సినిమాలకు భిన్నంగా నందమూరి బాలకృష్ణ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ‘అన్‌స్టాపబుల్’. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారమవుతున్న ఈ టాక్ షో ముందు బాలకృష్ణ ఎలా చేస్తారోనని అందరిలోనూ తెలియని ఓ ఆసక్తి, అనుమానాలు కూడా నెలకొన్నాయి. అయితే అందరికీ తన హోస్టింగ్ స్టైల్‌తో సమాధానం చెప్పేస్తున్నారు బాలయ్య. మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం - అనీల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, రవితేజ, రానా, చివరిగా మహేష్ బాబు వంటి గెస్ట్‌లతో ‘’ టాక్ షోని ఆద్యంతం ఆకట్టుకునేట్టుగా హోస్ట్ చేశారు నందమూరి నటసింహం. రీసెంట్‌గా పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ .. లైగర్ టీమ్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌గా టాక్ షో నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోను చూస్తుంటే ఎప్పటిలాగానే బాలయ్య నాన్ స్టాప్ ఎనర్జీతో అన్‌స్టాపబుల్ అంటూ దూసుకెళ్లిపోయారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరొకండలపై ఆయన వేసిన కౌంటర్స్ ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించాయి. ఈ పూరీ జగన్నాథ్‌తో బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు ఆయనతో కలిసి చేసిన పైసా వసూల్ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటి వరకు తను మరచిపోలేని పాత్ర తేడా సింగ్‌ను తనతో చేయించావని ఈ సందర్భంగా బాలయ్య పూరిని ఉద్దేశించి అన్నారు. అలాగే.. నేనెంత యెదవనో నాకే తెలియదు అని ఆ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను గుర్తుకు చేసుకున్నారు బాలకృష్ణ. ఈ డైలాగ్‌ను నేను చెప్పొచ్చు. కానీ ఇంకెవరైనా అంటే కొడతాను అని బాలకృష్ణ అన్నప్పుడు పూరీ జగన్నాథ్ బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఆ సినిమాలో మామా ఏక్ పెగ్ లా.. సాంగ్‌ను కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. లైగర్ టీమ్‌తో బాలయ్య చేసిన ఈ 9వ ఎపిసోడ్ .. సంక్రాంతికి ఆహాలో ప్రసారం కానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చేయబోతున్న NBK 107 సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రుతి హాసన్ హీరోయిన్. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ఇందులో విలన్‌గా కనిపించనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qgmgc8
No comments:
Post a Comment