టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఆయన.. తన తండ్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ఆగిఉన్న లారీని ఢీ కొట్టడంతో కమలాకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి (75) కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న కమలాకర్ రెడ్డికి కూడా కరోనా సోకింది. ఈ క్రమంలో నెల్లూరు సమీపంలోని పల్లెటూరిలో ఉంటున్న ఈ ఇద్దరూ మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ వస్తుంటే ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టడంతో అందులో ఉన్న కమలాకర్ రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరే . గత 25 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో డిస్టిబ్యూటర్‌గా, ఎగ్జిబ్యూటర్‌గా సేవలందించారు. అర్జున్ రెడ్డితో పాటు పలు చిత్రాలకు, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, డిస్నీ వార్నర్ బ్రదర్స్, సోనీ పిక్చర్స్ రూపొందించిన చిత్రాలకు డిస్టిబ్యూటర్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iWbdOX
No comments:
Post a Comment