
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల జోరు కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఫలితాలను ముందే ఊహించినా కూడా అధికారికంగా రుజువు కావడంతో ఆయా పార్టీల కార్యకర్తలు, ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మళ్లీ తన సత్తాను చాటారు. బీజేపీపై విజయఢంకా మోగించారు. తమిళనాడులో స్టాలిన్ దుమ్ములేపారు. ఇక కేరళలో పినరయి ప్రభుత్వానికే ప్రజలు ఓట్లు వేశారు. అయితే దేశం మొత్తం ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల గురించే చర్చిస్తోంది. ఈ క్రమంలో అనుపమా పరమేశ్వరణ్ మనసు కూడా అటు వైపు మళ్లింది. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా వస్తున్నాయని తెలుసుకోవాలనే ఆత్రుత ఓ వైపు ఉన్నా కూడా ఆమె తన చిత్రలేఖనంతో బిజీగా ఉన్నారు. అలా రెండు పనులను ఒకేసారి చేయడం అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఓ వింత హావభావంతో ఓ ఫోటోను షేర్ చేశారు. మొత్తానికి అనుపమ వింత ఎక్స్‌ప్రెషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనుపమా ఇప్పుడు నిఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. 18 పేజీలు అనే చిత్రంతో అనుపమా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. అయితే ఈ మూవీయే కాకుండా అనుపమా చేతికి మరో ప్రాజెక్ట్ కూడా వచ్చింది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా రాబోతోన్న చిత్రంలోనూ అనుపమ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SfQayJ
No comments:
Post a Comment