ఐకాన్ స్టార్ వైవిధ్యమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. గత ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ మూవీ ఆఫ్ ఇండియాగా పుష్ప ది రైజ్ చిత్రంతో బాలీవుడ్ చిత్రాలను దాటేసి తన సత్తా చాటారు. ఇలా హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతున్న స్టైలిష్ స్టార్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. సినిమాలతో పాటు పలు యాడ్స్‌లో నటిస్తున్నారు. ఇది కాకుండా ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ థియేటర్స్ ను రూపొందించే పనిలో ఉన్నారు. ఇంత బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే బట్టల వ్యాపారం. అల్లు అర్జున్ అనే పేరుని ఇంగ్లీష్‌లో AAగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన బన్నీ ఇప్పుడు దాన్ని ఓ బ్రాండ్‌గా మార్చేశారు. అదే పేరుతో టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోకి బన్నీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రీసెంట్‌గా రౌడీబాయ్స్ ఈవెంట్లోనూ తన బ్రాండ్‌ను అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ ఎప్పుడో మార్కెట్‌లోకి రావాల్సింది. కానీ.. కరోనా కారణంగా ఆలస్యమవుతుంది. సూపర్ స్టార్ మహేష్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్.. మల్టీప్లెక్స్ థియేట్స్ బిజినెస్‌లోకి చాలా రోజుల ముందే అడుగు పెట్టారు. అలాగే వారివురు టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ హంబుల్ అనే బట్టల బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తుంటే, విజయ్ దేవరకొండ రౌడీ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడదే స్టైల్లో అల్లు అర్జున్ కూడా AA బ్రాండ్ స్టార్ట్ చేయనున్నారు. పుష్ప ది రైజ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్.. తదుపరి పుష్ప ది రూల్ చిత్రాన్ని ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పుష్ప ది రైజ్ చిత్రానికి కొనసాగింపుగా రానున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలనేది అల్లు అర్జున్, సుకుమార్‌ల ఐడియాగా కనిపిస్తోంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపిస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమాలో నటిస్తారనే దానిపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు బన్నీ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తారట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FlkSJJ
No comments:
Post a Comment