Sunday, 1 August 2021

RRR Dosti రికార్డులు.. కీరవాణి మ్యాజిక్.. కచ్చితంగా విజువల్ ట్రీట్!

Dosti పాట ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. అంటూ వచ్చిన ఈ పాటలోనే సినిమాలోని కథను చెప్పీ చెప్పనట్టుగా చెప్పేశారు. ఈ ఇద్దరూ కలిసి పోరాడుతారా? లేదా? ఒకరిపై ఒకరు పోరాటం చేస్తారా? చివరకు ఏం చేస్తారు అంటూ ఇలా రకరకాలుగా సందేహాలు వచ్చేట్టుగా పాటను రాయించుకున్నారు. అలా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటకు, కీరవాణి ఇచ్చిన బాణీ, హేమచంద్ర వాయిస్ అదిరిపోయింది. కచ్చితంగా అది విజువల్ ట్రీట్ అవుతుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దోస్తీ అంటూ తెలుగు హిందీలో, నట్పా, ప్రియం అంటూ ఇతర భాషల్లో విడుదలైన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది. ఉదయం విడుదలైన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికే ఈ పాటను దాదాపు పది మిలియన్ల మంది వినేశారు. ఇంకా వింటూనే ఉన్నారు. కీరవాణి ఇచ్చిన సంగీతాన్ని వింటూ మైమరిచిపోతోన్నారు. ఇక , అనూహ్యమైన, అద్భుతైన ఎంట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. ఇలా ప్రమోషనల్ సాంగ్‌లోనే ఉంటే.. తెరపై ఇంకెలా ఉంటుందా? అని ఇప్పటి నుంచి అభిమానులు ఊహించుకుంటున్నారు. తమిళం,తెలుగు ఇలా అన్ని భాషల్లో ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక 24 గంటల్లో ఈ పాట సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది. వ్యూస్, లైక్స్ విషయంలో దోస్తీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jgIc2u

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....