Saturday, 1 January 2022

చంపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. క‌రాటే క‌ళ్యాణి ఫిర్యాదు

సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న క‌రాటే క‌ళ్యాణి ఇప్పుడు న‌ట‌న‌తో పాటు రాజ‌కీయాల్లోనూ బిజీ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అదేమి విచిత్ర‌మో కానీ.. క‌రాటే క‌ళ్యాణి వివాదాల్లో ఉంటుంటారు. చూసే వారికి ఆమె వివాదాల‌ను వెతుక్కుంటారా? లేక వివాదాలే ఆమెను వెతుక్కుంటూ వ‌స్తాయా? అని తెలియ‌డం లేదు. తాజాగా ఇప్పుడామె స్వ‌చ్చంద సేవ చేస్తున్న ఓ ట్ర‌స్ట్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనికి సంబంధించి క‌రాటే క‌ళ్యాణి రీసెంట్‌గా ప్రెస్ మీట్ కూడా పెట్టారు శివ శ‌క్తి పేరుతో నిర్వ‌హ‌ణ చేస్తూ కొంద‌రు హిందువుల నుంచి తప్పుడు ప్ర‌చారాలు చేస్తూ నిధులు సేక‌రిస్తున్నార‌ని, కోటి రూపాయ‌ల మేర‌కు శివ శ‌క్తి ట్ర‌స్ట్ నిధులను ప‌క్క దారి ప‌ట్టించింద‌ని క‌రాటే క‌ళ్యాణి అన్నారు. అదే సంద‌ర్భంలో, స‌ద‌రు ట్ర‌స్ట్‌కు చెందిన‌వారు త‌న‌ను బెదిరిస్తున్నార‌ని కూడా ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు క‌రాటే క‌ళ్యాణి త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ బంజారా హిల్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. స్వ‌చ్చంద సేవా సంస్థ నిర్వాహ‌కులు చేస్తున్న త‌ప్పుడు ప‌నుల‌ను తాను బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, దాన్ని మ‌నసులో పెట్టుకుని క‌క్ష క‌ట్టి త‌న‌న‌ను చంపాల‌ని చూస్తున్నారంటూ బంజారా హిల్స్ పోలీసుల‌కు కరాటే క‌ళ్యాణి ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల ముందు ఓ మైన‌ర్ బాలిక హత్య కేసుకి సంబంధించిన వివ‌రాల‌ను క‌రాటే క‌ళ్యాణి బ‌య‌ట‌పెడుతుందంటూ ఆమెపై రంగారెడ్డి కోర్టులో ప్రైవేటుగా కేసు న‌మోదైతే, కోర్టు ఆర్డ‌ర్ ద్వారా జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. అయితే తాను ఎలాంటి వివ‌రాల‌ను వెల్ల‌డి చేయ‌లేద‌ని, మైన‌ర్ బాలిక హ‌త్య జ‌రిగిన‌ప్పుడు తాను స‌ద‌రు అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు స‌పోర్ట్ చేశాన‌ని క‌ళ్యాణి ప్రెస్ మీట్‌లో అన్నారు. న‌టిగా సుప‌రిచితురాలైన క‌రాటే క‌ళ్యాణి, బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గానూ ఆక‌ట్టుకున్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌గా కొన‌సాగుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pLT5xw

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...