Sunday, 1 August 2021

SVP First Notice రికార్డులు.. మోతమోగిన ట్విట్టర్.. దటీజ్ మహేష్!

సూపర్ స్టార్ హీరోగా రాబోతోన్న ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న సాయంత్రం వదిలిన ఫస్ట్ లుక్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు వదిలిన ఫస్ట్ నోటీస్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. మొత్తానికి సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ ట్విట్టర్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. మహేష్ ఫ్యాన్స్ దెబ్బకు ట్విట్టర్‌కు బాగానే వాచిపోయినట్టుంది. మహేష్ అభిమానులు వేసిన ట్వీట్లు, చేసిన రీ ట్వీట్లు, కొట్టిన లైకులతో దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి. అసలే మహేష్ బాబుకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగు హీరోల్లో అత్యధిక మంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న వారిలో మహేష్ బాబు ముందుంటారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో మహేష్ ఫ్యాన్స్ దూకుడు మామూలుగా ఉండదు. అలా సూపర్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. 24 గంటల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 24 గంటల్లో ట్విట్టర్‌లో తెలుగు చిత్ర సీమ నుంచి అత్యధిక లైకులు, రీట్వీట్లు సాధించిన ఫస్ట్ లుక్‌గా సర్కారు వారి పాట రికార్డులను క్రియేట్ చేసింది. 95.6k లైకులు, 49.1k రీట్వీట్లతో సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పరుశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xc17QV

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...