
ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా నడుస్తోంది. తమన్ అందించే సంగీతం అంతా ఒకెత్తు అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌లో ఉంటోంది. తమన్ పని చేసే ప్రతీ సినిమా విషయంలో నేపథ్యసంగీతం హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే సినిమా స్థాయి కూడా పెరిగిపోతోంది. రవితేజ నటించిన క్రాక్ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే ఆ స్థాయి హిట్ కొట్టేసింది. తమన్ కొట్టిన బీట్‌కు అందరూ ఫిదా అయ్యారు. అది చూసి నాగార్జున తన వైల్డ్ డాగ్ సినిమాకు తమన్‌ను రిక్వెస్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అలా వైల్డ్ డాగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ప్రతీ ఒక్కరూ తమన్ పని తనాన్ని మెచ్చుకున్నారు. పాటలు అదరగొట్టేయడమే కాకుండా.. నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించారు. వకీల్ సాబ్ వీక్షించిన ప్రతీ ఒక్కరూ తమన్ గురించి మాట్లాడేట్టుగా చేసుకున్నారు. తాజాగా ఓ నెటిజిన్ వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో వీక్షించినట్టున్నారు. తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద స్పందించాడు. ఏం కొట్టావ్ అన్నా.. ఈ బీట్ కొట్టేటప్పుడు వీడ్ (మత్తు మందు) కానీ ఇంకేదైనా గానీ తీసుకున్నావా? ఏంటి.. నీ కెరీర్ మొత్తంలో ఇది హైలెట్.. ఓ రేంజ్‌లో ఉంది అంటూ పొగిడేశాడు. ఇక నెటిజన్ ప్రశంసలపై తమన్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు గారు అలా స్క్రీన్ మీద కనిపించడంతోనే అలా జరిగిందనేది అసలు నిజం. ఆయన అలా కనిపిస్తే చాలు ఇంకా వేరే డ్రగ్స్ అవసరం లేదు.. జస్ట్ హగ్స్ ఉంటే చాలు.. ఇంకొన్ని థగ్స్ ఉంటే చాలు.. మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది అని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tdbSjV
No comments:
Post a Comment