కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా భయంతో వణికిస్తోంది. ఇక సినీ రంగం విషయానికి వస్తే అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్ కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్, లక్ష్మీ మంచు, విష్వక్ సేన్, మంచు మనోజ్, తమన్ ఇలా అందరూ కోవిడ్ పాజిటివ్ కారణంగా ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో మరో ఇద్దరు సినీ సెలబ్రిటీలు చేరారు. ఒకరేమో సీనియర్ నటుడు సత్యరాజ్, మరొకరు హీరోయిన్ త్రిష. సత్యరాజ్‌కు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్స్ రాగానే ఆయన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇక కరోనా బారిన పడగానే విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ బారిన పడ్డానని, బయపడాల్సిందేమీ లేదని, త్వరగానే కోలుకుంటున్నానని త్రిష తెలిపారు. కోవిడ్ కారణంగా తమిళనాడులో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు మరింత కఠినం చేశారు. థియేటర్స్, షాపింగ్ మాల్స్‌ను మూసి వేశారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ మరోసారి వాయిదా పడ్డాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zC4sve
No comments:
Post a Comment