గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీ Vs ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా నడుస్తున్న సినిమా టికెట్ల ఇష్యూలోకి రావడంతో సీన్ మారిపోయింది. సినిమా టికెట్ ధరలపై మాట్లాడటం పక్కనబెట్టి స్టార్ హీరోల రెమ్మ్యూనరేషన్స్ తగ్గించుకోండి అని కొందరు వైసీపీ లీడర్స్ చేసిన కామెంట్స్‌తో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఈ ఇష్యూపై తనదైన కోణంలో లాజిక్స్ మాట్లాడుతూ పలు టీవీ ఛానల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నారు వర్మ. మరోవైపు జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ సోషల్ మీడియాలోనూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా టికెట్ ధరను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న ఆర్జీవీ.. ఇది తయారీదారుడు- వినియోగదారుడు మధ్య ఉన్న సంబంధం అని అంటున్నారు. ఈ ఇష్యూలో ప్రభుత్వ జోక్యం అనవసరం అంటూ విరుచుకుపడుతున్నారు. బియ్యం, పంచదార మొదలైన వాటిని పేదలకు అందించడానికి రేషన్ షాపులు స్టార్ట్ చేశారు కదా.. మరి అదే ప్రజల కోసం రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అంటూ జగన్ గవర్నమెంట్‌ని అడుగుతూనే ఇకనైనా సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖులు ఈ ఇష్యూపై స్పందించాలని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడూ నోళ్లు తెరవలేరు.. తర్వాత మీ ఖర్మ అంటూ ఇండస్ట్రీకి మొట్టికాయలంటించారు వర్మ. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో ద్వారా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో సెన్సేషన్ అవుతున్నాయి. బ్రాండ్‌కి, ఏపీ సీఎం వైఎస్ జగన్ కుర్చీకి ముడిపెడుతూ ఓపెన్ కామెంట్స్ చేశారు వర్మ. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే వైఎస్ జగన్‌కి అన్ని ఓట్లు వచ్చేవా? అంటూ ఏకంగా సీఎంనే టార్గెట్ చేశారు ఆర్జీవీ. అంతటితో ఆగక.. జగన్ బ్రాండ్ అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఎలా వచ్చిందో పవన్ బ్రాండ్ కూడా అలాగే వచ్చింది. మహేష్ బ్రాండ్ కూడా అలాగే వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆలోచించే జనాలు జగన్‌ని లీడర్ చేశారు. అది వైఎస్ఆర్ బ్రాండ్ అంతే. ప్రతిదీ కూడా బ్రాండ్ తోనే ముడిపడి ఉంటుందంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FS5Gou
No comments:
Post a Comment