ఇప్పుడంటే.. శ్రీలంక క్రికెట్ టీం ఫామ్‌లో లేదు కాని.. ముత్తయ్య మురళీధరన్, జయసూర్య, వాస్, జగవర్ధనే, దిల్సాన్, కుమార సంగక్కర లాంటి వరల్డ్ క్రికెటర్స్ టీంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధులకు చెమటలు పట్టేవి. ముఖ్యంగా మెలికలు తిరుగుతూ వేసే బంతుల్ని ఎదుర్కొవాలంటే ప్రత్యర్థులకు చుక్కలు కనిపించేవి. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్‌గా 800 వికెట్లు తీసిన యోధుడిగా క్రికెట్ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసిన మురళీధరన్ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. క్రికెటర్ మురళీధరన్‌గా కనిపించబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 800 వికెట్లు తీసి వండర్ ఆఫ్ క్రికెట్ కీర్తించబడ్డ మురళీధరన్ సేవలకు గుర్తింపుగా ఈ సినిమాకి ‘800’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మురళీధరన్ లుక్ కోసం బాగా శ్రమిస్తున్నారట. మెలికలు తిరిగే బౌలింగ్ యాక్షన్ కోసం కోచ్‌ని ఏర్పాటు చేసుకున్నారట. అంతేకాదు.. ఇందుకోసం విజయ్ సేతుపతి 15 కేజీలు పైగానే బరువుతగ్గినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ElvAWH
No comments:
Post a Comment