Friday, 21 August 2020

ఒకే రోజు: చిరంజీవికి 65 ఏళ్లు.. ‘చంటబ్బాయ్’కి 34 ఏళ్లు!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అగ్రస్థానంలో నిలబడటానికి కారణం ఆయన చేసిన కమర్షియల్ మూవీస్. ‘ఖైదీ’తో స్టార్ డమ్ సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత ఎన్నో యాక్షన్ మూవీస్ చేశారు. మాస్ ఆడియన్స్‌ను అలరించారు. తన డ్యాన్స్‌లు, ఫైట్లతో ఉర్రూతలూగించారు. అయితే, చిరంజీవి కేవలం కమర్షియల్ మూవీస్‌కే పరిమితం కాలేదు. ఆయన కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘ఆపద్బాంధవుడు’ లాంటి క్లాసిక్ మూవీస్‌తో ఇలాంటి సినిమాలు కూడా చేయగలనని చిరంజీవి నిరూపించారు. అయితే, తాను మాస్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో ‘చంటబ్బాయ్’ లాంటి కామెడీ డ్రామాను చేయడం చిరంజీవి చేసిన సాహసమే. కానీ, ఆ సాహసం వర్కౌట్ అయ్యింది. కామెడీని కూడా చిరంజీవి అద్భుతంగా పండించగలరని ఈ సినిమా నిరూపించింది. ‘పాండ్.. జేమ్స్ పాండ్’ అంటూ ప్రైవేట్ డిటెక్టివ్‌ పాండు రంగారావుగా చిరంజీవి చేసిన కామెడీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. హాస్య బ్రహ్మగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న జంధ్యాల ‘చంటబ్బాయ్’ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్. Also Read: ‘చంటబ్బాయ్’ సినిమా 1986 ఆగస్టు 22న విడుదలైంది. అంటే, చిరంజీవి పుట్టినరోజు నాడే. ఈరోజు చిరంజీవి తన 65వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇదే రోజు ‘చంటబ్బాయ్’ సినిమా 34 ఏళ్లు పూర్తిచేసుకుంది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘చంటబ్బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు జంధ్యాల. జ్యోతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భీమవరపు బుచ్చిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని పాటలన్నింటినీ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల ఆలపించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gl8NaO

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8