కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డాక్టర్లు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ కరోనా విలయతాండవానికి బ్రేకులు పడటం లేదు. గతంలో పోల్చితే వేగంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించే పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర వైద్య పరికరాలు పెద్ద ఎత్తున అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో తన నియోజక వర్గంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తున్న బాలకృష్ణ.. తాజాగా హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు 55 లక్షల రూపాయల విరాళం ప్రకటించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు కరోనా వైరస్ నివారణకై ఉపయోగించే మందులు, కావాల్సిన పీపీఈ కిట్స్, మాస్కులు, ఇతర అన్ని పరికరాలను అందించడానికి ఈ విరాళాన్ని ప్రకటించారు బాలకృష్ణ. కాగా ఈ కల్లోల పరిస్థితుల్లో సినీ కార్మికుల కోసం 'సీసీసీ మనకోసం' అందించిన సాయం లోనూ భాగం పంచుకున్న బాలయ్య బాబు గతంలో 25 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున అందించారు బాలయ్య. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ బాలయ్య చేసిన సాయానికి పలువురి ప్రశంసలు దక్కుతున్నాయి. Also Read: ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రూపొందుతోంది. బాలయ్య డిఫరెంట్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానుల్లో ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదాపడ్డ ఈ మూవీ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gnlmTk
No comments:
Post a Comment