దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవంలో మహామహులు సైతం ఇరుక్కుపోతున్నారు. సామాన్య ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరినీ కరోనా కాటేస్తోంది. అయితే లెజెండరీ గాయకుడు గాన గంధర్వుడు కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అశేష సినీ లోకం కోరుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన డైలాగ్ కింగ్ .. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ ఆయనతో సాన్నిహిత్యం, ఆ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ''మేమిద్దరం చాలా సన్నిహితులం. నేను బాలు అంటుంటాను. ఆయన నన్ను శిశుపాల, భక్త అంటుంటారు. ఎప్పుడో ఒకసారి మోహన్ బాబు అని పిలుస్తారు. చిన్నతనం నుంచే.. అంటే కాళహస్తిలో బడికి పోయే రోజుల్లో నుంచే మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక సాధారణంగా గాయకులు ఎక్కువ శాతం ల్యాబ్ లోకి రాగానే ముందుగా డబ్బు తీసుకుంటారు. నేను ఎన్నో సినిమాలకు బాలుతో కలిసి పనిచేశాను. కానీ ఆయన ఏనాడూ డబ్బుకు ఆశ పడలేదు. Also Read: ఒకానొక సందర్భంలో నేనే బాలసుబ్రహ్మణ్యం దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నా. భోజనం లేక ఆ అప్పు చేశాను. ఆ అప్పు ఇంకా తీర్చలేదు. అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు.. ఏమయ్యా ఆ 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికి అది కోటి అయి ఉంటుందని. బాలు అదే గొంతుతో సర్వ దేవతల గీతాలు పాడావు. వాళ్ళందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి రావాలి. ఆయన తొందరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం'' అని మోహన్ బాబు అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3le24mH
No comments:
Post a Comment