దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత సినీ పరిశ్రమకు ఎవరు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది. మొన్నటి వరకు వరకు కొందరు సినీ పెద్దలు సినీ పెద్ద అని, ఆయన పెద్దగా వ్యవహరిస్తే బావుంటుందని అన్నారు. కానీ, చిరంజీవి తాను పెద్దగా వ్యవహరించనని.. ఇండస్ట్రీకి సమస్య అంటూ వస్తే బిడ్డగా బాధ్యత తీసుకుంటానే తప్ప, పంచాయతీలు చేసే పెద్దరికం తనకు వద్దని అన్నారు. మరో వైపు మోహన్‌బాబు డైరెక్ట్‌గా చెప్పలేదు కానీ.. సినీ పరిశ్రమ తరపున సీఎం జగన్‌కు పరిశ్రమలోని ఇబ్బందులను తెలియజేస్తూ లేఖ రాస్తానని, కుదిరితే వెళ్లి కలుస్తామని అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లు సినీ పరిశ్రమ అంటే నలుగురు హీరోలు కాదని, అందరినీ కలుపుకుని వెళ్లి సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన చెబుతూ ఓ సుదీర్ఘమైన లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోని పెద్దరికం గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆమె తనదైన శైళిలో మెగాస్టార్ చిరంజీవిపై విరుచుకుపడ్డారు. ‘‘మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ఫ్లైట్స్ వేసుకుని వీళ్లు బయలుదేరిపోతారు. ప్రొడ్యూసర్‌కి వచ్చిన సమస్యలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వచ్చిన సమస్యలు కావచ్చు. థియేటర్ ఓనర్ సమస్యలు కావచ్చు. వీళ్లకేం తెలుసు. ఇద్దరు ముగ్గురు హీరోలకు ఏం తెలుసు? ఎందుకు ఊపుకుంటూ పోతారు? చిన్న సినిమాను బతికించండి అని దాసరి నారాయణరావుగారు ఇప్పుడు ఎవరైతే నలుగురు పెద్ద నిర్మాతలమని చెప్పుకుంటున్నారో వారు, స్టేజ్‌లపై పిచ్చి వాఖ్యలు చేస్తున్నారో, ఏపీ ప్రభుత్వాన్ని ఎవరైతే చీప్ చేస్తున్నారో, మీరెవరూ పెద్ద మనుషులు కారు. ఎవరూ ఆర్చనక్కర్లేదు.. తీర్చనక్కర్లేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్‌గా నేను చెప్పేదేంటంటే, నిర్మాతలకు ఏ సమస్యలున్నా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు రండి. సమస్యను చెబితే అక్కడున్న వారు అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని ప్రసన్నకుమార్‌గారు చాలా మంచి వ్యక్తి. ఆయన నిర్మాతల సమస్యలను సాల్వ్ చేస్తారు. ఎవరైనా హీరోలు ప్రొడ్యూసర్స్ తరపున మాట్లాడాలంటే ప్రసన్నకుమార్‌గారి దగ్గర మాట్లాడండి. లేని పోని పెద్దరికాలు పుచ్చుకుని మీరు అసలు ఎక్కడికీ వెళ్లొద్దు. వెళ్లాలనుకుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని వారిని కలుపుకుని పోండి. ప్రొడ్యూసర్ సమస్యలు, థియేటర్స్ సమస్యలు మాట్లాడాలంటే హీరోలు ఊపుకుంటే వెళ్లిపోకండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో సంప్రదిస్తే వాళ్లు మాట్లాడుతారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారినే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. గిల్డ్ కానీ, మరోటి కానీ పట్టించుకోవద్దు. పెద్దరికం చేయాలంటే మోహన్‌బాబుగారు, బాలకృష్ణగారికి సూట్ అవుతుంది కానీ.. మిగతా ఎవరికీ సూట్ కావు. మోహన్‌బాబుగారు చెప్పిన మాటలకు నేను ఏకీభవిస్తాను. చిన్న సినిమా నిర్మాతలు థియేటర్స్ దొరక్క చితికిపోయున్నారు. థియేటర్స్ విషయంలో సమస్యలుంటే అది చిన్న నిర్మాతలకే ఉన్నాయి. మోహన్‌బాబుగారు చెప్పింది 100 శాతం న్యాయం’’ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ERbAVy
No comments:
Post a Comment