శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన.. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు సహా బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా మారింది. రీసెంట్‌గా విడుదలైన పుష్ప ది రైజ్‌లో శ్రీవల్లిగా నటించి పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందని కొన్ని రోజుల నుంచి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ. కొన్ని రోజుల ముందే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుంటే అక్కడి మీడియా ఆ విషయాన్ని పసిగట్టేసింది. ఇటు విజయ్ దేవరకొండ.. అటు రష్మిక మందన ఇద్దరూ తమ డేటింగ్ చేస్తున్నామనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ వాళ్ల వాలకం చూస్తే చెప్పకనే తెలిసిపోతుంది. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో రష్మిక మందన ఎక్కువగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతోనే తన ఖాళీ సమయాన్ని గడుపుతుంటుందని సినీ వర్గాల్లో వినిపించే వార్తలు. ఇప్పుడు వారిద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారు. ఇక చెప్పేదేముంది.. ఈ జోడీ మరింత సరదాగా తమ సమయాన్ని వెళ్లదీస్తున్నారు. విజయ్ దేవకొండ కుటుంబ సభ్యులతోనే రష్మిక మందన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదు. కానీ నెటిజన్స్ సోషల్ మీడియాలో న్యూ ఇయర్ రోజున రష్మిక పోస్ట్ చేసిన ఫొటోను బట్టి పసిగట్టేశారు. న్యూ ఇయర్ రోజున రష్మిక ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలుచుకుని ఫొటో తీసుకుంది. అదే రోజున విజయ్ దేవరకొండ సోదరుడు.. హీరో ఆనంద్ దేవరకొండ కూడా అందరికీ న్యూ ఇయర్ విషెష్ చెబుతూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ రెండు ఫొటోల్లో బ్యాగ్రౌండ్ ఒకటే అని క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. దీంతో నెటిజన్స్ విజయ్ దేవరకొండ, అతని ఫ్యామిలీతో కలిసే రష్మిక తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుందని కన్‌ఫర్మ్ చేసేశారు. దీంతో విజయ్ దేవరకొండ - రష్మిక మందన డేటింగ్ చేస్తున్నారనే వార్త మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోన్న రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఓ చిత్రం మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతన్ భగ్చీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రియల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని తెలుసుకోవడానికి ఇండియా నిర్వహించిన అతి పెద్ద కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగానే ఈ మూవీ రూపొందుతోంది.వచ్చే ఏడాది మే 13న సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు గుడ్ బై అనే మరో సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తోంది. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాలో అమితాబ్ కుమార్తె పాత్రలో రష్మిక మందన్న నటించనుంది. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో గుడ్ బై సినిమా విడుదలవుతుందని టాక్. ALSO READ :
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/349WDRL
No comments:
Post a Comment