కన్నడ రాక్ స్టార్ పుట్టినరోజు శనివారం (జనవరి 8). ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం KGF Chapter 2 నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ‘‘కొత్త లక్ష్యాలను సృష్టించడానికి నువ్వొక నిజమైన స్ఫూర్తినిచ్చావు. ఈ ఎదుగుదలలో నీతో కలిసి కొత్త కథను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తామనే నమ్మకం ఉంది. మరిన్ని అప్‌డేట్స్ వస్తాయి’’ అంటూ యష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్‌ను గమనిస్తే యష్ ఇన్‌టెన్స్‌గా చూస్తున్నారు. ఆయన పక్కనున్న సైనింగ్ బోర్డులో ప్రమాదం ముందుంది అని రాసి ఉండటాన్ని చూడొచ్చు. పక్కా మాస్ ఆడియెన్స్‌కు మెప్పించేలా పోస్టర్ ఉంది. KGF Chapter 2 తో ఇక రాకీ భాయ్‌గా సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రను సృష్టించడానికి యష్ సిద్ధమవుతున్నారు. ‘కేజీయఫ్ ఛాప్టర్ 1’ తో నరాచిలో మొదలైన రాకీభాయ్ దండయాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఈ దండయాత్రను KGF Chapter 2తో చేయడానికి యష్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న KGF Chapter 2 ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. KGF Chapter 2 చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.KGF Chapter 2 సినిమా టీజర్ 200మిలియన్ వ్యూస్‌కు పైగా 8.6 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. KGF Chapter 1 పాన్ ఇండియా మూవీగా సరికొత్త సంచనాలకు తెర తీయడంతో అందరూ KGF Chapter 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వెనక్కి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌లపై అందరిలో తెలియని టెన్షన్ నెలకొంది. అయితే తాము ఏప్రిల్ 14న పక్కాగా రాబోతున్నామని పోస్టర్ ద్వారా మరోసారి డేట్ గురించి చెప్పకనే చెప్పేశారు హోంబలే నిర్మాణ సంస్థ ప్రతినిధులు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33d9QJl
No comments:
Post a Comment