గత కొన్ని రోజులుగా పలు కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న .. కెరీర్ పరంగా యమ స్పీడుగా దూసుకుపోతోంది. ఇటీవలే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ప్రేక్షకులను మైమరిపించిన సామ్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులను చకచకా కంప్లీట్ చేసే పనిలో ఉంది. కొన్ని రోజుల క్రితమే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' షూటింగ్ ఫినిష్ చేసిన ఆమె ఇప్పుడు '' సినిమాపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ చెప్పారు చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. శ్రీదేవి మూవీస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'యశోద'. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్‌లో అడుగుపెడుతోంది. ఈ సినిమాతో హరి - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి భారీ ఎత్తున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్.. తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. గురువారం రోజు నుంచి మొదలైన ఈ షెడ్యూల్‌లో సమంత సహా కీలక తారాగణంతో పలు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. ఈ నెల 12 వరకు రెండో షెడ్యూల్ షూట్ జరుగుతుందని, ఆ తర్వాత వెంటనే మూడో షెడ్యూల్ ప్రారంభించి మార్చి నెలలో 'యశోద' షూటింగ్ అంతా ఫినిష్ చేసేలా ప్లాన్ చేశామని నిర్మాత తెలిపారు. ఇకపోతే ఈ సినిమాకు మణిశర్మ బాణీలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ యశోద ప్రేక్షకుల ముందుకు రానుంది. అతిత్వరలో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తాం అంటున్నారు మేకర్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qUDVp3
No comments:
Post a Comment