దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన చిత్రం . ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్‌లు నటించారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ ప్రభావంతో ఆగిపోయింది. ఇది అభిమానులను, సినీ ప్రేమికులను నిరాశ పరిచే అంశమే. అయినా పరిస్థితుల దృష్ట్యా తప్పలేదు. ఇప్పటికే సినిమాను నాలుగు సార్లు విడుదల చేస్తన్నామని నాలుగు సార్లు ప్రకటించి వాయిదా వేశారు. ఇప్పుడు అందరూ RRR సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో, ఈ సినిమాకు మరో అడ్డంకి ఏర్పడింది. అల్లూరి, కొమురం భీమ్ చరిత్రలను వక్రీకరించారని చెబుతూ పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య హైకోర్టులో పిల్ వేశారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని పిటీషనర్ కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డికి చెందిన ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరపనుంది. చరిత్రలో కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని స్నేహం చేసి, గొడవలు పడ్డప్పుడు వారి ఆలోచనలు పరస్పరం ఇచ్చి పుచ్చుకుని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ కథాంశంతో RRR మూవీ రూపొందింది. ఇది ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ అని రాజమౌళి ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. మరిప్పుడు హైకోర్టులో వేసిన పిల్‌పై ధర్మాసనం ఎలాంటి తీర్పు చెప్పనుందో చూడాలి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య నిర్మించిన చిత్రమిది. , చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్ , ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంటి బాలీవుడ్, హలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రమిది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pWy57d
No comments:
Post a Comment