ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నట సింహం నందమూరి బాలయ్య.. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ మహానాడులో పాల్గొన్న ఆయన.. ఈ అరాచక పాలన అంతానికి ఐదేళ్లు అవసరం లేదని.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదన్నారు.. త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఇటీవల జగన్ పాలనపైన ప్రశంసలు కురిపిస్తూ ప్రతిపక్ష పార్టీ తప్పుల్ని ఎత్తి చూపిన నటుడు .. బాలయ్య కామెంట్స్‌పై స్పందిస్తూ.. బాలయ్య బాబు కారణం లేకుండా కామెంట్స్ చేయరని.. ఆయన కోపానికి కూడా అర్థం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు కోపం.. కొడతారు.. లాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి క్లారిటీ ఇచ్చారు. ‘వేరే వాళ్ల ఒపీనియన్‌ని నేను తీసుకోను కాని.. బాలయ్య ఈ కామెంట్స్ చేశారంటే.. ఆయనకున్న అవగాహన ఆయనకు ఉంటుంది.. ఎంతైనా ఆయన ఎమ్మెల్యే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆయనకు వేరే ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది.. ఊరికే ఇలాంటి కామెంట్స్ చేయరు కదా.. పైగా ఆయన పెద్ద హీరో. ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యల వెనుక వేరే ఏదో ఉండే ఉంటుంది. బాలయ్య బాబు అనుకుంటే.. ఏదైనా చేస్తారు. దానికి చాలా ధైర్యం కావాలి. పాట పాడాలనిపిస్తే పాడేస్తారు. అది నచ్చడం నచ్చకపోవడం వినేవాళ్ల ఛాయిస్. ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారు.. ఎవరైనా నచ్చకపోతే.. నువ్ నచ్చలేదు.. నువ్ నా ముందు కనిపించకు అని ముఖం మీదే చెప్తారు.. అప్పుడు కూడా కనిపిస్తే రెండు పీకుతారు. అది వేరే విషయం. ఆయన నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే.. నచ్చింది అంటే ఇక తిరుగు ఉండదు. ఏదైనా చేసుకోవచ్చు. ఆయన దేనికైనా ఓకే అంటారు. వేరే వాళ్ల గురించి ఆయన దగ్గర బ్యాడ్‌గా చెప్పినా.. ఆయనకు నచ్చిదంటే.. నాకు తెలుసు వాడి గురించి నువ్ పక్కకు వెళ్లు అంటారు. బాలయ్య బాబు చిన్న పిల్లాడు అంటే.. నిజంగా చిన్న పిల్లాడే.. మనసులో వేరే ఏం ఉండదు. కోపం వస్తే తిట్టేయడం.. ప్రేమ కలిగితే కూర్చోబెట్టి ఆప్యాయంగా పలకరించడం.. ఈ రెండే తెలుసు ఆయనకి. ఆయనకు కోపం కూడా ప్రతిసారి రాదు. కోపానికి కారణం ఉంటుంది. చాలామంది ఆయనకు కోపం ఎక్కువ అంటారు కాని.. చాలా సహనం తరువాత కోపం వస్తుంది ఆయనకి. కోపం వచ్చిందటే డైరెక్ట్‌గా చూపిస్తారు. మనం అయితే చుట్టూ ఉన్నవాళ్ల గురించి ఆలోచిస్తాం.. ఆయనకు అదేం ఉండదు సహనం నశిస్తే.. వేసిపారేయడమే. ఆయన ఊరికే కొట్టేయరు.. ప్రతిదానికి కారణం ఉంటుంది. అలాగే కూడా.. ఆయన్ని నేను బాగా దగ్గర్నుంచి చూశా.. విష్ణు బాబు డేట్స్ నేనే చూస్తాను కాబట్టి మోహన్ బాబు అంటే ఏంటో నాకు తెలుసు. కోపం వస్తే కొట్టేయడం మాత్రమే కాదు.. దాని వెనుక చాలా ఓపిక, సహనం ఉంటుంది. చాలా భరించిన తరువాత మాత్రమే రియాక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో ఎవరూ రౌడీయిజం చేయరు. వాళ్ల పని అది కాదు. అయినా ఒక్కొక్కరి ఎమోషన్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ల ఎమోషన్ ఇలా ఉంటుంది’ అంటూ ఆసక్తికర విషయాలను తెలియజేశారు రాజా రవీంద్ర.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iV7LUU
No comments:
Post a Comment