Sunday, 1 August 2021

‘రక్కమత్త’గా జాక్విలిన్.. ఈసారి గ్లామర్ డోస్ దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా

ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. సరైన గుర్తింపు లేకుండా బాలీవుడ్‌లో కొనసాగుతున్న నటి . స్టార్ హీరోలతో కలిసి నటించి ఈ భామకు ఇప్పటివరకూ సరైన పాపులారిటీ లభించలేదు. ఎంత అందం ఆరబోసినా.. సరైనన్ని ఛాన్స్‌లు రావడం లేదు. ఇక సోషల్‌మీడియాలో కూడా హాట్ ఫోటోలతో ఈ భామ చేసే హంగామా మాములుగా ఉండదు. తరచూ హాట్ ఫోటోలతో కుర్రకారులో హీటు పుట్టిస్తుంది. అయితే తాజాగా ఈ భామ ఓ భారీ అవకాశాన్ని కొట్టేసింది. కన్నడ స్టార్ హీరో కిచ్చ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘’. యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో ఈ సినిమా 3డీలో రూపొందుతోంది. అనూప్ బండారి దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాని జాక్ మంజునాథ్- శాలిని మంజునాత్ నిర్మిస్తున్నారు. నీతా అశోక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నిరూప్ బండారి, రవిశంకర్ గౌడ, వాసుకి వైభవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ జాక్విలిన్ కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ఆమె ‘రక్కమత్త’గా కనిపించనున్నారు. ఇందకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో జాక్విలిన్ అందాల ఆరబోత మామూలుగా లేదు. తన నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఆమె ఫిదా చేస్తోంది. ‘రక్కమ్మకు ఏది తెలియదో.. అసలు అది జగతిలో ఉండదు’ అంటూ సుదీప్ ఈ ఫస్ట్‌లుక్‌ని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతోనే ఈ రక్కమ్మత్త పాత్రను రచించారని సూచాయిగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా 55 దేశాల్లో 14 భాషల్లో విడుదల అవుతుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TKM8j0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....