స్టార్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగ చైతన్యతో విడాకుల ఇష్యూ తర్వాత ఆమెకు సంబంధించిన ప్రతి అంశం వైరల్ అవుతోంది. మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనను తాను మోటివేట్ చేసుకుంటూ వ్యక్తిగత సమస్యలు అధిగమించి స్ట్రాంగ్‌గా ఉన్నానని హింట్స్ ఇస్తోంది సామ్. ఈ నేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ వేదికగా సమంత చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓ స్టార్ హీరోపై సమంత చేసిన ఓ కామెంట్. ప్రస్తుతం తన కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టిన సమంత.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు యాడ్ షూట్స్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ యాడ్ చేసిన సమంత, సదరు యాడ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అక్షయ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్‌లో దొంగలా నటించారు. ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి ఓ ఫుడ్ ఐటెం చూసి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతారు అక్షయ్. ఇంతలో పోలీసులకు ఫోన్ చేసి ఆ దొంగను పట్టించేస్తుంది సమంత. ఈ సన్నివేశాలతో కూడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సమంత.. సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మీరు.. ఇలా దొంగగా మారిపోతారా? మీ ప్రవర్తనలో ఈ మార్పేంటి? అని కామెంట్ చేస్తూ అక్షయ్‌ని ట్యాగ్ చేసింది. దీంతో సమంత చేసిన ఈ ఫన్నీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంతకు ఉత్తరాదిన మంచి క్రేజ్ అందుకున్న సమంత.. ప్రస్తుతం భాషాభేదం లేకుండా సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటికే తెలుగులో శాకుంతలం మూవీ షూటింగ్ ఫినిష్ చేసిన ఆమె, 'యశోద' అనే మరో ప్రయోగాత్మక సినిమాలో నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Fdlcu4
No comments:
Post a Comment