సింగర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తన సుస్వర గానంతో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన సునీత కేవలం పాటలకు మాత్రమే కాదండోయ్. ప్రకృతికి పెద్ద ప్రేమికురాలు. నేను సంగీతాన్ని ప్రేమిస్తాను. అలాగే నా కుటుంబాన్ని, నా స్నేహితులను కూడా ప్రేమిస్తాను అంటూ ఆమె చెప్పింది. ఎక్కడ చెప్పిందోనని అనుకుంటున్నారా? తన ఇన్‌స్టాగ్రామ్‌లో. సింగర్ సునీత..మైక్‌ను పదిలేసి వ్యవసాయం చేయడం మొదలు పెట్టేశారు. అంటే ఇక పాటలు పాడరని కాదండి.. ఆమె పాటలు పాడతారు. దాంతో పాటు తాను వ్యవసాయం చేయడాన్ని ఎంతో ఇష్టపడుతున్నానని చెప్పేశారు సునీత. సునీత రీసెంట్‌గా తన అరటి తోటలో.. కూరగాయల తోటలో పనిచేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో పాటు జాయ్ ఆఫ్ ఫార్మింగ్ (వ్యవసాయాన్ని ఇష్టపడుతున్నాను) అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో పాటు నాకు సంగీతం అంటే ఇష్టం. అలాగే నా కుటుంబం, స్నేహితులు, నన్ను ఇష్టపడే వారిని ప్రేమిస్తాను అని వీడియోతో పాటు మన మనసులోని భావాలను వాక్యాల రూపంలో రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వ్యాపారవేత్త రామ్ సూరపనేనిని ఇటీవల ఈమె పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఆమె ఓ సందర్భంలో దివంగత ప్రముఖ గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని బాధపడ్డారు. బాలుగారి మరణం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు సునీత. ఇక భర్త రామ్, తాను ఒకే రంగంలో ఉండటం బాగా ఉందని, ఆయన కోరితో సాయం చేయడానికి తాను సిద్ధమని.. ప్రొఫెషనల్ జీవితం కంటే పర్సనల్ జీవితానికే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారు సునీత.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pQrwmR
No comments:
Post a Comment