Sunday, 1 August 2021

నాడు సూపర్ మార్కెట్ నేడు ఎయిర్‌పోర్ట్.. ప్లేస్ ఎక్కడైనా కిస్ కామన్.. శ్రుతీ హాసన్ రచ్చ

శంతను హజారిక చేసే అల్లరికి సోషల్ మీడియా మొత్తం షాక్ అవుతుంటుంది. వీరిద్దరూ కలిసి చేసే కొంటె చేష్టలు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య వరుసగా శ్రుతీ హాసన్ శంతను హజారికలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆ మధ్య సూపర్ మార్కెట్‌లో ఈ ఇద్దరూ కలిసి చేసిన అల్లరి ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. సూపర్ మార్కెట్‌లోనే ప్రియుడుని ముద్దుల్లో ముంచెత్తారు. కాలు పైకెత్తి మరీ హగ్గులు, కిస్సులు పెట్టేశారు శ్రుతీ హాసన్. అయితే తాజాగా మరోసారి శ్రుతీ హాసన్ కెమెరా కంట పడ్డారు. శ్రుతీ హాసన్ తన ప్రియుడు శంతనుతో కలిసి చేసే అల్లరి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న పిచ్చి గంతులు వేసుకుంటూ సడెన్‌గా ప్రియుడి మీదకు దూకేశారు. శ్రుతీ హాసన్ నడుము మీద శంతను వేసిన ఆర్ట్ బాగానే వైరల్ అయింది. ఇక రెండ్రోజుల క్రితం తాను ధరించే సాక్సుల మీద తన ఫోటోనే ప్రింట్ చేసుకుని శ్రుతీ హాసన్ తనమీద తనుకున్న ఇష్టాన్ని ప్రకటించేశారు. అయితే తాజాగా శ్రుతీ హాసన్ ముంబైని వీడారు. షూటింగ్ కోసం హైద్రాబాద్‌ లేదా చెన్నైకి బయల్దేరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్‌లో ప్రియుడు శంతనుతో కలిసి కెమెరాలకు శ్రుతీ హాసన్ చిక్కారు. ఫోటోగ్రాఫర్‌లకు ఎదుట రకరకాలు పోజులు ఇచ్చారు. ఇక వీడ్కోలు సమయం రావడంతో ప్రియుడు శంతనును గట్టిగా హత్తుకున్నారు. వెళ్లే ముందు ఓ ముద్దు పెట్టేసి వీడ్కోలు చెప్పేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా శంతను మీద శ్రుతీ హాసన్ ప్రేమ కురిపించింది. ఓ అమ్మాయికి నీ కంటే మంచి ఫ్రెండ్ ఈ ప్రపంచంలో దొరకడు అని ప్రశంసలు కురిపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lnlKam

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....