మన టాలీవుడ్ హీరోలు తమ పంథాను మార్చుకుంటున్నారు. సినిమాలు చేయడంలోనే కాదండోయ్. సినిమాలకే పరిమితమై పోవాలనే ఆలోచనకు ఇప్పుడు దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు హీరోలు సినిమాలతోనే బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు వస్తున్న హీరోలు కేవలం సినిమాలకే ఆగిపోవడం లేదు. ఇతర వ్యాపారాల్లోనూ వారు పెట్టుబడులు పెడుతున్నారు. వ్యాపార పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, విష్ణు మంచు, నాగార్జున ఇలా అందరూ ఈ లిస్టులోనే వస్తారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో హీరో కూడా చేరారు. ఆయనే మన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఇంతకీ విక్టరీ వెంటకేష్ ఏం చేస్తున్నారనేగా! అసలు విషయంలోకి వెళితే వెంకటేష్ సినిమాలకే పరిమితం కాకుండా కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. సినిమా, స్టూడియో వ్యవహారాలు అని కాకుండా, వెంటకేష్ అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బైక్ వో అనే సంస్థతో చేతులు కలిపారు. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుందో తెలుసా? ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలకు చార్జింగ్, సర్వీసింగ్ చేయడం వంటి సేవలను అందిస్తుంది. ఇప్పుడు ఈ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వెంకటేష్ చేతులు కలిపారు. అది అసలు విషయం. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఓటీటీలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ త్వరలోనే F3 మూవీతో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను మరింత వెనక్కి వెళుతుందని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Fe5cYK
No comments:
Post a Comment