యంగ్ టైగర్ తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని చేయడానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను హీరోయిక్‌గా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోతగా ప్రెజంట్ చేయడంలో కొరటాల శివ స్పెషలిస్ట్. ఆయనతో ఇది వరకే జనతా గ్యారేజ్ మూవీ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు ఎన్టీఆర్.. ఇప్పుడు మరో మూవీ చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం కొరటాల శివ..ఎన్టీఆర్‌తో చేయబోయే స్క్రిప్ట్‌ను మలచడంలో తల మునకలై ఉన్నారు. హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి? సాంకేతిక నిపుణులు ఎవరు? వంటి పనులు కూడా ఓ వైపు ఫైనలైజ్ చేసే పనుల్లో టీమ్ బిజీగా ఉంది. లేటెస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. హీరో బాబాయ్ పాత్ర. ఆ పాత్రకు ఎవరిని తీసుకుంటే బావుంటుందని మేకర్స్ తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ పాత్రలో సీనియర్ హీరో డాక్టర్ రాజ శేఖర్‌ను నటింప చేసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయట. మంచి క్యారెక్టర్స్ ఉంటే సపోర్టింగ్ పాత్రల్లో అయినా, విలన్‌గా అయిన నటించడానికి సిద్ధమని రాజ శేఖర్ ఎప్పుడో అన్నారు. మరి ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి రాజ శేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఉంటే ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అనే అంశాలు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. కొరటాల శివ సినిమాలను గమనిస్తే హీరో సపోర్టింగ్ రోల్‌లో ఓ బలమైన పాత్ర మనకు కనిపిస్తుంది. మర్చిలో సత్యరాజ్.. శ్రీమంతుడులో జగపతిబాబు.. జనతా గ్యారేజ్‌లో మోహన్‌లాల్.. ఆచార్యలో రామ్ చరణ్ .. ఇలా ఇప్పుడు అలాంటి ఓ పవర్ ఫుల్ రోల్‌ను రాజ శేఖర్ కనిపించనున్నారని టాక్. మరి రాజ శేఖర్ కొత్త మలుపును ఇలా తీసుకుంటారేమో చూడాలి. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. ఫిబ్రవరి 4న సినిమా రిలీజ్ అన్నారు. కానీ.. సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Fr8Dvr
No comments:
Post a Comment