Tuesday, 25 May 2021

అమ్మానాన్న బ్రేకప్‌పై శృతి హాసన్ రియాక్షన్.. ఆ టైంలో యంగ్ ఏజ్‌లో ఉన్నానంటూ ఓపెన్

కుమార్తె, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటుంది. సినిమాల్లో సూపర్ స్పీడ్‌తో కేరీర్ నడుస్తున్న వేళ ప్రేమలో పడి కొంతకాలం పాటు సినిమాలు పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో రొమాంటిక్ టూర్స్ వేసింది శృతి. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ సందర్భంలో తన తల్లిదండ్రుల బ్రేకప్ గురించిన విషయాలపై ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆ రోజుల్లో కమల్ హాసన్, నటి ప్రేమలో పడ్డటం హాట్ టాపిక్ అయింది. అయితే వాళ్లిద్దరూ 1980లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత ఈ దంపతులకు 1986 సంవత్సరంలో మొదటి సంతానంగా శృతిహాసన్‌, 1991 సంవత్సరంలో రెండో సంతానంగా అక్షర హాసన్‌ జన్మించారు. అయితే కొన్నేళ్ల పాటు వివాహ బంధం కొనసాగించిన ఈ జోడీ కొన్ని విభేదాల కారణంగా 2004లో విడిపోయారు. ఈ విషయమై రియాక్ట్ అయిన శృతి హాసన్.. తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాతే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పింది. వాళ్లు విడాకులు తీసుకున్నప్పుడు తాను యంగ్ ఏజ్‌లో ఉన్నానని, భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు కలసి బతకడం కంటే విడిపోవడమే కరెక్ట్ అనిపించిందని ఆమె పేర్కొంది. ఇప్పుడు నాన్నతో ఎంత అనుబంధం ఉందో.. అమ్మతో కూడా అంతే రిలేషన్ ఉందని చెప్పింది. ఇటీవలే 'వకీల్ సాబ్' సినిమాలో చిన్న రోల్ చేసిన శృతి హాసన్.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'సలార్'లో హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i0LkQG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....