Sunday 2 August 2020

తెగించే వచ్చా.. నా పడక గదిలో కెమెరాలు పెట్టాలని చూశారో! రెచ్చిపోయిన మాధవీలత

సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు సోషల్ మీడియా వేదికగా మరోసారి రెచ్చిపోయింది. తనను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా చేసుకుని ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్లు ఇస్తూ ఏకిపారేసింది. ఎవరైనా తన జోలికి వస్తే మాత్రం ఇత్తడైపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. అమ్మ నాన్నకు పుట్టి ఉంటే పద్దతిగా ఉండండి అనేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. గత కొంతకాలంగా మాధవీలతను లక్ష్యంగా చేసుకుని కొందరు బీజేపీ నేతలతో పాటు.. పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మాధవీలత- నెటిజన్ల మధ్య వార్ పెద్దదైంది. ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదని, గొప్ప వాళ్లతో పరిచయాలు, రికమండేషన్స్ ఉంటే చాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత.. తాజాగా అందరికీ దిమ్మతిరిగే వ్యాసం రాసి పోస్ట్ చేసింది. ''నేను పార్టీ‌లో చేరినపుడు ఏ మాట అయితే చెప్పానో.. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. అది నా పార్టీ అయినా సరే.. తప్పు చేస్తే తప్పే వెంటనే చెప్పేస్తా. నన్ను పార్టీ నుంచి దూరం పెడతారు అనే భయం లేదు. దూరమవుతా అనే బెంగ కూడా లేదు. నేనెపుడు దేశం కోసం ధర్మం కోసం పని చేస్తాను కానీ మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు. సమయం సందర్భం చూసి ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో చెబుతా. మోడీజీ స్టైల్‌లో పేరు చెప్పను కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇత్తడైపోద్ది. ఇది పగ కాదు ప్రతీకారం కాదు.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బాధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు. తమ సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్‌కి లొంగటం తప్పు. నేను ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరికీ బానిసని కాను ఊడిగం చేయను. అడుక్కోను. ఆ అవసరం నాకు లేదు. సినిమా రంగంలో సమస్యలు తెలిసే వచ్చా. పోరాడే తెలివి ఉంది కనుక అలాగే బతికా.. రాజకీయంలో చదరంగం తెలిసి ఉండాలి. నాకు అంతగా రాకపోయినా తెగించి వచ్చా. ఎవరికీ భయపడను. ఎవరికీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు'' అంటూ రెచ్చిపోయింది మాధవీలత. Also Read: ''పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా మంచోళ్ళా అంటే ఎప్పటికీ కాదు అనే అంటాను. మాట మార్చేదే లేదు. నేనింతే మీకు ముక్కు సూటిగా మాట్లాడతా. నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం పక్కవాళ్ళ జీవితంలో వేలు పెట్టడం సంస్కార హీనం. సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా.. మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం, ఛండాలం అది క్రైమ్ అని. నా పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్‌బుక్‌లో దూరి తిడతాం అంటే ఇత్తడయిపోద్ది. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు. కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటే ఎప్పటికీ దిగజారుడు బతుకుగానే ఉంటుంది. ఒకరిని సంతోష పెట్టకపోయినా పరవాలేదు బాధ పెట్టొద్దు ఎవరి అశాంతికి కారణం కావొద్దు'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది మాధవీలత. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31bOUxx

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...