Sunday 1 August 2021

ఇది ఫ్రెండ్‌షిప్‌ డే కాదు.. ‘ఎనిమీ డే’.. ఎందుకో తన స్టైల్‌లో కారణం చెప్పిన ఆర్‌జీవీ

రామ్ గోపాల్ వర్మ.. పూర్తి స్వేచ్ఛాను అనుభవిస్తూ.. తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపే వ్యక్తి. ఇతరలు ఏమనుకుంటారనే భయం ఏమాత్రం లేకుండా తనకు తోచిన పనిని తనదైన స్టైల్‌లో చేసుకుంటూ పోతాడు వర్మ. ఇక వర్మ సోషల్‌మీడియాలో చేసే పోస్ట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షడి నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ వర్మ ట్వీట్లలో ఎవరికీ మినహాయింపు ఉండదు. ప్రతీ ఒక్కరిపై సెటైర్లు వేస్తాడు.. వివాదాల్లో చిక్కుకుంటాడు. మళ్లీ తాను చేసిన ట్వీట్‌కి భిన్నంగా మరో ట్వీట్ చేసి.. ఫాలోవర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇది రామ్ గోపాల్ వర్మకు నిత్యకృత్యంగా మారింది. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో ఎప్పుడు ముందుంటాడు. ప్రతీ సందర్భాన్ని ఆయనకు అనుకూలంగా ఉండేలా మార్చుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తుంటాడు వర్మ. నేడు (ఆగస్టు 1న) ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్‌షిప్‌ డే జరుగుతోంది. ప్రతీ ఒక్కరు తమ మిత్రులను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మిత్రులు ఉండటం అంటే తమకు ఎంత ముఖ్యమో.. తనకు ఎంత మేలు జరిగిందో చెప్పుకుంటూ వాళ్లు పోస్టులల్లో పేర్కొంటున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ఇది ఫ్రెండ్‌షిప్‌ డే కాదు.. ఎనిమి డే అంటూ వర్మ పేర్కొన్నారు. అందుకు ప్రధానంగా ఆయన ‘స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుగుతాడు’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వర్మ మాటలపై కొందరు మండిపడుతుంటే.. కొందరు మాత్రం ఆయన స్టైల్ నచ్చి సమర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటి వర్మ తన స్టైల్ ఎప్పటికి మార్చుకోడు అనడంలో తాజాగా చేసిన ఈ ట్వీట్‌యే నిదర్శనం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3C3OZoF

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...