల‌కృష్ణ లుక్ లీక్ కావ‌డం అనేది నిర్మాత‌ల‌ను కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. లీకుల విష‌యంలో మేక‌ర్స్ జాగ్ర‌త్త‌లు పాటిస్తే బావుంటుంది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మిస్తోంది. అఖండ‌తో గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌కృష్ణ హీరోగా క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా రిషి పంజాబి సినిమాటోగ్రాఫ‌ర్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xQfKA0B

Stranger Things 4 Release Dates Unveiled, Season 5 Will End Netflix Series

Stranger Things 4 Volume 1 premieres May 27 on Netflix, and Stranger Things 4 Volume 2 follows July 1. Stranger Things will end with a fifth and final season. The Duffer Brothers are already teasing...

from NDTV Gadgets - Latest https://ift.tt/qAcLzG9

Thursday, 17 February 2022

Amazon Accepts Visa Credit Cards in Global Truce Over Fees

Amazon has agreed to allow visa cards for payments on its sites worldwide without additional fees.

from NDTV Gadgets - Latest https://ift.tt/bzmGBE5

భీమ్లా నాయక్ గ్రాండ్ రిలీజ్.. థియేటర్ల లెక్కచెప్పిన తమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భారీ సినిమా 'భీమ్లా నాయక్'. గతంలో కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నిన్నటితో చిత్ర షూటింగ్, ప్యాచ్ వర్క్ అంతా ఫినిష్ చేశారు. ఈ మేరకు మరోసారి రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్ వదులుతూ విడుదల కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దేశవిదేశాల్లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ .. యూఎస్ థియేటర్స్‌ లెక్క చెబుతూ పోస్ట్ పెట్టారు. యూఎస్‌లో భీమ్లా నాయక్ సినిమా కోసం 400 థియేటర్స్‌ కేటాయించారని పేర్కొంటూ ఓ పోస్టర్ వదిలారు తమన్. ఫిబ్రవరి 24న యూఎస్ ప్రీమియర్స్ పడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇకపోతే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాటు చేస్తున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తార‌నేది స‌మాచారం. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌ కేటాయించి నిర్మించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాపై మెగా వర్గం ఓ రేంజ్ అంచనాలు పెట్టుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/bOldqAj

Crypto Police: FBI Is Forming a Digital Currency Unit for Virtual Asset Seizures

FBI is launching a unit for blockchain analysis and virtual asset seizure and the US Justie department has tapped a seasoned computer crimes prosecutor to lead its new national cryptocurrency...

from NDTV Gadgets - Latest https://ift.tt/bBvMQO7

'Investment not gathering momentum will be big risk'

'The government is trying to kickstart the investment cycle in India and while the corporate investments are yet to gather momentum, there are early signs of the same.'

from rediff Top Interviews https://ift.tt/9xoTlkU

నా భర్తను చంపింది ఆ హీరోయినే! ఓర్వలేక హత్య చేశారంటూ ఓపెన్ అయిన సీనియర్ నటి

సినీ పరిశ్రమలో మనకు తెలియని, మన దాకా రాని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి. సాధారణ ప్రజల్లో లాగే సెలబ్రిటీల జీవితాల్లోనూ కష్టసుఖాలు, ఒడిదొడుకులు ఉంటాయి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడే అవి బయటపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తన జీవితంలో చోటుచేసుకున్న చేదు ఘటన గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు సీనియర్ నటి . దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణవేణి జీవితంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి, లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఆమె చెప్పుకొచ్చారు. మొదట పదేళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకున్న ఆమె.. 13 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత భర్తతో వచ్చిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని చాలా ఏళ్లకు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడితో పెళ్లయ్యాక నాలుగేళ్లకే ఆయన చనిపోయారు. తాజాగా ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలు వెల్లడించారు కృష్ణవేణి. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలో ''వారాలబ్బాయి, శ్రీమతి గారు, ముగ్గురు మిత్రులు'' లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ రాజాచంద్రతో పరిచయం మొదలై పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు కృష్ణవేణి. మొదట ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాజాచంద్ర ఇండస్ట్రీలో బాగా ఎదుగుతుండటం చూసి కొందరు జీర్ణించుకోలేక ఆయన్ను చెంపేశారని ఆమె తెలిపారు. ఆయన సినిమాలు భారీ హిట్స్ సాదిస్తుండటం ఓర్వలేక ఇండస్ట్రీ వాళ్లే ఆయనను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని కృష్ణవేణి అన్నారు. ఆ సమయంలో పోలీసులు కూడా సహాయం చేయలేదని, కాకపోతే ఆ మరణం వెనుక ఏం జరిగిందనేది తనకు పూర్తిగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉందని ఆమె అన్నారు. కరెంటు వైర్లు పెట్టి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేయించింది ఆ హీరోయినే అంటూ సంచలన ఆరోపణలు చేశారు కృష్ణవేణి. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది చెప్పని కృష్ణవేణి.. తన భర్త మరణం తర్వాత కొన్నేళ్లకు ఆ హీరోయిన్ కూడా షుగర్‌తో చనిపోయిందని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/odRA653

Wednesday, 16 February 2022

A OnePlus Double Feature: Tune In to Watch the Livestream

​​​​​​​

from NDTV Gadgets - Latest https://ift.tt/QY9SXRL

Casting Couch : టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ .. అవ‌కాశాలిస్తామని హీరోయిన్స్‌కి ఎర.. అనుష్క శెట్టి వ్యాఖ్య‌లు వైర‌ల్‌

లైంగిక వేధింపులు.. ఉద్యోగం చేస్తున్న మ‌హిళ‌లు వారున్న ఆఫీసుల్లో, ప‌రిసరాల్లో ఎదుర్కొంటున్న ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య ఇది. తోటి ఉద్యోగులు, పై అధికారులు మ‌హిళ‌ల‌ను ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ మీ టూ అనే పెద్ద ఉద్య‌మ‌మే న‌డిచింది. ఇందులో సినీ ప‌రిశ్ర‌మ కూడా భాగ‌మైన త‌ర్వాత చాలా మంది మ‌హిళ‌లు సినీ ఇండ‌స్ట్రీలో తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను బ‌య‌ట పెట్టారు. ఇలా గుట్టుగా ఉంటూ వ‌చ్చిన స‌మ‌స్య‌లు బ‌య‌ట ప‌డ‌టంతో ఒక్క‌సారి సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమార‌మే రేగింది. కాస్టింగ్ కౌచ్ అనేది అన్నీ రంగాల్లోనూ ఉంది. కానీ మీడియా కార‌ణ‌మో, మ‌రేదైనా కార‌ణ‌మో ఏమో కానీ.. సినీ ప‌రిశ్ర‌మ‌పైనే ఫోక‌స్ ఎక్కువైంది. ప‌లువురు న‌టీమ‌ణులు, హీరోయిన్స్ అంద‌రూ సినీ ఇండ‌స్ట్రీలో తాము ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌పై నోరు విప్పారు. అలాంటి స‌మ‌యంలో టాలీవుడ్‌కి చెందిన‌ స్టార్ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్‌పై చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ‘‘టాలీవుడ్‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంది. అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయ‌డం అనే సంస్కృతిని తెలుగు సినిమాలో నేనూ చూశాను. చాలా మంది మ‌హిళ‌లు కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారే. అయితే నేను నిజాయ‌తీగా, నిక్క‌చ్చిగా మాట్లాడ‌టంతో అలాంటి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నాకు ఎదురు కాలేదు. సినిమా పరిశ్రమలోనే కాదు. అన్నిచోట్ల మహిళలకు ఇలాంటి ఇబ్బందులున్నాయి’’ అని తెలియ‌జేసింది జేజెమ్మ‌. ఈ విష‌యాన్ని ఆమె రెండేళ్లు ముందు నిశ్శ‌బ్దం సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్రేక్ష‌కుల‌ను సూప‌ర్ సినిమాతో ప‌ల‌క‌రించిన అనుష్క శెట్టి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. అరుంధ‌తి చిత్రంతో టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. భాగ‌మ‌తి సినిమా కూడా ఆమెకు మ‌రింత పేరుని తెచ్చి పెట్టింది. 2020లో నిశ్శ‌బ్దం త‌ర్వాత దాదాపు ఈమె రెండేళ్లు సినిమాలేవీ చేయ‌లేదు. ప్ర‌స్తుతం యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/y2tL5Mg

'IPL Auction A Reboot for Punjab Kings'

'At the end of the day, we also had to look at players who will figure in the playing XI.'

from rediff Top Interviews https://ift.tt/42YctjD

OnePlus Nord CE 2, TV Y1S Series to Launch in India Today: How to Watch Live

OnePlus is set to launch OnePlus Nord CE 2 5G, the latest addition to the company's code edition (CE) smartphone lineup, alongside the OnePlus TV Y1S, OnePlus TV Y1S Edge smart TV models today....

from NDTV Gadgets - Latest https://ift.tt/8AE32LC

నాపై ట్రోలింగ్ చేయిస్తున్న ఆ హీరోలకు శిక్ష తప్పదు.. మంచు మోహ‌న్ బాబు వార్నింగ్

క‌థానాయ‌కుడిగా, ప్ర‌తి నాయ‌కుడిగా, నిర్మాత‌గా, విద్యా సంస్థ‌ల అధినేత‌గా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న విల‌క్ష‌ణ న‌టుడు క‌లెక్ష‌న్ కింగ్ డా. మంచు మోహ‌న్ బాబు. ఈయ‌న హీరోగా న‌టించిన చిత్రం ‘’. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్స్‌పై ఘాటుగానే స్పందించారు. ‘‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలే త‌ప్ప‌, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండ‌కూడ‌దు. సాధార‌ణంగా నేను ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను ప‌ట్టించుకోను. ఎవ‌రైనా నాకు పంపిన‌ప్పుడే చూస్తాను. నిజానికి ట్రోలింగ్‌ను ప‌ట్టించుకోకూడ‌దు. కానీ ఇవి హ‌ద్దులు మీరుతున్నాయి. అలాంటి వాటిని చూసిన‌ప్పుడు బాధ‌గా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయ‌వ‌చ్చునేమో నాకు తెలియ‌దు కానీ.. వ్య‌గ్యంగా ట్రోల్ చేయ‌డం అనేది బాధాక‌రంగా ఉంటుంది. ఇద్ద‌రు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయ‌డానిక‌నే నియ‌మించుకుని ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవ‌రో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గ‌మ‌నిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభ‌విస్తారు. అప్పుడు వారి వెనుక ఎవ‌రూ ఉండ‌రు. ఎవ‌రూ స‌హాయ‌ప‌డ‌రు’’ అన్నారు మోహన్ బాబు. దేశ భక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్‌గా రూపొందిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో ప్రైవేట్ జైలు అనే కాన్సెప్ట్‌ను చూపించ‌బోతున్నారు. ఓటీటీ కోసమ‌ని ముందు ఈ సినిమాను నిర్మించారు. 1గంట 29 నిమిషాలే ఈ సినిమా వ్య‌వ‌ధి. నిర్మాత‌గా, థియేట‌ర్స్‌ను ప్రేమించే వ్య‌క్తిగా మోహ‌న్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని థియేటర్స్‌లోనూ విడుద‌ల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/tWr63pz

Oppo Reno 7 5G Goes on Sale in India: All Details

Oppo Reno 7 5G to go on sale in India for the first time tonight. The flagship smartphone form Oppo was launched in India last week along with the vanilla Oppo Reno 7 Pro 5G. The smartphone sports a...

from NDTV Gadgets - Latest https://ift.tt/He8RG4b

హీరోతో డేటింగ్ .. ప్రేమ.. పెళ్లి గురించి రష్మిక కామెంట్స్ !

శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా ఉంది. ఒక‌వైపు ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ న‌టిస్తోంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేస్తుందంటూ సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగానే వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గిన‌ట్లు వారిద్ద‌రూ ముంబైలో చ‌క్క‌ర్లు కొట్టిన‌ప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇదే విష‌యంపై ర‌ష్మిక మంద‌న్న స్పందించారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమె త‌న రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తోసి పుచ్చారు. మ‌రి మీరు పెళ్లి చేసుకోవాల‌నుకునే కుర్రాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని అమ్మ‌డుని ప్ర‌శ్నిస్తే.. న‌న్ను ఎవ‌రు జాగ్ర‌త్త‌గా చూసుకుంటారో వారినే పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాను. అయితే ఇంకా నేను చిన్న‌పిల్ల‌నే, పెళ్లి గురించి ఎలా ఆలోచించాలో కూడా తెలియ‌డం లేదు. అందుక‌నే నా మ‌న‌సులోకి పెళ్లి సంబంధించిన ఆలోచ‌న‌ను రానీయ‌డం లేదు’’ అని చెప్పుకొచ్చిందీ శాండిల్ వుడ్ బ్యూటీ. గ‌త ఏడాది పుష్ప ది రైజ్ చిత్రంతో ర‌ష్మిక పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా మారింది. ఈ శివ‌రాత్రికి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఇక ఏలాగూ ఈ ఏడాది పుష్ప సినిమాలో సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో అభిమానుల‌ను అల‌రించ‌నుంది. ఇక బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్ను సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో విడుద‌ల‌వుతుంది. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి గుడ్ బై అనే సినిమాలోనూ ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. ఇందులో అమితాబ్ కుమార్తె పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ఇన్ని క్రేజీ ప్రాజెక్టుల‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డానికి అందాల రాశి ర‌ష్మిక సిద్ధ‌మ‌వుతోంది మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hl5FAO4

Tuesday, 15 February 2022

Sansad TV Says YouTube Channel Restored, Was Compromised by 'Scamsters'

Sansad TV's YouTube channel was restored on Tuesday after being blocked briefly "for violating YouTube's community guidelines". The channel later said its YouTube account was compromised due to...

from NDTV Gadgets - Latest https://ift.tt/CvndywP

'Aviation ministry's role doesn't end with Air India'

'Government shouldn't be in the business of running airlines, instead it should develop the ecosystem of civil aviation.'

from rediff Top Interviews https://ift.tt/oOjlBC3

Ukraine Defence Ministry, Largest State Banks Knocked Out With Cyberattacks

Ukraine authorities said on Tuesday that its defence ministry website along with those of its two largest state banks were under cyberattacks, as tensions persisted over the threat of a possible...

from NDTV Gadgets - Latest https://ift.tt/XuwIRrv

పెళ్లికి ముందు నిఖిల్ తీరు! లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన పల్లవి

లాక్ డౌన్ వేళ యంగ్ హీరో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్‌ నెలలో కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తన ఇష్ట సఖి డాక్టర్ పల్లవిని పెళ్లాడారు నిఖిల్. వీరి పెళ్లి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నిఖిల్- లవ్ స్టోరీ గురించి చాలామంది ప్రేక్షకులు ఆరాదీశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ పెళ్లికి ముందు జరిగిన పరిణామాలు, లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది నిఖిల్ సతీమణి పల్లవి. పెళ్లి తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన ఈ లవ్లీ కపుల్స్‌.. తమ ప్రేమ సంగతులు పంచుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తామిద్దరం ఓ బర్త్ పార్టీలో తొలిసారి కలిశామని చెప్పారు. పల్లవిని చూసిన తొలి చూపులోనే ఆమె తెగ నచ్చేసి వెంటపడ్డానని అన్నారు నిఖిల్. మొదటగా నిఖిల్ తన లవ్ ప్రపోజ్ చేశారట. అయితే నిఖిల్ ఐ లవ్ యూ అని చెప్పగానే జోక్ చేస్తున్నాడేమో అనుకుందట పల్లవి. అంతలోనే నిఖిల్ ఆ మాట చెప్తాడని ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నిఖిల్‌కి వెంటనే ఓకే చెప్పకుండా ఇంట్లో వారితో మాట్లాడి వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిఖిల్ ప్రేమకు అంగీకరించాను అన్నట్లుగా పల్లవి చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్ళతో యాక్టర్ అని చెప్పలేదని, బిజినెస్‌మెన్ అని చెప్పానని తెలిపింది. నిఖిల్ నటించిన హ్యాపీడేస్, కార్తికేయ సినిమాలను మాత్రమే పెళ్లికి ముందు చూశానని.. కానీ పెళ్లి తర్వాత కూర్చోబెట్టి తను నటించిన అన్ని సినిమాలను కూడా బలవంతంగా నిఖిల్ చూపించాడంటూ పల్లవి చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత గోవాలో ఓ 20 రోజుల పాటు సరదాగా ఎంజాయ్ చేశామని, ప్రస్తుతం తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని పల్లవి తెలిపింది. నిఖిల్‌లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అందరితో కలిసిపోవడం అని ఆమె చెప్పింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/iWfhruF

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి కన్నుమూత

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌లో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన బప్పీ లహరి తెలుగులో కొన్ని సినిమాలకు బాణీలు కట్టారు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. 80, 90 దశకాల్లో ఎన్నో మరపురాని ఆణిముత్యాలు అందించారు బప్పీ లహరి. చివరగా 2020లో వచ్చిన భాగి 3లో ఓ పాట పాడారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఊపు తెప్పించే ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీ లహరి. హిందీ చిత్రరంగానికి డిస్కో సంగీతం పరిచయం చేసిన ఘనత ఆయనదే. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' చిత్రానికి ఆయన కట్టిన బాణీలు నేటి తరాన్ని కూడా ఉర్రూతలూగిస్తున్నాయి. హిందీలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి పాపులర్ అయిన బప్పీ లహరి.. తెలుగులో ''స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, సామ్రాట్, రౌడీ ఇన్‌స్పెక్టర్ లాంటి సినిమాలకు సంగీతం సమకూర్చి తన మార్క్ చూపించారు. చివరగా తెలుగులో 2020లో రవితేజ హీరోగా వచ్చిన 'డిస్కో రాజా' సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/PXpiHUS

Realme 9 Pro 5G, Realme 9 Pro+ 5G Launch in India Today: Watch Livestream

Realme 9 Pro 5G and Realme 9 Pro+ 5G will launch in India today at 1:30pm IST. The launch event will be livestreamed on Realme's official YouTube channel. Realme 9 Pro+ has been confirmed to be...

from NDTV Gadgets - Latest https://ift.tt/faPbOXB

లవ్ ఎఫైర్‌పై శ్రీముఖి క్లియర్ హింట్! ఓపెన్ అయిన బ్యూటీ

సెలబ్రిటీల లవ్ ఎఫైర్స్, ప్రేమ సంగతులంటే జనంలో అదో క్యూరియాసిటీ. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రేమాయణాలు తెలుసుకోవాలని, తెరవెనుక వారి వారి లవ్ ట్రాక్స్ ఎలా నడుస్తున్నాయని నిత్యం సెర్చ్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ యాంకర్ పెట్టిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రేమికుల రోజున సడెన్ సర్‌ప్రైజ్ చేసింది శ్రీముఖి. సాధారణంగా ప్రేమికులకు వాలెంటైన్స్ డే అనేది చాలా స్పెషల్. ప్రేమ సంగతులు బయటపెట్టడానికి, నచ్చిన వాళ్లకు బహుమతులు ఇవ్వడానికి ఈ రోజు కోసం వెయిట్ చేస్తుంటుంది ప్రేమ లోకం. అయితే ఇదే రోజు తనకు చాలా స్పెషల్ అంటూ యాంకర్ శ్రీముఖి మనసులో మాట చెప్పి ఆశ్చర్యపర్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా గులాబీ పూలు నింపిన ఫ్లవర్ బొకేతో దిగిన పిక్‌ను షేర్ చేసిన శ్రీముఖి.. 'ఫిబ్రవరి 14, 2022. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలెంటైన్స్ డే ఇది' అని పేర్కొంటూ హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్ పంచుకుంది. దీంతో ఈ ఫొటో, శ్రీముఖి పెట్టిన ఆ క్యాప్షన్ జనాల్లో పలు అనుమానాలకు తెరలేపింది. ఈ యంగ్ యాంకర్ ప్రేమలో పడిందని, ఇలా క్లియర్ హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 'ప్రపోజ్ చేయగానే ఎస్ అనేశారా మేడం?, అక్కా బావెక్కడ, ఇంతకీ అతనెవరు?' అంటూ శ్రీముఖి వెంటపడుతున్నారు నెటిజన్లు. చూడాలి మరి లవ్ ఎఫైర్‌ విషయమై శ్రీముఖి రియాక్షన్ ఎలా ఉంటుందనేది. మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకర్ అవతారమెత్తింది శ్రీముఖి. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'జులాయి' సినిమాతో నటిగా కెరీర్‌ ఆరంభించి ఆ తర్వాత ''నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ'' లాంటి సినిమాలతో అలరించింది. ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది. మరోవైపు బుల్లితెరపై హవా నడిపిస్తూ పలు కార్యక్రమాలు హోస్ట్ చేస్తోంది శ్రీముఖి. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీ రెట్టింపు చేసుకుంది ఈ బుల్లితెర రాములమ్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/zeD1uY7

Monday, 14 February 2022

Poco M4 Pro 5G Set to Launch in India Today: All Details

Poco M4 Pro 5G India launch is taking place today (Tuesday, February 15) through a livestream. The Poco phone debuted in Europe last year, with features including a 90Hz display and a MediaTek...

from NDTV Gadgets - Latest https://ift.tt/kCzfgWw

Pawan Kalyan : ‘భీమ్లా నాయ‌క్’ టికెట్ కోసం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమాని ఆత్మ‌హ‌త్య‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇందులో రానా ద‌గ్గుబాటి డానియ‌ల్ శేఖ‌ర్ అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌లు ప్ర‌కారం, ఫిబ్రవరి 25నే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌కు ముందుగానే ఈ విష‌యం చేరిన‌ట్లు టాక్‌. అభిమానులు సినిమా చూడ‌టానికి ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ఓ వీరాభిమాని భీమ్లానాయ‌క్‌ను ముందుగా ఇత‌ర అభిమానుల‌తో క‌లిసి తెర‌పై చూడాల‌ని అనుకున్నాడు. కుద‌ర‌ద‌ని తెలియ‌డంతో ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఇక్క‌డ బాధ‌ప‌డాల్సిన విష‌యం ఏంటంటే, స‌ద‌రు అభిమాని వ‌య‌సు 11 ఏళ్లు కావ‌డ‌మే. వివ‌రాల్లోకి వెళితే జ‌గిత్యాలలోని పురానీ పేట‌కు చెందిన ఓ కుర్రాడు 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని. స్నేహితుల‌తో క‌లిసి భీమ్లా నాయ‌క్ సినిమాను చూడాల‌నుకున్నాడు. అందుకు రూ.300 కావాల‌ని తండ్రిని అడిగాడు. అయితే తండ్రి దిన‌స‌రి కూలీ. మూడు వంద‌ల రూపాయ‌లంటే వారికి భార‌మైన విష‌య‌మే. దీంతో తండ్రి బాలుడిని కాస్త వ్య‌వ‌ధి అడిగాడు. మీరెప్పుడూ ఇంతే అంటూ గ‌దిలోకి వెళ్లి త‌లుపులు వేసుకున్నాడు. ఎంత‌కీ త‌లుపులు తీయ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చి త‌లుపులు కొట్టారు. తీయ‌క‌పోవ‌డంతో త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి లోప‌లికి వెళ్లారు. అక్క‌డ వారి కొడుకు బాల్క‌నీలో లుంగీతో ఉరి వేసుకుని చ‌నిపోయి ఉండ‌టానికి త‌ల్లిదండ్రులు చూసి గుండెల‌విసేలా రోదించారు. స్థానికులు స‌మాచారంతో పోలీసులు వ‌చ్చి కేసు నమోదు చేశారు. త‌న కొడుకు ఇలా చేస్తాడ‌ని అనుకోలేద‌ని, ఎంతో ప్రేమ‌గా పెంచుకున్న కొడుకు ఇలా దూర‌మ‌వుతాడ‌ని అనుకోలేదంటూ త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌య్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/CBd8yGR

'Projected 9.2% GDP growth is just for galleries'

'India's output contraction in the previous year was among the worst in the world!'

from rediff Top Interviews https://ift.tt/fe8BUqS

Vedanta and Foxconn Partner to Make Chips in India Amid Global Shortage

Foxconn, a major Apple supplier, has partnered with Indian conglomerate Vedanta to make semiconductors in the in India amid a global chip shortage.

from NDTV Gadgets - Latest https://ift.tt/LCpB7ma

Mahesh Babu : మ‌హేష్ కోసం జ‌క్క‌న్న మైండ్ బోయింగ్ ప్లాన్‌..!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 28వ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత మూవీని పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ప్ర‌ముఖ నిర్మాత దుర్గారావు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. మ‌హేష్ సినిమా అంటే ఎక్స్‌పెక్టెష‌న్స్ ఓ రేంజ్‌లో ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక మ‌హేష్‌కి తోడుగా రాజ‌మౌళి యాడ్ అయితే ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటాయి. డౌటే లేదు. మ‌రో వైపు ఇప్పుడు ఇది పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొంది,పాన్ వ‌రల్డ్ రేంజ్‌లో విడుద‌ల‌వుతుంది. మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ కోసం ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. అదేంటంటే.. ఈ సినిమాను రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. క‌థ‌లో చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర ఒక‌టి ఉంటుంది. న‌ల‌బై నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాలో క‌నిపిస్తుంద‌ట‌. అలాంటి పాత్ర‌ను ఓ బ‌డా హీరోతో చేయించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారు. రాజ‌మౌళి త‌లుచుకుంటే బాలీవుడ్ హీరోలు సైతం ఆయ‌న సినిమాలో న‌టించ‌డానికి రెడీ అంటారు. మ‌రి రాజ‌మౌళి ఈ కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ హీరోను తీసుకుంటాడా? లేక టాలీవుడ్‌లో అగ్ర హీరోకే అగ్ర పీఠం ఇస్తాడా? అని చూడాలి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రో వైపు మ‌హేష్ సినిమా కోసం క‌థ‌, క‌థ‌నం సిద్ధం చేస్తున్నారు. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే స‌ర్కారు వారి పాట చిత్రాన్ని పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే, ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త్రివిక్ర‌మ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోతాడు. రాజ‌మౌళి సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఈ సినిమాను పూర్తి చేయాల‌నేది మ‌హేష్ టార్గెట్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/pgY932P

Asus ROG Phone 5s, ROG Phone 5s Pro to Launch in India Today: Details

Asus ROG Phone 5s and ROG Phone 5s Pro India launch will be held today (Tuesday, February 15).

from NDTV Gadgets - Latest https://ift.tt/kITRgvh

Sunday, 13 February 2022

San Francisco 49ers Hit by Ransomware Attack

The San Francisco 49ers have been hit by a ransomware attack, with cybercriminals claiming they stole some of the football team's financial data.

from NDTV Gadgets - Latest https://ift.tt/zVKJykT

Jio Forays Into Satellite Broadband Market in Partnership With SES

Jio announced a joint venture with Luxembourg-based SES to provide satellite-based broadband services in India, a joint statement said.

from NDTV Gadgets - Latest https://ift.tt/8OqI70l

F3 విడుదల తేదీ: ఫన్ పిక్నిక్‌కి డేట్ ఫిక్స్

F2 సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ''పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్‌కి డేట్ ఫిక్స్ చేశాం'' అంటూ F3 మూవీ విడుదల తేదీ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. గతంలో , హీరోలుగా F2 సినిమా రూపొందించి సూపర్ ఫన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పుడు కూడా F3 మూవీ రూపంలో అదే రిపీట్ చేయబోతున్నారు. గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లను రంగంలోకి దించుతున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ భారీ హైప్ తెచ్చిపెట్టాయి. ఇకపోతే ఈ ఫన్ రైడ్‌లో కమెడియన్స్ రాజేంద్ర ప్రసాద్, సునీల్‌లు కూడా భాగమవుతున్నారు. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమాకు ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా F3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. థియేటర్‌లో మరోసారి ఫ్యామిలీతో కలిసి నవ్వుల రైడ్ ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులు కుతూహలంగా ఉన్నారు. అదే పాయింట్ లెక్కలోకి తీసుకొని అనిల్.. ఇలా సమ్మర్‌లో కితకితలు పెట్టేందుకు రెడీ అయ్యారేమో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/pnBdokx

Digital Rupee: What the Introduction of CBDC Entails for India

CBDC, or the Central Bank Digital Currency, has emerged as quite the buzzword in India. Earlier this month, Minister of Finance Nirmala Sitharaman announced that India will soon get its CBDC or...

from NDTV Gadgets - Latest https://ift.tt/XAzpNIE

China: 'Next 5 years will be tougher for India'

'We can expect heightened belligerence from China.'

from rediff Top Interviews https://ift.tt/1igDhUB

ఈ జన్మకు వద్దనుకున్నా.. అందుకే సీఎం జగన్‌కి ప్రచారం చేశా: మోహన్ బాబు

చాలా కాలం తర్వాత నటించిన కొత్త సినిమా ''. దేశ భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు, రాజకీయాల గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ రావాలనే ఆసక్తి లేదని మోహన్ బాబు చెప్పారు. ఈ జన్మకు రాజకీయాలు వద్దనుకుంటున్నానని అన్నారు. ''ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గార్లు నాకు బంధువులు కాబట్టి వారి తరఫున నా బాధ్యతగా గతంలో ఎన్నికల్లో ప్రచారం చేశాను. ఇప్పుడు నేను సినిమాలు, శ్రీ విద్యానికేతన్‌ యూనివర్సిటీ పనులతో చాలా బిజీగా ఉన్నాను. ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు బంధువులు, స్నేహితులున్నారు. ఏపీ మంత్రి పేర్ని నానీతో పదేళ్లకుపైగా అనుబంధం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణగారి అబ్బాయి పెళ్లిలో నాని, నేను కలిశాం. బ్రేక్‌ఫాస్ట్‌కి తనని ఇంటికి ఆహ్వానించాను.. వచ్చారు. ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నామే తప్ప మా మధ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై కానీ, సీఎం జగన్‌గారితో జరిగిన భేటీపై కానీ ఎలాంటి చర్చ జరగలేదు'' అని చెప్పారు మోహన్ బాబు. ఇకపోతే 'సన్‌ ఆఫ్‌ ఇండియా' చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించాయి. చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వహించగా మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/odqawmD

Junaid Khan On Aamir, Khushi And More...

'He has always let us do our own thing but if we ever need anything, he is there with the best advice.' from rediff Top Interviews...