Monday, 2 August 2021

ఇండస్ట్రీలో విషాదం.. దర్శకుడు, నటుడు గిరిధర్‌ ఇకలేరు

టాలీవుడ్‌లో దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న (64) తుది శ్వాస విడిచారు. గత ఆరు నెలల క్రితం ఒకసారి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు గిరిధర్. అప్పటి నుంచి దర్శకుడు మంచానికే పరిమితమయ్యారు. అయితే ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆదివారం తిరుపతిలోని తన సొంత నివాసంలో కన్నుమూశారు. పట్ల సినీ తారలు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. సీనియర్ దర్శుకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా గిరిధర్ పనిచేశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెకు చెందిన గిరిధర్.. 1982లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గిరిధర్‌.. గుడుంబా శంకర్, అన్నవరం, సుప్రీమ్, వరుడు, వంటి సినిమాలకు కో డైరెక్టర్ గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, వినోద్ కుమార్, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన శుభ ముహూర్తం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారి తొలి సక్సెస్‌ను అందుకున్నారు. ఇక యంగ్ హీరో, స్టార్ హీరోల సినిమాలైన ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. 100 పర్సెంట్ లవ్ సినిమాలో తమన్నా తండ్రిగా అందరికీ గుర్తిండిపోతారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yozTYA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....