స్టార్ హీరోల బడా ప్రాజెక్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని టాలీవుడ్ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వరుస పెట్టి పెద్ద సినిమాలు లైన్‌లో ఉండటంతో ఆయా సినిమాల అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ '' నుంచి కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. 'గీత గోవిందం' సినిమా తర్వాత దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమానే ఈ 'సర్కారు వారి పాట'. స్పెషల్‌గా మహేష్ కోసమే ఎంతో ఇష్టంగా ఈ కథ సిద్ధం చేసి రూపొందిస్తున్నారట పరశురామ్. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న చిత్రయూనిట్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్నారట. నిజానికి సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుచాలని ప్లాన్ చేశారు కానీ అనివార్య కారణాలతో సమ్మర్‌కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మహేష్ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయిందట సర్కారు వారి పాట టీమ్. సంక్రాంతి కానుకగా మొదటి పాటను విడుదల చేస్తారని భావిస్తున్న ఫ్యాన్స్ కల నెరవేరబోతోందట. తాజాగా ఈ విషయమై హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ''మీ మాటలు విన్నాం.. మేము కూడా వింటున్నాం.. అతి త్వరలో మీరు మా నుండి వింటారు. పరశురామ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సూపర్ బెస్ట్ ఇస్తున్నారు. దీని కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడుతోంది'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు తమన్. సో.. ఈ లెక్కన చూస్తే సంక్రాంతితో మొదలుపెట్టి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో అలరించనుందన్నమాట సర్కారు వారి పాట టీమ్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qRQK3z
No comments:
Post a Comment