స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ ''. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో రూపొందించిన ఈ చిత్రంలో సరసన హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'పుష్ప' చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన రివ్యూ పోస్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అని పొగిడిన మహేష్ బాబు.. ఇది ఒరిజినల్, సెన్సేషనల్ అని కామెంట్ చేశారు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయనేది సుకుమార్ మరోసారి నిరూపించారని అన్నారు. ఇకపోతే 'నీ గురించి ఏం చెప్పాలి? దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్ స్టార్ అంతే. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. బాయ్స్.. చాలా గర్వంగా ఉంది' అని మహేష్ తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా రష్మిక మందన పేరు కూడా తీయకపోవడం, ఆమె నటన గురించి మహేష్ స్పందించకపోవడంపై జనం కన్నుపడింది. రీసెంట్ గానే మహేష్ బాబుతో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించింది రష్మిక. అలాంటిది ఇప్పుడు ఆమె పేరును మహేష్ విస్మరించడాన్ని ఎత్తి చూపుతున్నారు జనం. ఇది నిజంగా రష్మికకు మింగుడు పడదేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారీ రేంజ్‌లో రూపొందిన ఈ 'పుష్ప' మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 146 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా 12.03 కోట్ల రూపాయల లాభాలతో కొనసాగుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eP8iaO
No comments:
Post a Comment