Monday 3 August 2020

Murder: మర్డర్ సాంగ్.. అమృతను చెప్పుతో కొట్టడం తప్పా? ప్రణయ్‌ని ముప్పుగా వర్ణిస్తూ వర్మ సెన్సేషన్

వివాదాస్పద దర్శకుడు రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ . ఈ లాక్‌డౌన్ వేళ వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్న ఆయన.. అమృత, మారుతీ రావుల విషాద గాదపై కన్నేసి 'మర్డర్' పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం చర్చల్లో నిలిచిన ప్రణయ్ హత్యోదంతాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు వర్మ. తనదైన స్టైల్ ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'మర్డర్' సినిమా పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. తాజాగా ''...?'' అనే పాట విడుదల చేశారు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కూతురిని ప్రశ్నిస్తే తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? అంటూ ఆలోచన కలిగించే పదాలతో కూడిన ఈ సాంగ్‌‌లో ప్రణయ్‌ని ముప్పుగా వర్ణించారు వర్మ. దీంతో ఈ సాంగ్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. త్వరలో మర్డర్ నుంచి మరో ట్రైలర్‌ను, రెండో పాటను విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాతనే విడుదల చేస్తామని అన్నారు. Also Read: ఏకంగా 5 భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం)లో ఈ మూవీ విడుదల కానుండటం విశేషం. కాగా గతంలో 'మర్డర్' సినిమాపై ఘాటుగా రియాక్ట్ అవుతూ అమృత తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది. చూడాలి మరి విడుదలయ్యాక ఈ మూవీ మరెన్ని వివాదాలకు కారణమవుతుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gpFWmE

No comments:

Post a Comment

'BJP Micromanaged 48 Seats We Won'

'Every Haryana assembly seat has its own unique problems to earn victory for a political party and you as a politician need to know what...