అక్కినేని హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. కరోనా కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డా కూడా ధైర్యం చేసి బరిలోకి దిగుతున్నాడు . చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రిలీజ్‌కి ముందే సినిమాపై భారీ బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా బయటకొచ్చిన 'బంగార్రాజు' ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఒకింత ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేస్తున్న బంగార్రాజు సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్‌గా జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరగొచ్చని అంతా భావించారు. కానీ దానికి ఇంకో 4 కోట్లు యాడ్ చేసుకొని 34 కోట్ల మేర రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. రెస్ట్ అఫ్ ఇండియాలో 2.50 కోట్లు, అలాగే ఓవర్సీస్‌లో మరో 2.50 కోట్లు మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్ 39 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తాజాగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో 40 కోట్ల టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాడట బంగార్రాజు. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకోవడం, పైగా పోటీలో ఏ పెద్ద సినిమా లేకపోవడం బంగార్రాజుకు బాగా కలిసొచ్చే అంశాలని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో.. చూడాలి మరి ఈ బంగార్రాజు సంక్రాంతి సక్సెస్ అందుకుంటాడా? లేదా అనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34BNBxi
No comments:
Post a Comment