Tuesday 18 August 2020

నా ఎదుగుదల తట్టుకోలేక కుట్రకేసు.. వాళ్లని వదిలిపెట్టను: మాధవీలత షాకింగ్ పోస్ట్

నచ్చావులే హీరోయిన్ తన ఫేస్ బుక్‌లో ఎలాంటి పోస్ట్ పెట్టినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతుంటారు. ఒక్కోసారి పచ్చి బూతులు కూడా తిడుతుంటారు. అయితే మాధవీలత కూడా ఆ విషయంలో తక్కువ కాదంటూ అమ్మనా బూతులతో కౌంటర్ ఇస్తుంటుంది. కామెంట్ బాక్స్‌లో వీళ్ల బూతుల పంచాంగం చూస్తే.. వామ్మో ఇదేం రచ్చరా దేవుడా అని ఆశ్చర్యపోవాల్సిందే. అయితే కొన్ని విషయాల్లో తనకు తోచిన అభిప్రాయాన్ని అవగాహనా లోపంతో ఫేస్ బుక్‌లో షేర్ చేసే మాధవీలతను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. అయితే ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పోస్ట్‌లను కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ కండువా కప్పిన తరువాత నాటి నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన మాధవీలత తరచూ ఏదొక వివాదాస్పద పోస్ట్‌తో వార్తల్లో ఉంటోంది. ఇటీవల ఆమె హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడంతో మాధవీలతపై 295-A సెక్షన్ కింద కేస్ నమోదు చేసినట్టు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాను పెట్టిన పోస్ట్‌లో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో తనకు అర్థం కావడంలేదని క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ పెట్టింది మాధవీలత. ‘నేను పెట్టిన కామెంట్ ఏంటంటే మోడీ గారు ముస్లిమ్స్ అందరిని తీవ్రవాదులుగా పరిగణిస్తున్నారు.. కేవలం ముస్లిమ్స్ ఒకరే ఉన్నారా హిందుస్‌లో లేరా? అని అడిగినందుకు ఆ ముస్లిం సోదరుడికి నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే.. కాదు సోదర ... అందరు కాదు కొందరు సహకరిస్తున్నారు. అందులో హిందుస్ కూడా ఉన్నారు.. మీరు చెడ్డవారు కాదు అని నేను సమాధానం ఇచ్చాను. ఇందులో హిందువులని నేను ఎక్కడ అగౌరపరిచానో చెప్పండి. కన్నయ్య కుమార్, హర్ష మందర్ అలాగే మరికొంతమంది హిందువులు సహరించేవాళ్ళు ఉన్నారు. అలాగే దేశంలోనే ఉంటూ.. హింసకి పాల్పడేవాళ్లు దేశాన్ని అమ్మేసేవాళ్ళు.. మనుషుల అవయవాలు అమ్ముకునేవాళ్ళు.. మావోయిస్ట్స్, స్కిన్ మాఫియా డ్రగ్స్, ఆయుధాల సరఫరా.. ఇలాంటి ఎన్నో విచ్చిన్నశక్తులు వీళ్లంతా కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అని నా ఉద్దేశ్యం.. ఇది చెప్పడం తప్పు కాదని నా భావన. నేను హైందవం లో పుట్టాను అలానే చస్తాను. అలాగే మోదీ జి ని టెర్రరిస్ట్ అంటూ ఎంతోమంది నా పేజీలో అంటున్నారు వారిని నేను వదిలిపెట్టను.. నా హైందవ ధర్మాన్ని కానీ.. నా పార్టీ ని కానీ.. మోడీజీ కానీ ఎవెరెమాన్న ఊరుకోను.. నేను పెట్టిన కామెంట్ తెలుగుని ఇంగ్లీష్‌లో రాయడం వల్ల కేసు పెట్టిన వాడికి కేసు తీసుకున్న పోలీసుకి ఆ కామెంట్ అర్ధం కాక పాపం మీడియా కి ఇచ్చి చవకబారు పుబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేసి నా పరువుతో ఆడుకుందాం అనుకున్నారు.. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలు, మా పార్టీ మీద కక్షతో ఇక్కడ మహిళలు సినిమా రంగం నుండి వచ్చి ఎదుగుదలకి తట్టుకోలేని వారి యొక్క కుట్రలకు నేను తలవంచను.. నేను కూడా చట్ట పరంగా న్యాయపరంగ మాట్లాడతాను. ఇలాంటి చవకబారు నిందలకి నేను భయపడను. నిజాలు మా సినిమాల్లో చూస్పిస్తే చప్పట్లు కొడతారు.. అదే నిజాన్ని నేను చెప్తే ద్వేషిస్తారు.. ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఐన ఫాల్లోవెర్స్‌కి రిప్లై పెట్టడం నా తప్పు. నన్ను ద్వేషించే వారికీ కూడా హాని చేయకూడదుఅంత మనవాళ్ళు అనుకోవడం నా పొరపాటు. ధన్యవాదాలు ప్రేమతో మాధవీలత’ అంటూ క్లారిటీ ఇచ్చింది మాధవీలత. వివాదానికి కారణమైన మాధవీలత ఫేస్ బుక్ పోస్ట్ ఇదే..


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Q69fiB

No comments:

Post a Comment

'Young Desi Men May Vote For Trump'

'One of the big findings is that younger men seem to have shifted towards the Republican Party.' from rediff Top Interviews https:...