మాస్ మహరాజా స్పీడు మీదున్నారు. ఓ వైపు సినిమాలను పూర్తి చేస్తున్నారు. మరో వైపు కొత్త ప్రాజెక్ట్స్‌ను ఓకే చేస్తూ వాటిని సెట్స్ పై కి తీసుకెళుతున్నారు. గత ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాను పూర్తి చేశారు. ఒకవైపు ఆయన హీరోగా చేస్తున్న రామారావు సినిమా సెట్స్‌పై ఉంది. ఆ సినిమాను పూర్తి చేయకముందే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. చక చకా షూటింగ్‌ను పూర్తి చేసేస్తున్నారు. స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మతో రవితేజ మాస్ కమర్షియల్ మూవీ రావణాసురను ఈ సంక్రాంతికి స్టార్ట్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న కథ, మాటలు అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాతో రవితేజ నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాలో దక్షా నగార్కర్‌ను విలన్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారట. అలాగే రవితేజ ఇప్పటి వరకు చేయనటువంటి లాయర్ పాత్రలో కనిపించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. రవితేజ జోరు ఇలా సాగుతుంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రవితేజ, తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. అంతే కాదండోయ్.. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారట. అంటే ఇది వరకు ప్రకటించిన రవితేజ సినిమాల్లోనే నటిస్తారా? లేక కొత్త సినిమా చేస్తున్నారా? అనే దానిపై క్లారిటీ రాలేదు. విష్ణు విశాల్ .. రానాతో కలిసి అరణ్య సినిమా తెలుగు, తమిళ వెర్షన్స్‌లో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో విజయవంతమైన రాక్షసుడు మాతృక.. తమిళ వెర్షన్ రాక్షసున్‌లో హీరోగా నటించారు విష్ణు విశాల్. మరి రవితేజ, విష్ణు విశాల్ కాంబినేషన్‌పై త్వరలోనే క్లారిటీ రానుందా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zCXOor
No comments:
Post a Comment