మాస్ మహరాజా రవితేజ ఏకధాటిగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. మరో వైపు కొత్త సినిమాలను స్టార్ట్ చేసేస్తున్నారు. గత ఏడాది క్రాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ, ఖిలాడితో సందడి చేయాలని భావిస్తే.. కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డుపడింది. ఈ ఏడాదిలో ఖిలాడి విడుదల ఉంటుందని మేకర్స్ అంటున్నారు. మరో వైపు రవితేజ రెండు సినిమాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ, మరో చిత్రం ధమాకా. రామారావు ఆన్ డ్యూటీ సినిమా విషయానికి వస్తే.. ఇందులో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్. రజీషా విజయన్, వేణు తొట్టెంపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో సీసా.. అనే స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఇందులో శృంగార తారగా పేరు పొందిన నర్తించిందని సమాచారం. హిందీలో అడల్డ్ సిరీస్‌గా పేరున్న ‘గంధీ బాత్’లో అన్వేషి జైన్ నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్స్, ఇంకేవరినో నటింప చేయడం కంటే అన్వేషి జైన్ అయితే పాటకు మరింత క్రేజ్ వస్తుందని చిత్ర యూనిట్ భావించడంతో, ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించారు. ఇందులో కూడా నటించారు. స్ట్రిట్ ప్రభుత్వ అధికారి రామారావు అనే టైటిల్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 25న రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు క్రేజ్ బాగా పెరుగుతుంది. సమంత, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్‌లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ క్రేజ్‌ను పెంచుకోవడానికి మేకర్స్ అన్వేషి జైన్‌తో ప్రత్యేక గీతాన్ని చేయించారు. ఇక రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా సంక్రాంతికి సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తొలిసారి రవితేజ నిర్మాతగానూ మారుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zUCMlr
No comments:
Post a Comment